చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి

.

ఆ చిన్న కుక్క బొమ్మ నిండా దుమ్ము పేరుకుంది,

అయినా అది బలంగా స్థిరంగా నిలబడి ఉంది;

ఆ చిన్న బొమ్మ సిపాయి తుప్పుపట్టి ఎర్రగా ఉన్నాడు

అతనిచేతిలో తుపాకీ బూజుపడుతోంది.

ఒకప్పుడు ఆ కుక్క బొమ్మ కొత్తది గానూ

ఆ బొమ్మ సిపాయి అందంగా ఉన్న రోజులున్నాయి

అదెప్పుడంటే, మన నీలిరంగు బుజ్జాయి

వాటితో ఆడి ముద్దుపెట్టుకున్న రోజుల్లో.

“నువ్విప్పుడు నేను తిరిగివచ్చేదాకా ఎక్కడికీ కదలకేం?

నువ్వుకూడా ఏ చప్పుడూ చెయ్యకు!” అని వాటితో అని.

చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చక్రాలపరుపుమీద పడుక్కున్నాడు.

.

తన అందమైన ఆటవస్తువుల్నే కలగన్నాడు;

అలా కలగంటూంటే, ఒక దివ్య గానం

మన నీలవర్ణుడిని నిద్రలేపింది—

ఓహ్!ఎన్ని సంవత్సరాలు! ఎంతదీర్ఘకాలం గడిచిపోయింది,

అయినా ఆ చిన్న బొమ్మలే నిజమైన మిత్రులు.

అవును, ఆ చిన్నకుర్రాడికి విధేయతతో, వాటి స్థానాల్లో

అతనెక్కడ ఉంచేడో అక్కడ కదలకుండా నిలబడి ఉన్నాయి

ఆ చిన్ని చేతుల స్పర్శకోసమూ,

ఆ చిన్నారి ముఖం నవ్వుకోసమూ ఎదురుచూస్తూ;

ఆ చిన్న కుర్చీలో దుమ్ముకొట్టుకుపోతూ

ఇన్ని ఏళ్ల బట్టీ ఎదురుచూస్తూ ఆశ్చర్యపోతున్నాయి,

వాటికి ముద్దుపెట్టి అక్కడ ఉంచిన తర్వాత

ఆ నీలి వర్ణపు బుజ్జాయికి ఏమయిందబ్బా అని !

.

యుజీన్  ఫీల్డ్

September 2, 1850 – November 4, 1895

అమెరికను కవి

.

కరుణ రసం చిప్పిలే ఈ రసవత్తరమైన కవిత కళ్ళంబడి నీళ్ళు పెట్టకుండా ఉండనీదు. ఒక సంఘటనని వాచ్యం చెయ్యకుండా ప్రతీకల ద్వారా ఎంత రసవత్తరంగా చిత్రించవచ్చునో అని చెప్పడానికి ఈ కవిత చక్కని ఉదాహరణ. నీలము అమెరికన్ సివిల్ వార్ సమయంలో సంయుక్త రాష్ట్రాల యుధ్ధబలగాల సైనిక దుస్తుల రంగు. దీనికి ఇంతకంటే వ్యాఖ్యానం అక్కరలేదనుకుంటాను.

.

Eugene Field

Little Boy Blue

.

The little toy dog is covered with dust,

But sturdy and staunch he stands;

The little toy soldier is red with rust,

And his musket moulds in his hands.

Time was when the little toy dog was new,

And the soldier was passing fair;

And that was the time when our Little Boy Blue

Kissed them and put them there.

“Now don’t you go till I come,” he said,

“And don’t you make any noise!”

So, toddling off to his trundle bed,

He dreamt of the pretty toys;

And, as he was dreaming, an angel song

Awakened our Little Boy Blue—

Oh! the years are many, the years are long,

But the little toy friends are true!

Ay, faithful to Little Boy Blue they stand,

Each in the same old place,

Awaiting the touch of a little hand,

The smile of a little face;

And they wonder, as waiting the long years through

In the dust of that little chair,

What has become of our Little Boy Blue,

Since he kissed them and put them there.

.

Eugene Field 

September 2, 1850 – November 4, 1895

American Children’s Poet

“చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి” కి 2 స్పందనలు

  1. చాలా హృద్యంగా ఉందండీ కవిత

    మెచ్చుకోండి

    1. సుజాతగారూ,

      మంచి ప్రతీకలు ఉపయోగించి వ్రాసే కవిత్వమంతా లాగుంటుందో, కొందరికే అది పట్టుబడుతుందో తెలీదు గానీ, కొన్ని కవితలు మొదటిసారి చదవగానే మన గుండెను పట్టెస్తాయి. ఇది చదివినపుడు ఒక చెప్పలేని బాధ నా మనసుని ఆవరించింది. దీనిని చాలా మంది కవి, తన కుమారుడి స్మృతిలో రాసేడని అనుకున్నారు, గానీ ఈ కవిత రాసిన చాలా సం వత్సరాల తర్వాత ఆ సంఘటన జరిగింది. అతను దీనిగురించి ఇచ్చిన సంజాయిషీలో మొదటి Stanzaలో 7 వలైనుకి అంత్యప్రాస దొరకక సతమతమవుతున్నప్పుడు ఇది తట్టింది అన్నాడు గానీ, ఇప్పుడున్నరూపంలో దాన్ని ఈ కవిత వేసుకున్నప్పుడు దాని సంపాదకుడు మార్చేడు. ఇది చాలా ప్రసిధ్ధిపొందిన కవిత.

      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: