అద్దెకో స్మృతి లేఖనం … టాం క్లార్క్, అమెరికను కవి.

నా పేరు… ఓహ్! ఏ పేరు ఆయితే నేమిటి, తేడా ఏం రాదు. నా ఊరు…

ఏ వూరయితే ఎవడిక్కావాలి, నిజానికి? పుట్టేను, పెరిగేను, చదువుకున్నాను

ఏదో ఓ మాదిరిగా సంప్రదాయంగానే … ఇది ఎవరికైనా పనికొస్తుందా?

నే నెలా బ్రతికేనన్న విషయానికి వస్తే…మనం దాన్లోకి వెళ్ళొద్దు. చివరికి

నే చనిపోయాను. ఇక్కడ ఉన్నాను. అదొక్కటే ప్రస్తుతానికి పనికొచ్చే విషయం.

.

టాం క్లార్క్.

అమెరికను కవి

మార్చి 1, 1941

.

ఈ కవితలో అద్భుత మైన వ్యంగ్యంతో పాటు, అంత చక్కని తాత్త్విక చింతన కూడా ఉన్నది.  మనం ఎవరో, ఎక్కడ ఎప్పుడు ఎలాగ పుట్టేమో, ఏమి చదువుకున్నామో ఎవడికి కావాలి? “నేను సైతం” భూమ్మీద బ్రతికేనంటే బ్రతికేను. మన గొప్పలు చెప్పుకోడానికి తప్పితే అవి ఎవడికీ అక్కరలేదు. అవి పూర్తిగా అప్రస్తుతం. ప్రస్తుతం …  అతను సమాధిలో ఉన్నాడు. అంతే. అన్నది మొదటి భావన. రెండవది, మనం ఎంత గొప్పవారిమైనా, ఎంత చదువుకున్నా, ఎంత గొప్పగా జీవించినా, చివరికి మనం కాలగర్భంలో కలిసిపోవలసిందే తప్ప, ఈ గొప్పలూ, ఈ చదువులూ, ఈ గొప్పగా బ్రతకడాలూ, తరవాతి తరాలకు ఎంతమాత్రమూ పనికిరావు. పనికొచ్చేది మనం ఏదయినా ఉంటే అది వాళ్లకి పనికొచ్చే పని చేసి ఉంటేనే…  అన్నది.

.

Tom Clark
Tom Clark
                   Image Courtesy: http://jacketmagazine.com/09/clark-tom.html

.

Epitaph for Rent

.

My name was… oh, what’s the difference? I came 

from… really, who cares where? Was born, raised, educated 

no doubt, in some fashion… does this interest anybody?

And as to how I lived… we won’t go into that. At length,

I died. Here I lie. That’s the one relevant fact.

.

Tom Clark

(With Permission)

(born March 1, 1941)

American poet, editor and biographer

http://tomclarkblog.blogspot.com/2010/04/epitaph-for-rent.html

For More about the poet visit: http://en.wikipedia.org/wiki/Tom_Clark_(poet)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: