మరణించిన పిదప … క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి
.
అతను నేను నిద్రిస్తున్నానేమో ననీ,
వినిపించదనుకునీ నా మీదకి వాలి,
“అయ్యో పాపం, చిన్న పిల్ల” అనడం విన్నాను.
తర్వాత గాఢమైన నిశ్శబ్దం, నాకు అర్థమయింది
అతను రోదిస్తున్నాడని. అతను తెరని తొలగించడంగాని,
నా ముఖం మీది ముసుగు తియ్యడం గాని,
నా చేయి తన చేతిలోకి తీసుకోవడం గాని,
నా తలక్రింద ఉంచిన తలగడ సవరించడం గాని చెయ్యలేదు.
అతను నేను బ్రతికుండగా ప్రేమించలేదు;
కాని మరణించిన పిదప నా గురించి జాలి పడుతున్నాడు;
ఇది తెలుసుకున్నాక నా మనసు హాయిగా ఉంది:
నేను మరణించినా, అతని ప్రేమ మరణించలేదు.
.
క్రిస్టినా రోజెటి.
5 December 1830 – 29 December 1894
Pre-Raphaelite Brotherhood అని పిలవబడే సాహిత్య, చిత్రలేఖనాలలోని ఒక విప్లవానికి మూల కందాలయిన వ్యక్తులలో క్రిస్టినా ఒకరు (Though it was not directly acknowledged). Pre-Raphaelitism రఫేల్ (April 6 or March 28, 1483 – April 6, 1520) లెనార్డో డావించి (April 15, 1452 – May 2, 1519, Old Style), మిషేలేంజెలో(6 March 1475 – 18 February 1564), ల తదనంతరం చిత్రలేఖనం లో వచ్చిన యాంత్రికతకు వ్యతిరేకంగా (ముఖ్యంగా రఫేల్ చిత్రలేఖన రీతులకి వ్యతిరేకంగా) కవులూ, చిత్రకారులూ, విమర్శకులూ కలిసి ప్రయత్నించిన విప్లవం.
క్రిస్టినా రోజెటి అపురూపమైన కవిత్వాన్ని వెలయించింది. నిరాడంబరమైన ఆమె కవితలలో, మనసుకు సూటిగా తగిలే సున్నితమైన భావవ్యక్తీకరణ ఉంటుంది. ఇది ఆమె చక్కని కవిత్వానికి ఒక మచ్చుతునక.
.

.
After Death
.
The curtains were half drawn; the floor was swept
And strewn with rushes; rosemary and may
Lay thick upon the bed on which I lay,
Where, through the lattice, ivy-shadows crept.
He leaned above me, thinking that I slept
And could not hear him; but I heard him say,
“Poor child, poor child”; and as he turned away
Came a deep silence, and I knew he wept.
He did not touch the shroud, or raise the fold
That hid my face, or take my hand in his,
Or ruffle the smooth pillows for my head.
He did not love me living; but once dead
He pitied me; and very sweet it is
To know he still is warm though I am cold.
.
Christina Rossetti
1862
Related articles
- And When I’m Gone… (kmabarrett.wordpress.com)
- Jesus’ Christmas Wish List part 1 (inkindle.wordpress.com)