సానెట్ LXII … ఛార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

జీవితంలో విఫలమై, నిరాసక్తతో నే నలా దేశాలు తిరుగుతూ

మారుతున్న స్థలంతో కేవలం వేదనలలోనే మార్పు గమనించేను;

నేను ఎంతకాలంనుండో వెతుకుతున్న ప్రశాంతతను వా రనుభవిస్తూ

ఆ పల్లె శ్రామికులు కలతలేని నిదురలో హాయిగా విశ్రమిస్తున్నారు!

ఊరు ఇప్పుడు పూర్తిగా మాటుమణిగింది; చూరు దిగువగా ఉన్న

ఆ తాటాకు గుడిశ కిటికీలోంచి చలికాచుకుందికి వేసుకున్న నెగళ్ళు

మంటతగ్గి బుసి ఆరుతున్నాయి; పాలిపోయిన చంద్రకిరణాలు

మెరుస్తున్న మంచుమీద పడి దానికి కొత్త సొబగు ఇస్తున్నాయి. 

గడ్డకట్టుకుపోతున్న ఈ రాత్రి, ఆ చలి బీడులలో

నే నెక్కడ, ఎలా,  ఏ తోడూలేక తిరిగినా చింత లేదు;

ఓ కళతప్పిన జాబిలీ! నాకు నీ మసక వెలుతురు

ఏ సుఖకరమైన గడపకీ దారితీయదు; బడలిన నా త్రోవ

దురదృష్టవశాత్తూ బాధ్యతల సుఖదుఃఖాలదగ్గరే అంతమౌతుంది.

నేను సందేహాలనుండి పారిపోయి… నిరాశను చేరుకుంటాను!
.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లీషు కవయిత్రి, నవలాకారిణి.

అపురూపమైన సానెట్లు వ్రాసి 18వ శతాబ్దం లో వాటికి పునర్జీవనం ఇవ్వడమే గాక, రొమాంటిక్ మూవ్ మెంట్ కి రూపశిల్పులైన  వర్డ్స్ వర్త్ (Wordsworth) కోలరిడ్జ్ (Coleridge) లను ఆమె కవిత్వం ప్రభావితం చేసింది. ధనిక కుటుంబంలో పుట్టినా, భర్త వ్యసనాలవల్ల, జులాయి తిరుగుళ్ళవల్ల అప్పులు తీర్చలేక జైలుపాలయి, జైలులోనే తన కవిత్వానికి నాంది పలికి, అనతికాలంలో నే పేరూ ప్రఖ్యాతీ సంపాదించి, స్వశక్తిమీద జీవితాన్ని నిలదొక్కుకున్న సాహసవంతురాలైన స్త్రీ స్మిత్. ఆమె వ్రాసిన కొన్ని సానెట్లలోని భావాలనే వర్డ్స్ వర్త్ తన కవితలలో ప్రతిఫలించేడని, వర్డ్స్ వర్త్ ఆమెని కలిసినతర్వాత, ఆమె కొన్ని కవితలకు వర్డ్స్ వర్త్ వ్రాసుకున్న వ్యాఖ్యలను పేర్కొంటూ కొంతమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె 10 నవలలు కూడా వ్రాసింది. 

English: Charlotte Turner Smith in Charlotte T...

.

Sonnet LXII … Charlotte Smith

.

WHILE thus I wander, cheerless and unblest,
And find in change of place but change of pain;
In tranquil sleep the village labourers rest,
And taste that quiet I pursue in vain!
 Hush’d is the hamlet now, and faintly gleam
The dying embers, from the casement low
 Of the thatch’d cottage; while the Moon’s wan beam
Lends a new lustre to the dazzling snow —
o’er the cold waste, amid the freezing night,
Scarce heeding whither, desolate I stray;
For me, pale Eye of Evening, thy soft light
Leads to no happy home; my weary way
Ends but in sad vicissitudes of care:
I only fly from doubt — to meet despair!

.

Charlotte Smith

(4 May 1749 – 28 October 1806)

English Poet and Novelist

(WRITTEN ON PASSING BY MOON-LIGHT THROUGH A VILLAGE, WHILE THE GROUND WAS COVERED WITH SNOW.) 

.

Poem Courtesy: http://cdrh.unl.edu/ctsmithsite/smi.00004/smi.00004.6.html.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: