రోజు: డిసెంబర్ 19, 2012
-
కవి… ఖలీల్ జీబ్రాన్, లెబనీస్ – అమెరికన్ కవి
అతను ఈ ఇహపరాలకి వారధి. అతను, దప్పిగొన్న ప్రతి ఆత్మా సేవించగల స్వచ్ఛమైన నీటిబుగ్గ. . అతను… ఆకొన్న హృదయాలు అభిలషించే ఫలాలనందించే, సౌందర్యనదీజలాల తడిసిన పండ్లచెట్టు ; తన గానామృతంతో ఆర్తహృదయాలను అనునయించగల కోయిల; దిగంతాలలో మెరిసి, వ్యాపిస్తూ, పూర్ణాకాశాన్ని ఆవరించగల తెలివెండి మొయిలు; జీవన కేదారాలలో కురిసి ప్రవహించి, వెలుగు వెల్లువను స్వీకరించగల పద్మదళాలను వికసింపజేయగల నిపుణుడు; భగవంతుని దివ్యవాణిని వినిపించడానికి భగవతి ఎంపికచేసిన దేవదూత; ప్రేమైకమూర్తి తనుగా చమురుపోసి, స్వరసరస్వతి వెలిగించిన, పెనుగాలులార్పలేని, చీకటులు…