“నువ్విప్పుడు నేను తిరిగివచ్చేదాకా ఎక్కడికీ కదలకేం?
నువ్వుకూడా ఏ చప్పుడూ చెయ్యకు!” అని వాటితో అని.
చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చక్రాలపరుపుమీద పడుక్కున్నాడు.
.
తన అందమైన ఆటవస్తువుల్నే కలగన్నాడు;
అలా కలగంటూంటే, ఒక దివ్య గానం
మన నీలవర్ణుడిని నిద్రలేపింది—
ఓహ్!ఎన్ని సంవత్సరాలు! ఎంతదీర్ఘకాలం గడిచిపోయింది,
అయినా ఆ చిన్న బొమ్మలే నిజమైన మిత్రులు.
అవును, ఆ చిన్నకుర్రాడికి విధేయతతో, వాటి స్థానాల్లో
అతనెక్కడ ఉంచేడో అక్కడ కదలకుండా నిలబడి ఉన్నాయి
ఆ చిన్ని చేతుల స్పర్శకోసమూ,
ఆ చిన్నారి ముఖం నవ్వుకోసమూ ఎదురుచూస్తూ;
ఆ చిన్న కుర్చీలో దుమ్ముకొట్టుకుపోతూ
ఇన్ని ఏళ్ల బట్టీ ఎదురుచూస్తూ ఆశ్చర్యపోతున్నాయి,
వాటికి ముద్దుపెట్టి అక్కడ ఉంచిన తర్వాత
ఆ నీలి వర్ణపు బుజ్జాయికి ఏమయిందబ్బా అని !
.
యుజీన్ ఫీల్డ్
September 2, 1850 – November 4, 1895
అమెరికను కవి
.
కరుణ రసం చిప్పిలే ఈ రసవత్తరమైన కవిత కళ్ళంబడి నీళ్ళు పెట్టకుండా ఉండనీదు. ఒక సంఘటనని వాచ్యం చెయ్యకుండా ప్రతీకల ద్వారా ఎంత రసవత్తరంగా చిత్రించవచ్చునో అని చెప్పడానికి ఈ కవిత చక్కని ఉదాహరణ. నీలము అమెరికన్ సివిల్ వార్ సమయంలో సంయుక్త రాష్ట్రాల యుధ్ధబలగాల సైనిక దుస్తుల రంగు. దీనికి ఇంతకంటే వ్యాఖ్యానం అక్కరలేదనుకుంటాను.