వృద్ధుడు… జీన్ స్టార్ అంటర్ మేయర్, అమెరికను కవయిత్రి
.
చూసి నడుస్తున్నట్టు కనిపించని నడకతో ఆ వృద్ధుడు
తలవంచి నడుస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తోంది
దేనిగురించి ఆలోచిస్తున్నాడు చెప్మా అని:
రాబోయే క్రిమిజన్మగురించా? గడచినదాని గురించా?
.
లేక తనచూపును అంతర్ముఖం చేసి
పరిసరాలు గూర్చిన స్పృహ విడిచి
ఊహాలోకాల్లో శాశ్వతత్వం గురించి
పేకమేడలు కడుతున్నాడో?
.
జీన్ స్టార్ అంటర్ మేయర్
(May 13, 1886 – July 27, 1970)
అమెరికను కవయిత్రి.
.
Old Man
.
When an old man walks with lowered head
And eyes that do not seem to see,
I wonder does he ponder on
The worm he was or is to be.
.
Or has he turned his gaze within,
Lost to his own vicinity;
Erecting in a doubtful dream
Frail bridges to infinity
.
Jean Starr Untermeyer
(May 13, 1886 – July 27, 1970)
American Poetess
For an excellent bio please visit: http://jwa.org/encyclopedia/article/untermeyer-jean-starr