అనువాదలహరి

పరాయీ!… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి

.

అలా పక్కనుండి నడిచిపోయే పరాయీ!

నీకు తెలీదు నే నెంత ఆశగా నీకోసం వెతుకుతున్నానో,

నే నెదురుచూస్తున్న పురుషుడు, లేదా స్త్రీ, నువ్వే కావచ్చు,

(నా కది ఒక కలలా అనిపిస్తుంటుంది)

 నే నెక్కడో నీతోపాటు ఆనందంగా జీవితం గడిపేను,

ఒకరికొకరు తారసపడి కనుమరుగవగానే,

లీలగా అంతాగుర్తుకువస్తున్నట్టనిపిస్తుంది,

నువ్వు నా ఈడు బాలుడివో, బాలికవో,

వాత్సల్యంతో, నిష్కల్మషంగా, యుక్తవయసుకి

నాతోపాటే ఎదిగావునువ్వు

మనిద్దరం కలిసే తిన్నాం, కలిసే పడుక్కున్నాం—

నీ శరీరం నీదీ, నా దేహం నాదీ అనకుండా ఒక్క శరీరంలా పెరిగాం;

మనిద్దరం ఒకర్నొకరు దాటుకుని పోతుంటే,

నీ కళ్ళూ, ముఖమూ, దేహ ఛాయలతో మనసు చూరగొని

బదులుగా నా గడ్డమూ, హృదయమూ, చేతులూ తీసుకుంటావు;

నేను నీతో మాటాడే అవకాశం ఉండదు—

నే నొక్కడినే కూర్చున్నపుడూ,

రాత్రి ఒంటరిగా నిద్రలేచినపుడూ

నీ గురించి ఆలోచిస్తుంటాను;

నేను నీకోసం నిరీక్షించాలి,

మళ్ళీ నిన్ను కలవడం గురించి సందేహం లేదు,

కాని, ఈసారి నిన్ను తప్పిపోకుండా ఎలాగైనా పట్టుకోవాలి.

.

వాల్ట్ వ్హిట్మన్

అమెరికను కవి

.

ఇందులో ఈ పరాయి, నిజంగా పరాయి కాదు. అది మనమే, మన మనస్సే, మన అహం అంటే The inner self. జ్ఞానం వచ్చినది మొదలు మనల్ని అన్నివేళలా కనిపెట్టుకుని, తప్పొప్పుల్ని హెచ్చరిస్తూ మనతో పాటు పెరిగేది ఈ అహమే. కాని, ఈ అహం గురించిన స్పృహ (Awareness)…  మనల్ని మననుంచి విడదీసుకుని చూసి (alienating ourselves from the I)  మనల్ని భూమిమీద అనేకానేక జీవులలో ఒక జీవిగా గుర్తించి, అది నశ్వరమని అంగీకరించగల స్పృహ … అంత తొందరగా రాదు; వచ్చినా, అది ఇచ్చే హెచ్చరికలని పెడచెవిని పెట్టడమే గాని, తదనుగుణంగా నడుచుకోవడం ఉండదు. ఇది మరేదో కాదు… మనకి తెలియకుండానే మనం సమీకరించుకున్న తప్పొప్పుల, ఆదర్శాల, వివేచనల సమాహారం. మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ మన చర్యల్ని సింహావలోకనం చేసుకోవడం (Introspection)  వైపు పరిగెడతాయి. మన తప్పుల్ని మనం ఎంతగా సమర్థించుకుందికి (rationalize చెయ్యడానికి) ప్రయత్నించినా, మనకీ, మన లోపలి వ్యక్తికీ తెలుసు అది నిజానికి నిలబడని వాదన అని.

కవి, ఈ అహాన్ని పరాయివ్యక్తి (The other person or one different from I) గా పోల్చి చెప్పేడు.

.

Walt Whitman, age 37, Fulton St., Brooklyn, N....
Walt Whitman, age 37, Fulton St., Brooklyn, N.Y., steel engraving by Samuel Hollyer from a lost daguerreotype by Gabriel Harrison. (Photo credit: Wikipedia)

.

To A Stranger

.

Passing stranger! you do not know how longingly I

         look upon you,

You must be he I was seeking, or she I was seeking,

         (it comes to me, as of a dream,)

I have somewhere surely lived a life of joy with you,

All is recall’d as we flit by each other, fluid, affection-

         ate, chaste, matured,

You grew up with me, were a boy with me, or a girl

         with me,

I ate with you, and slept with you—your body has

         become not yours only, nor left my body mine

         only,

You give me the pleasure of your eyes, face, flesh, as

         we pass—you take of my beard, breast, hands,

         in return,

I am not to speak to you—I am to think of you when

         I sit alone, or wake at night alone,

I am to wait—I do not doubt I am to meet you again,

I am to see to it that I do not lose you.

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American Poet

Poem Courtesy:  http://www.whitmanarchive.org/

2 thoughts on “పరాయీ!… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: