రోజు: డిసెంబర్ 27, 2012
-
ప్రణయ తత్త్వము … షెల్లీ, ఆంగ్ల కవి
1 చిన్నచిన్ననీటిబుగ్గలు నదులలో కలుస్తే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి; రసనిష్యందమైన భావనలతోనింగిలో కలుస్తాయి సువాసనలు వెదజల్లే పిల్లగాలులు ; ప్రకృతిలో ఏదీ ఒంటరిదికాదు. దైవసంకల్పం వలన ఆత్మలు అన్యోన్యానురక్తితో ఏకమౌతున్నప్పుడు, నేను నిన్నెందుకు కూడతగదు? 2 అనంతాకాశాన్నిగిరిశిఖరాలు ముద్దాడుతున్నై కెరటాలు ఒకదాన్నొకటి కాగలించుకుని పరుగిడుతునై; ఒక చెట్టు పూలే, అయినా,ఒకదాన్నొకటి నిరశించి పెడముఖం పెట్టడం లేదే; వేల బాహువులతో సూర్యుడు భూమిని ఆలింగనం చేస్తున్నాడు చంద్రకిరణాలుకూడా సముద్రాన్ని చుంబిస్తున్నై ఇంతటి ప్రకృతి రాగరసార్ణవానికీ ప్రయోజనమేముంది ప్రేమతో నువ్వు…