అబూ సయ్యద్ రుబాయీలు… పెర్షియన్ సూఫీ కవి.
.
67
ప్రభూ! నా ఆలోచనలను ఈ ఇహ, పర లోకాలనుండి తప్పించు;
పేదరికపు కిరీటంతో నన్ను ఉన్నతుడిని చెయ్యి.
నిన్ను వెతకడంలో గల రహస్యాలను నాకు ప్రకటించు
నీదగ్గరకు దారితీయని దారులనుండి నా అడుగులు మళ్ళించు.
(ఒక సారి మన్సూర్ అల్ హలజ్ (858 – మార్చి 26, 922, పెర్షియన్ సూఫీ) ని ఎవరో అడిగేరట “దేముని దగ్గరకి త్రోవ ఏది?” అని. దానికతను ” రెండడుగులే, నువ్వు అక్కడ చేరుకున్నట్టే; మొదటి అడుగు నిన్నుఇహంనుండి తప్పిస్తుంది; రెండవది పరంనుండి తప్పిస్తుంది. నువ్వు అప్పుడు దేమునితోనే ఉంటావు.” అన్నాడట.
ఈ అందమైన చమత్కార భావన వెనక అపురూపమైన సందేశం/ ఉపదేశం ఉంది. మనుషులు అయితే ఇక్కడ సుఖాలకోసం తాపత్రయ పడతారు. లేకపోతే స్వర్గంలో సుఖాలనుభవించడానికి ఇక్కడ తంటాలు పడతారు. ఈ రెండిటి గురించి ధ్యాసలేక చేసే ప్రయత్నమే దేమునిదగ్గరకు చేరుస్తుంది అని భావం.)
.
68
ప్రభూ! అవగాహన ఉన్న మిత్రుడిదగ్గరకు నన్ను పంపించు,
నా వేదనా తరంగాలను అతని హృదయంలో ప్రతిధ్వనింపజెయ్యి,
అతని ఎడబాటు వలన నా మనసు బాధాతప్తమయింది,
అతన్ని నాదగ్గరకో, నన్ను అతని దగ్గరకో పంపించు.
.
98
నేను వేదనలో ఉన్నాను; నా గుండె బాధతో ముక్కలయ్యింది,
నాలో ప్రేమ ఉంది, అశృవులతో తడిసిన కళ్ళున్నాయి,
ఒక ప్రేమ… కానీ, ఎలాంటి ప్రేమ? ప్రపంచాన్ని దహించేటంత;
ఎటువంటి బాధ? … ఆ బాధకు మందులేనటువంటిది.
ఇక్కడ ఒక పోలిక ఉంది అది గమనించదగ్గది:
(ప్రముఖ రూమీ పండితుడు, ప్రాచ్య, ఇస్లామీ సాహిత్యం లో అవిరళమైన పరిశోధన చేసిన డా. ఆర్. ఏ. నికల్సన్ ఒకచోట, షాం తబ్రీజీ అనువాదంలో ఇలా అంటాడు:
భగవంతుడు ప్రతి బాధకీ ఒక మందుని ప్రసాదించేడు
కానీ ప్రేమ బాధ బహు ప్రాచీనమైనది (కాలాతీతమైనది)
అందుకని దానికి మందు కనిపెట్ట లేదు)
.
అబూ సయ్యద్
పెర్షియన్ సూఫీ కవి.
December 7, 967 – January 12, 1049
.
Quatrains of Abu Sa’id bin Abil Khair.
67.
Turn my thoughts, Lord, from this world and the next;
Exalt me with the crown of poverty.
Reveal unto me the mysteries in the way of the Quest.
Turn my steps from the road that leads not to Thee.
(Mansur-ul-Hallaj(c. 858 – March 26, 922, persian mystic and sufi) was once asked : ” What is the way to God ? ” He answered : ” Two paces, and you have arrived there ; one takes you out of this world ; and the other out of the world to come. Then you are with God.”
68.
Send me, O Lord, to the friend who has understanding,
Bring the sound of my grief to his echoing heart.
I am grief-stricken because of this separation,
Send him to me — and send me to him.
98.
I am in pain ; my breast is torn with suffering
A love I have, and an eye wet with tears.
A love — but what a love ? one which burns the world;
What is my pain ? — a pain that has no remedy.
(Compare the lines quoted by Dr. R. A. Nicholson (August 18, 1868 – August 27, 1945, an eminent orientalist and Islamic scholar ) in his edition of the Diwdni-Skams-i-Tabriz :
(God hath given a physic for every pain
Since the pain of love is old (eternal),
for it no remedy hath been found.’)
.
Abu Sa’id bin Abil Khair
(aka Sheikh Abusaeid or Abu Sa’eed, was a famous Persian Sufi and poet)
December 7, 967 – January 12, 1049
***
Text Courtesy: Journal of Asiatic Society of Bengal, New Series, Vol XII, 1916.
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి