పోస్టాఫీసులోని సిరాబుడ్డికి … క్రిష్టఫర్ మోర్లీ, అమెరికను కవి
.
ఎన్ని హృదయాలు వినయంగా నీలో మునకలిడి
తమ చేతివ్రాతలుగా మిగిలి ఉంటాయి!
తమ ఆంతరంగిక విషయాలు పంచుకునీ, బాధల్ని వెలిబుచ్చీ,
తమ వింత, తమాషా వ్యవహారాల్ని నీతో చెప్పుకుని ఉంటాయి!
నీ సిరా స్రవంతీ, నీ తడబడిరాసే కలమూ
ఎన్ని పుట్టబోయే జీవితాలని ప్రభావితంచేసి ఉంటాయి,
నిట్టూర్పులు విడుస్తూ, విరహులైన యువ జంటలు
స్వర్గాన్నే పోస్టుకార్డుమీదకి ఎక్కించడం చూసి ఉంటాయి!
.
క్రిష్టఫర్ మోర్లీ
(5 May 1890 – 28 March 1957 )
అమెరికను కవి
.
