రోజు: డిసెంబర్ 11, 2012
-
మర నాగలి … లూయీ అంటర్మేయర్, అమెరికను కవి.
. విధేయతతో శ్రమిస్తూ కువకువలాడే ఈ భీకర మూర్తి కంటే ఏ నగ్నత్వం ఇంతకంటే అందంగా ఉంటుంది? ఏ ఆచ్ఛాదనా లేని జిడ్డోడుతున్న ఈ కండరాలూ గురితప్పని ఈ ఇనప కడ్డీలూ ఎన్నడూ ఆగవు పక్కలంట పొడవుగా, మెరిసే ఈ ఇనప రేకు కందెన కూడా పాడుచెయ్యలేని ఇంద్రజాలం. భూమిని రెండుగా చీల్చగల ఈ భారీ యంత్రం దాని కోపాన్ని ఉస్ ఉస్ అని నెమ్మదిగా ప్రకటిస్తుంది. దాన్ని అయిష్టాన్ని వెళ్ళగక్కదు; సృష్టికర్తలమీద చంపెద్దామన్నంత కోపంతో ఎదురుతిరగదు. […]