పెంబ్రోక్ కౌంటెస్ పై మృత్యుల్లేఖనం … బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి.
.
ఆంగ్ల సాహిత్యంలో పేరుపడ్డ మృత్యుల్లేఖనాలలో ఇది ఒకటి. దీనికి సర్ ఐజాక్ న్యూటన్ స్మృతిలో అలెగ్జాండర్ పోప్ వ్రాసిన స్మృతిగీతం అంత పేరు ఉంది.
.
ఈ శోకభరమైన నల్లని సమాధిని
పెంబ్రోక్ కన్న తల్లీ, సిడ్నీ సోదరీ,
కవిత్వానికే ఉపాధి, నిద్రిస్తోంది.
ఓ మృత్యువా! ఆమెవంటి చదువరీ
సుందరీ, మనస్వినీ మరొకరిని
నువ్వు బలిగొనేలోగా,
కాలం నిన్ను శరంతో కూల్చుగాక!
.
బెన్ జాన్సన్
11 June 1572 – 6 August 1637
ఇంగ్లీషు కవి
అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినా, స్వయం శక్తితో, కృషితో, చదువుమీద అచంచలమైన దీక్షతో పైకి చ్చిన కవీ, నాటక కర్తా బెన్ జాన్సన్. ఎలిజబెత్ మహారాణి కాలంలో అలరారిన షేక్స్ పియర్, క్రిష్టఫర్ మార్లో, సర్ ఫిలిప్ సిడ్నీ, ఎడ్మండ్ స్పెన్సర్ వంటి హేమా హేమీల మధ్య నెగ్గుకురావడం సామాన్య విషయం కాదు. రాణీయేగాక, కళలకీ కవిత్వానికీ రాజపోషకులుగా ఆమె దర్బారులో ఉన్న చాలా మంది ఉన్న రోజుల్లో, సర్ ఫిలిప్ సిడ్నీ, అతని సోదరి ప్రాపకం ఇతనికి దొరికింది. అదికూడా కేవలం తన ప్రతిభవల్లనే.
.
