జపనీస్ కవిత … అజ్ఞాత జపనీస్ కవి

.

ఈ కొండకుసుమానికి

మనోహరమైన రేకు*లనేకం ఉన్నాయి;

కానీ, ఏమి ప్రయోజనం,

చెప్పాలంటే సిగ్గుగా ఉంది,

ఒక్కటీ వర్షానికి అక్కరకు రాదు.

  .

అజ్ఞాత జపనీస్ కవి.

ఆంగ్లానువాదం: విలియం ఎన్. పోర్టర్.

(వివరణ:

*రేకు: (1) పుష్ప దళము  or, Petal of a Flower

          (2) దుప్పటి, చద్దరు

(ఈ కవిత వెనక ఒక అందమైన జానపద కథ ఉంది. అది ఒకప్పుడు జపానులో బాగా ప్రచారంలో ఉన్నది. ఇప్పటి సంగతి తెలీదు. ఆ రోజుల్లో చదువూ, సంగీత సాహిత్యాలూ, కొద్దిమందికే అందుబాటులో ఉండేవి. ఒక రోజు యువరాజు ‘ఓటా డోక్వాన్’ కొండమీదకి సపరివారంగా వేటకు వెళ్ళి, పెద్ద వర్షం రావడంతో, కొండమీద ఎక్కడో ఒక గుడిశ కనిపిస్తే గొడుగు అడగుదామని వెళ్ళేడట. అతనిపిలుపులకి ఒక ముగ్ధ లోపలినుండి పరుగెత్తుకునివచ్చి, వెంటనే లోపలికి పోయి, సిగ్గుపడుతూ, సిగ్గుపడుతూ, ఒక విసని కర్రమీద “Yamabuki” అన్న కొండపువ్వును తీసుకు వచ్చి ఇచ్చిందిట. దానికి యువరాజు, అవమానంగా భావించి ఆగ్రహోదగ్రుడై వెనుదిరిగిపోతున్నప్పుడు, అతని పరివారంలో ఉన్న ఒక వ్యక్తి, ఆమె సుకుమారంగా విన్నవించుకున్న క్షమాపణని  పై కవిత ఉదహరించి విడమరిచి చెప్పేడట. జపనీస్ కవితలో నాలుగవ పాదం  “mi no” అన్న రెండు పదాలతో ప్రారంభం అవుతుంది. వాటిని అలా రెండుపదాలుగానే తీసుకుని చదివితే దాని అర్థం “దీనిలో విత్తనాలు లేవు. అందుకు చింతిస్తున్నాను.” అవుతుందిట. అయితే ఆ రెండింటినీ కలిపి ఒక మాటగా భావిస్తే, దాని అర్థం: “క్షమించండి. ఈ కొండపువ్వుకే (అంటే తనకి) తల దాచుకుందికి గొడుగు లేదు” అవుతుందిట. అందుకని “ఆమె చాలా సిగ్గుతో తమకి తనదగ్గర తమకి ఇవ్వడానికి గొడుగు లేదని వినమ్రంగా  విన్నవించుకుంద”ని అతను  సమాధాన పరిస్తే, దానికి యువరాజు అంత గొప్ప సంస్కారం ఆ కొండకన్నియలో ఉన్నందుకు ఆశ్చర్యం ప్రకటించేడట.)

The Yamabuki blossom has

A wealth of petals gay;

But yet in spite of  this, alas!

I much regret to say,

No seed can it display.

.

Anonymous

(Translator: William N Porter.)

(Japanese poem in transliteration:

Nanae yae

Hana wa sake domo

Yamabuki no

Mi no hitotsu dani

Naka zo kanashiki.)

( There is an interesting story surrounding this poem which is very popular in Japan. 

In good olden times a Prince Ota Dokwan  was hunting with his retinue on the mountains.  When a storm was coming on, he stopped at a mountain inn to ask for a raincoat. A girl attended his call, went into the hut, and came back rather embarrassed  and without speaking up a word  presented the Prince with a fully blossomed Yamabuki flower, a kind of yellow rose, on an outstretched fan. The Prince took offence to it and returned haughtily with terrible anger. One of his attendants, a sensible fellow, reminded him of the above verse and explained him the import of her gesture:

 The last but one line in the original starts  with the two words  “Mi no”, and the last two lines mean when they are taken separately, “I am very sorry that it has not a single seed”; but when  the words are joined and read as one word ” Mino”, the meaning of the poem changes to:”I am sorry, this Yamabuki (i.e. herself, the mountain flower) has not a rain coat for herself.”  And, that was the delicate apology of the maiden.  It was told, that the Prince was astonished  to find such fine culture  and learning in a peasant girl.)

Poem Courtesy: A Hundred Verses from Old Japan (Being a translation of  The Hyaku-Nin-Isshhu) by William N. Porter. Clarendon Press Oxford, 1909.
    

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: