చలి – విడిది … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి

చాలామందికి వయసు పైబడుతున్నకొద్దీ చాలా తెలుస్తాయి

అయితే, వాటికి వేటికీ నేను పెద్దగా విలువివ్వను.

.

నా రెండో పాతిక సంవత్సరాల జీవితాన్ని

యూనివర్శిటీలో నేర్చుకున్నది వదిలించుకోడంలోనూ

.

ఆ తర్వాత జరిగిన విషయాలు

అర్థంచేసుకుందికి నిరాకరించడంలోనూ గడిపేను.

.

నాకు ఇప్పుడు పత్రికలలో కనిపించే పేర్లేవీ పరిచయం లేదు.

మనుషుల్ని గుర్తుపట్టలేక వాళ్లకి కోపం తెప్పించడంతోబాటు

వాళ్ళు చెప్పిన చోట్లలోఎప్పుడూ లేనని ఒట్టేసిమరీ చెబుతున్నాను

.

నాకు నష్టం కలిగించేవి అన్నిటినీ అలా చివరి వరకూ

ఒకటి తర్వాత ఒకటి తుడిచెయ్యగలిగితే దాని ప్రయోజనం ఉంటుంది

.

అప్పుడు నాకు తెలిసినవేవీ ఇక మిగలక, నా మనసు

మంచులా, బీడువారిన పొలాల్లా, తనలోతాను ముడుచుకుపోతుంది.

.

ఫిలిప్ లార్కిన్

(9 August 1922 – 2 December 1985)

ఇంగ్లీషు కవి

(ఈ కవిత మనిషిలో వయసుతోపాటు వచ్చే ఆలోచనలోని మార్పుని సూచిస్తుంది. మొదటి రెండు పంక్తుల్లో కేవలం వయసు వల్ల తెలుసుకున్నదానిపట్ల, అంటే చదువూ, ఆలోచనద్వారా తెలుసుకోవడం కాక కేవలం అనుభవంతో తెలుసుకోవడం పై వయసులో ఉన్న ప్రతివాళ్ళకీ ఉండే సహజమైన నిరసన భావం చెప్పబడింది. జీవితంలో అడుగుపెట్టి, కొంత పరిణతి సాధించినతర్వాత, మనకున్న అపోహలు ఒక్కటొకటిగా కరుగుతున్నప్పుడు చదువు ఏ మేరకి జీవితం లో పనికివస్తుందో/లేదా పనికిరాదో  తెలిసినపుడు, అనుభవానికి ఉన్న ప్రాధాన్యత అర్థమై, కొన్ని విశ్వాసాల “unlearning” ప్రాముఖ్యత అర్థమౌతుంది.నిజానికి అందరి జీవితానుభవాలూ ఒక్కలా ఉండవు కాబట్టి ఎవరికి వారు unlearn చేసే విషయాలు మారుతుంటాయి.ఈ క్రమంలో, కొన్ని సమకాలీన మార్పులపై అవగాహన కల్పించుకుందికి అయిష్టత కలిగి వాటిని మార్పులుగా గుర్తించం, అంగీకరించం. దానిఫలితమే మనం “outdated and irrelevant” అయిపోవడం. అప్పుడు మనం Introvertగా మారి మనలోకి మనం ముడుచుకుపోతాం. ఈ సందర్భంలో కవి ఇచ్చిన ఉపమానాలు గమనించదగ్గవి: కురిసిన మంచు అలా ముద్దగట్టుకుపోతుంది, వ్యవసాయంచెయ్యని నేల గట్టిబడి బిగుసుకుపోతుంది. ఈ కవిత కొంత సినికల్ గా కనిపించ వచ్చుగాని, దాని తాత్పర్యం, నా దృష్టిలో, జీవితాన్ని ఎలా చూడకూడదో  చెప్పే ప్రయత్నం.

మనిషి తన సమాజంలో ఇమడలేని తనాన్ని ఒక్కోసారి సిద్ధాంతాలకి అనువర్తించి బాధపడడం కద్దు. ఈ కవిత శీర్షికలోని ఔచిత్యం మనిషి చలికాలంలో  ముడుచుకు పడుక్కున్నట్టు, విపరీతపరిస్థితులు ఎదురైనపుడు తన లోలోపలకి వెళిపోతాడని (బాగా అంతర్ముఖుడైపోతాడని) ప్రతీకాత్మకంగా సూచించడమే)

.

Philip Larkin in a library. Photograph by Fay ...
Philip Larkin in a library. Photograph by Fay Godwin. © The British Library Board (Photo credit: Wikipedia)

.

The Winter Palace

.

Most people know more as they get older:
I give all that the cold shoulder.

I spent my second quarter-century
Losing what I had learnt at university.

And refusing to take in what had happened since.
Now I know none of the names in the public prints,

And am starting to give offence by forgetting faces
And swearing I’ve never been in certain places.

It will be worth it, if in the end I manage
To blank out whatever it is that is doing the damage.

Then there will be nothing I know.
My mind will fold into itself, like fields, like snow.

Philip Larkin
(9 August 1922 – 2 December 1985)
English Poet and Novelist

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2006/03/winter-palace-philip-larkin.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: