అనువాదలహరి

నివురుగప్పిన జీవితం…ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికన్ కవయిత్రి

.

నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… ఇపుడిక అన్ని రోజులూ ఒకటే,

తినకా తప్పదు, నిద్రపోకా తప్పదు… జీవితమంతా రాత్రైపోతే  బాగుణ్ణు…

అబ్బా! రాత్రల్లా మేలుకుని గంటలు ఒకొక్కటీ సాగుతూ గడుస్తుంటే…

తెలతెలవారుతుంటే, మళ్ళీ ఉదయం అయితే బాగుణ్ణు అనిపిస్తుంది.

.

నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… నాకేం చెయ్యాలో తోచడం లేదు,

ఇదనీ, అదనీ, మీరేది చెయ్యమని చెప్పినా అన్నీ నాకు ఒకటే,

నేను ప్రారంభించిన ఏ పనీ పూర్తిచెయ్యలేకపోతున్నాను

నాకు కనిపిస్తున్నంతవరకు, దేనివల్లా ఏమీ ప్రయోజనం లేదు.

.

నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు…పక్కవాళ్ళు తలుపుతట్టి ఏదో అడుగుతారు,

జీవితం అలా … ఎలుక కన్నం తవ్వుతున్నట్టు గడిచిపోతూనే ఉంటుంది,

రేపూ, రేపూ, రేపూ, రేపూ…  ఇక ఎన్నాళ్లైనా

ఈ వీధీ అలాగే ఉంటుంది… ఈ ఇల్లూ అలాగే ఉంటుంది శూన్యంగా.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

22 February 1892 – 19 October 1950

అమెరికన్ కవయిత్రి

ఇక్కడ ఎడబాటు, (అది పూర్తిగా వేరైపోవడమూ కావచ్చు, లేదా దేశాంతరాలు వెళ్ళి ఎప్పుడు తిరిగివస్తాడో తెలియని స్థితి కూడా కావచ్చు), ఆ ఎడబాటులో కలిగే మానసిక స్థితిని అత్యంత రమణీయంగా, వర్ణించింది కవయిత్రి. “ఎలుక కన్నం తవ్వుతున్నట్టు” అన్న ఉపమానం గమనించండి… కాలం కూడా అలా జీవితాన్ని తవ్వుకుంటూ పోతుంది మనకు తెలియకుండానే అన్న భావనని ఎంత అందమైన ఉపమానం వేసి చెప్పిందో. మనసులోని శూన్యతనీ, చేసే పనులలో అనాశక్తతనీ, ఇక జీవితానికి అర్థం లేదన్న నిరాశనీ, బహుశా ఇంత అందంగా ఎవ్వరూ చెప్పలేరేమో! ఆంగ్ల సాహిత్యంలో, ముఖ్యంగా అమెరికను సాహిత్యంలో అత్యంత రమణీయమైన కవిత్వాన్ని చెప్పిన బహు కొద్దిమంది కవయిత్రులలో ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే ఒకరు.

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)
Portrait of Edna St. Vincent Millay (1933-01-14) (Photo credit: Wikipedia)

.

Ashes of Life

 Love has gone and left me and the days are all alike;
   Eat I must, and sleep I will, -- and would that night were here!
 But ah! -- to lie awake and hear the slow hours strike!
   Would that it were day again! -- with twilight near!

 Love has gone and left me and I don't know what to do;
   This or that or what you will is all the same to me;
 But all the things that I begin I leave before I'm through, --
   There's little use in anything as far as I can see.

 Love has gone and left me, -- and the neighbors knock and borrow,
   And life goes on forever like the gnawing of a mouse, --
 And to-morrow and to-morrow and to-morrow and to-morrow
   There's this little street and this little house.

Edna St Vincent Millay

22 February 1892 – 19 October 1950 

American Poet

(Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2001/12/ashes-of-life-edna-st-vincent-millay.html)

%d bloggers like this: