ప్రతీకలు … ఫెర్నాండో పెసో, పోర్చుగీసు కవి

ప్రతీకలా? … నాకు చెప్పకండి. విసిగెత్తిపోయాను…

కొంతమంది అన్నీ ప్రతీకలే అని అంటారు.

అలా అనడంవల్ల వాళ్ళు నాకు చెప్పేదేమీ లేదు.

.

ప్రతీకలంటే ఏమిటి? కొన్ని ఊహలు… అంతే.

సూర్యుడు ఒక ప్రతీక… సరే

చంద్రుడు ఒక ప్రతీక… సరే

భూమి ఒక ప్రతీక… అది కూడా సరే.

కానీ, సూర్యుడ్ని ఎవడు పట్టించుకుంటున్నాడు

వర్షంకురిసి కురిసి అలా వెలిసిన తర్వాత

మేఘాల మధ్య ఖాళీలోంచి కనిపించి

తనవెనక ఉన్న నీలాకాశాన్ని చూపించినప్పుడు తప్ప?

అసలు చంద్రుణ్ణెవడు నిజంగా గమనిస్తున్నాడు,

అతను వెదజల్లే వెన్నెలలని మెచ్చుకోడం తప్ప?

అసలు ఎవడు తను నడుస్తున్న నేలని గుర్తిస్తున్నాడు?

భూమి అంటే మనసుకి చెట్లూ, పుట్టలూ,

పొలాలూ, గుట్టలూ ముందు గుర్తొస్తాయి.

అలా తెలియకుండా భూమికి అపచారం చేస్తున్నాం…

ఎందుకంటే, భూమంటే, సముద్రం కూడా.

.

సరే, ఇవన్నీ ప్రతీకలని ఒప్పుకుందాం.

కానీ, ప్రతీక అంటే ఏమిటి?

సూర్యుడూ, చంద్రుడూ, భూమీ కాదు…

ఈ చెల్లాచెదరవుతున్న మేఘాలమధ్య చిక్కుకున్న సూర్యుడు

సమయానికి ముందే అస్తమిస్తుంటే, ఆకాశానికి అటుచివర

అప్పుడే చంద్రుడు మంత్రిస్తున్నట్టు కనపడుతుంటే,

చిట్టచివరి పగటివెలుగు రేక,

మొన్నటి వరకూ ఆమెతో కలిసి ఉన్న యువ సహచరుడు

ఆమెని విడిచివెళ్ళడంతో, ఆ మూలని సందేహంతో తచ్చాడుతున్న

ఆ దర్జీ యువతి తలపై తళుక్కున ఒక్కసారి మెరవడమా ?

ఇప్పుడు నాకు ఏ ప్రతీకలూ వద్దు.

ఇప్పుడు కావలసిందల్లా,

పాపం, శల్యావశిష్టమైన ఒంటరి అనాథ …

ఆ దర్జీయువతి దగ్గరకి ఆమె యువ సహచరుడు తిరిగి చేరడం.

.

ప్రతీకలా? … నాకు చెప్పకండి. విసిగెత్తిపోయాను…

కొంతమంది అన్నీ ప్రతీకలే అని అంటారు.

అలా అనడంవల్ల వాళ్ళు నాకు చెప్పేదేమీ లేదు.

.

ఫెర్నాండో పెసో

(June 13, 1888 – November 30, 1935)

పోర్చుగీసు కవి

బహుశా ఏ ప్రపంచభాషలోనూ ఇతనిలా అనేకమైన మారుపేర్లతో, వాటికి తగ్గ వ్యక్తిత్వాలూ, శైలీ, భాషా, విషయాలతో సాహిత్యం సృష్టించిన వారు ఉండరేమో. ఈ కవితలో మనకళ్ళెదుట కనిపిస్తున్న సమస్యలకి ఎలా స్పందించాలో చెబుతున్నాడు కవి. ఇలాంటి చోట్ల కవిత్వీకరించడం కంటే, సమస్యకి సమాధానం కనుక్కోవడం అత్యావశ్యకం.

.

Português: Fernando Pessoa
Português: Fernando Pessoa (Photo credit: Wikipedia)

.

Symbols?

.

Symbols? I’m sick of symbols…
Some people tell me that everything is symbols.
They’re telling me nothing.

…..

.

Fernando Pessoa

Portuguese Poet

(This is a copyrighted translation by Richard Zenith, 1998 from Fernando Pessoa & Co. – Selected Poems. for complete text of translation visit:

http://www.poetryinternationalweb.net/pi/site/poem/item/7066)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: