రోజు: నవంబర్ 16, 2012
-
ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. ఇక అందులో ఇంద్రజాలం ఉండదు, అందరువ్యక్తుల్లాగే మనమూ కలుసుకుంటుంటాం, నేను నీకూ, నువ్వు నాకూ ఇక అద్భుతాలుగా అనిపించం. . ఒకప్పుడు నువ్వు సుడిగాలివి, నేను సముద్రాన్ని— ఆ వైభవం ఇక ఏమాత్రం ఉండదు… నేను సముద్రపొడ్డునే అలసిపోయిన ఒక మడుగునై మిగిలిపోయాను. . ఆ మడుగుకి ఇప్పుడు తుఫానులబెడదనుండీ ఎగసిపడే అలలనుండీ విముక్తి దొరికింది అయితేనేం, దానికి దొరికిన అంత ప్రశాంతతకీ సముద్రం కంటే, ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి మిగిలిపోతుంది. . సారా టీజ్డేల్ August…