పురాతన వ్రాతప్రతి … ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్, అమెరికను కవి
.
ఆకాశం …
సూర్యుడూ, చంద్రుడూ
తమ దినచర్య రాసుకునే
అందమైన పాత తోలుపొరకాగితం.
దాన్ని అంతటినీ చదవాలంటే,
మీరు బృహస్పతి కంటే భాషాకోవిదులూ,
కలలతల్లి కంటే భావుకులూ,
యోగదృష్టిగలవారూ అయి ఉండాలి.
కానీ,
దాన్నిఅందుకున్న అనుభూతి పొందాలంటే
మీరు దాని ప్రియ శిష్యులై ఉండాలి:
ఆత్మీయ శిష్యుణ్ణి మించి,
ఈ భూమిలాగో,
సముద్రం లాగో
నమ్మకమైన ఏకైక ఆంతరంగికులై నిలవాలి.
.
ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్.
December 10, 1883 – August 14, 1966
అమెరికను కవి, నవలాకారుడూ, నాటక రచయితా, సాహితీ సంపాదకుడూ, సంకలన కర్తా
.
