స్వయం నిరాదరణ … జీన్ స్టార్ అంటర్మేయర్, అమెరికను కవయిత్రి

తడిలేని ఈ మిట్టను దున్నడానికిగాని

ఇక్కడ చెట్టునాటడానికిగాని ప్రయత్నించకు;

ఈ పర్రలో విత్తుకి జీవగర్ర లేదు.

నీ అక్కరకు పనికివచ్చి ఏమాత్రం ఉత్సాహాన్నివ్వలేని

రసహీనమైన నేల ఇది.

ఏ ఎండా దీనికి చైతన్యాన్నివ్వలేదు.

ఇది దైవోపహతమైన భూమి.

ఏ చినుకూ నిస్సారమైన

ఈ నిట్రాతిలోకి ఇంకదు.

దీని రాతి కొనలలో,

గత ఏడు మిగిలిన ఆ చిట్టచివరి మోడునికూడా

చండగాలులు తుడిచిపెట్టుకుపోయాయి.

ఏ ఆశలూ  లేనిదానిమీద నీ కెందుకింకా ఆశ?  

పో! వృధాశ్రమ; ప్రయాస పడకు!

.

జీన్ స్టార్ అంటర్ మేయర్

అమెరికను కవయిత్రి.

(జీన్ స్టార్ అంటర్మేయర్ ఒక అపురూపమైన అమెరికను కవయిత్రి. చక్కని భావనలతో పాటు, వైవిధ్యమున్న ఇతివృత్తాలూ, కోమలమైన పదాలూ, సునిశితమైన రసదృష్టీ, మనసుని రంజింపజెయ్యగల కవితా చాతుర్యమూ ఈమె సొత్తు.)

.

Self-Rejected

.

Plow not nor plant this arid mound.

Here is no sap for seed,

No ferment for your need—

Ungrateful ground!

No sun can warm this spot

God has forgot;

No rain can penetrate

Its barren slate.

Demonic winds blow last year’s stubble

From its hard slope.

Go, leave the hopeless without hope;

Spare your trouble.

.

Jean Starr Untermeyer

May 13, 1886 – July 27, 1970)

American Poetess

For more about the poetess Please visit:

http://www.theotherpages.org/poems/lives/untermeyer_jean.html

http://jwa.org/encyclopedia/article/untermeyer-jean-starr

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: