సీలియా కి ప్రేమతో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
.
నీకు అంగీకారమైతే, నను నీ చూపులతో సేవించు,
ప్రతిగా, నేను నా కళ్లతో ప్రమాణం చేస్తాను;
పోనీ,ఒక్క ముద్దైనా కప్పుమీద గుర్తుగా విడిచిపో,
ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్ళనేవెళ్ళను.
మనసులో చెలరేగుతున్న దాహార్తి
తీరడానికి దివ్యసుధలను కోరుకుంటోంది.
కానీ, భగవంతుడే స్వయంగా అమృతాన్ని అందించినా
నీకు బదులుగా అమరత్వాన్ని స్వీకరించలేను.
.
ఈ మధ్యనే, గులాబీలమాల ఒకటి పంపించాను,
దానితో నిన్నేదో సత్కరిద్దామని కాదు;
అక్కడయితే తను వసి వాడదని
దానికి ఒక ఆశ్వాసనను కల్పించడానికి, అంతే.
కాని, దానిని నీవు కేవలం ఆఘ్రాణించి
వెనుకకు తిరిగి పంపించేసేవు:
ఆరోజునుండి, దానినుండి వెల్లివిరిసే పరిమళం
తనసహజ పరిమళం కాదు, నీ సుగంధమే. ఒట్టు!
.
బెన్ జాన్సన్
11 June 1572 – 6 August 1637
ఇంగ్లీషు కవి
ఆంగ్లసాహిత్యంలో పెరుపడ్డ ప్రేమకవితలలో ఇది ఒకటి. మూల కవితలోని సౌందర్యం ఉదాత్తమైన ప్రేమ ప్రకటనా, దానికి హంగుగా వాడిన అలంకారాలూ, ఉత్ప్రేక్షలూ, అతిశయోక్తులూ. ఆ రోజుల్లో అది గొప్పే. ఎందుకంటే, ఇంగ్లీషు కావ్యభాషగా నిలదొక్కుకుందికి ప్రయత్నం చేస్తున్న కాలం అది. నిజానికి రెనైజాన్సు కాలంలో ఇంగ్లీషులోకంటే గ్రీకు లాటిన్ భాషలలో రాయడమూ, చదవడమే గొప్ప. కవిత్వాన్నీ, నాటకాలనీ ఆ ప్రమాణాలతోనే పరీక్షించి విమర్శించే వాళ్లు.
.

.
To Celia
.
Drink to me, only, with thine eyes,
And I will pledge with mine;
Or leave a kiss but in the cup,
And I’ll not look for wine.
The thirst that from the soul doth rise,
Doth ask a drink divine:
But might I of Jove’s nectar sup,
I would not change for thine.
I sent thee, late, a rosy wreath,
Not so much honouring thee,
As giving it a hope, that there
It could not withered be.
But thou thereon didst only breathe,
And sent’st back to me:
Since when it grows, and smells, I swear,
Not of itself, but thee.
.
Ben Jonson
Related articles
- The Alchemist – review (guardian.co.uk)