అనువాదలహరి

సుఖమయజీవితాన్ని సాధించే మార్గాలు… ఎర్ల్ ఆఫ్ సరే, ఇంగ్లీషు కవి

.

మార్షల్! సుఖమయమైన జీవితానికి

కావలసినవి ఎవో నేను కనుక్కున్నాను:

బాధపడి కూడబెట్టినది గాక, దానంచేసిన సంపదా,

ప్రశాంత చిత్తమనే సారవంతమైన నేలా

ఈర్ష్యా అసూయలులేని సమ్యక్ దృష్టి

పాలకుడూ కాని, పాలితుడూ గాని స్వేచ్ఛా,

ఏ రోగమూ లేని ఆరోగ్య జీవనమూ,

వంశాన్ని కొనసాగించే సంతానమూ

నిస్సారము కాని మితమైన ఆహారమూ

నిరాడంబరతతో కూడిన నిజమైన జ్ఞానమూ

ఏ చీకూ చింతలూ లేని రాత్రీ, అప్పుడు

వివేకాన్నికోల్పోకుండా చేసే మద్యపానమూ

వాదోపవాదాలు చేయని విశ్వాసమైన భార్యా,

రాత్రి ఎలాగడిచిపోయిందో తెలియని నిద్రా

తనకున్న సిరిసంపదలతో సంతృప్తీ

మృతి గురించి ఆలోచనా, భయమూ లేకపోవడమూ.

.

హెన్రీ హోవర్డ్, ఎర్ల్ ఆఫ్ సరే

(Notes:

మార్షల్ : Marcus Valerius Martialis (known in English as Martial)

ఐబీరియన్ పెనిన్స్యులా అని పిలవబడే నేటి స్పెయిన్, పోర్చుగీసు, జిబ్రాల్టర్ దేశాల భూభాగంలో క్రీస్తుశకం 40 నుండి 102 / 104 మధ్యకాలంలో జీవించిన లాటిను కవి మార్షల్. “ఎపిగ్రామ్శ్” అన్నపేరుతో అతను 12 పుస్తకాలు ప్రచురించేడు. బహుశా ఎక్కడో అతను, సుఖజీవనానికి కావలసిన విషయాలగురించి వ్యంగ్యంగా ప్రస్తావించి ఉండొచ్చు. దానికి కవి చెప్పిన (బహుశా) సమాధానం అయి ఉండొచ్చు.

ఇది చదువుతుంటే, అదే కాలంలో దక్షిణ భారతాన పరిఢవిల్లిన కృష్ణదేవరాయల సామ్రాజ్యమూ, అతని ఆస్థానంలోని అష్టదిగ్గజాలనబడే కవులూ, వారి కవితా కల్పనలూ, గుర్తురావడంతో పాటు, దేశాలు దూరమైనా, కవుల ఆలోచనలలో ఎంతదగ్గరపోలికలు ఉన్నాయో అని అనిపించక మానదు.

నేను చిన్నప్పుడు చదువుకున్న చాటువు ఒకటి గుర్తుకు వస్తున్నది:

ఉ.    వాసనలేని పువ్వు,బుధవర్గము లేని పురంబు, భక్తి వి
శ్వాసము లేని భార్య,గుణవంతుడు కాని కుమారుడున్, సద
భ్యాసములేని విద్య,పరిహాస ప్రసంగము లేని వాక్యమున్,
గ్రాసములేని కొల్వు కొరగానివి పెమ్మయ సింగధీమణీ!

(కాకపోతే ఇది నేతి నేతి అన్న పధ్ధతిలో, అటునుండి ఇటు చెప్పిన పద్యం. దీని సందర్భం కూడా వేరు.)

.

Henry Howard Earl of Surrey at age 29, 1546

 Henry Howard, Earl of Surrey.

.

THE MEANS TO ATTAIN HAPPY LIFE

.

MARTIAL, the things that do attain
The happy life be these, I find:

The richesse left, not got with pain;
The fruitful ground, the quiet mind;

The equal friend; no grudge, no strife;

No charge of rule, nor governance;
Without disease, the healthful life;

The household of continuance;

The mean diet, no delicate fare;

True wisdom join’d with simpleness;
The night discharged of all care,

Where wine the wit may not oppress.

The faithful wife, without debate;

Such sleeps as may beguile the night:

Contented with thine own estate

Ne wish for death, ne fear his might.

.

Henry Howard, Earl of Surrey

(1516/1517 – 19 January 1547)

English Aristocrat and one of the founders of Renaissance Poetry.

(Poem Courtesy: http://archive.org/stream/englishpoetry01newyuoft#page/197/mode/1up

Henry Howard (Surrey)  and his friend Sir Thomas Wyatt were the first English poets to write in the sonnet form that Shakespeare later used, and Surrey was the first English poet to publish blank verse(unrhymed Iambic pentameter) in his translation of the second and fourth books of Virgil’s Aeneid. Together, Wyatt and Surrey, due to their excellent translations of Petrarch‘s sonnets, are known as “Fathers of the English Sonnet”. While Wyatt introduced the sonnet into English, it was Surrey who gave them the rhyming meter and the division into quatrains that now characterizes the sonnets variously named English, Elizabethan or Shakespearean sonnets.

(Bio Courtesy: Wikipedia)

%d bloggers like this: