అనువాదలహరి

దంతవైద్యుడూ— మొసలీ…. రోవాల్ డాల్ , బ్రిటిషు కవి

.

ఒక మొసలి, చిలిపిగా నవ్వుతూ ,

దంతవైద్యుడి ఎదురుగా కుర్చీలో కూచుని: 

“ఇదిగో ఈ పన్నూ, మిగతా అన్నిపళ్ళూ కూడా

సలుపుతున్నాయి. బాగుచెయ్యాలి,” అంది.   

దంతవైద్యుడి ముఖంలో కత్తివాటుకి నెత్తురుచుక్కలేదు.  

భయంతో గడగడలాడుతూ, వణికిపోసాగేడు. 

“అలాఅయితే, ఒకసారి చూడాల్సి ఉంటుంది “అన్నాడు.

“నాకు కావలసిందీ అదే,” అని

“ముందు వెనక పళ్ళు పరీక్షించండి 

అన్నిటిలోకీ ఆ దంతాలే బాగా నొప్పెడుతున్నై,” అంది.

అని దాని భారీ దవడలు తెరిచింది.

అది మహా భయంకరమైన దృశ్యం…

కనీసం మూడువందల పళ్ళు

అన్నీ తెల్లగా సూదిగా నిగనిగ మెరుస్తున్నై.

వైద్యుడు కనీసం రెండుగజాలదూరంలో నిలబడ్డాడు

ఎంతదూరం నుండి వీలయితే అంతదూరం నిలబడి

పుప్పివి ఉన్నాయేమోనని పరీక్షించ ప్రయత్నించసాగేడు .

నేను వెనక దంతాలు చూడమన్నాను ముందు!”

అని బిగ్గరగా అంది మొసలి.

“డాక్టరు గారూ అవి చూడడానికి

మీరు చాలా దూరం నిలబడ్డారు.

వెనకపళ్ళు సరిగా చూడాలంటే

మీరు మీ తల నా నోట్లో చాలా లోపలికి ఉంచాలి,”

అంది పళ్ళికిలించి నవ్వుతూ.

పాపం! ఆ దంతవైద్యుడు చేతులు పిసుక్కుంటూ,

నిరాశచేసుకుని ఏడిచినంతపనిచేస్తూ,

“ఫర్వాలేదు. నేను వాటిని ఇక్కడనుండికూడా

శుభ్రంగానే చూడగలుగుతున్నాను,”అన్నాడు.

.

సరిగ్గా ఆ సమయంలోనే, ఒక గొప్పింటి స్త్రీ

గబగబా లోపలికి దూసుకు వచ్చింది.

ఆమె చేతిలో ఒక బంగారు గొలుసు ఉంది.

తను మొసలిని చూసి కేకలేస్తూ,

“అదిగో మళ్ళీ, ఇక్కడకూడా ప్రారంభించావూ

నీ అల్లరి చేష్టలు? పెంకీ” అంది.  

“జాగ్రత్త!” అంటూ దంతవైద్యుడు  అరుపు అరిచి

భయంతో గోడమీదకి ఎగబాకబోతూ,

“అది నావెంట పడింది! మీ వెంటపడుతుంది.

మనిద్దరినీ కరకరానమిలేస్తుంది,”  అని అరిచాడు.

“అంత కటువుగా మాటాడకండి,” 

ఆమె మహా సంబరంగా నవ్వుతూ 

“ఇది నా పెంపుడు మొసలి.

ఎవరికీ హానిచెయ్యదు.

ఇది చాలా మంచిది. కదమ్మా?”  

.

రోవాల్ డాల్ 

(13 September 1916 – 23 November 1990) 

బ్రిటిషు కవీ, కథా రచయితా, నవలాకారుడూ, యుధ్ధవిమాన చోదకుడూ

.

Dentist and the Crocodile

.

The crocodile, with cunning smile,

sat in the dentist’s chair.

He said, “Right here and everywhere

my teeth require repair.”

The dentist’s face was turning white.

He quivered, quaked and shook.

He muttered, “I suppose

I’m going to have to take a look.”

“I want you,” Crocodile declared,

“to do the back ones first.

The molars at the very back are easily the worst.”

He opened wide his massive jaws.

It was a fearsome sight––

At least three hundred pointed teeth,

all sharp and shining white.

The dentist kept himself well clear.

He stood two yards away.

He chose the longest probe

he had to search out the decay.

“I said to do the back ones first!”

the Crocodile called out.

“You’re much too far away,

dear sir, to see what you’re about.

To do the back ones properly

you’ve got to put your head

Deep down inside my great big mouth,”

the grinning Crocky said.

The poor old dentist wrung his hands

and, weeping in despair,

He cried, “No no! I see them all

extremely well from here!”

Just then, in burst a lady,

in her hands a golden chain.

She cried, “Oh Croc, you naughty boy,

you’re playing tricks again!”

“Watch out!” the dentist shrieked

and started climbing up the wall.

“He’s after me! He’s after you!

He’s going to eat us all!”

“Don’t be a twit,” the lady said,

and flashed a gorgeous smile.

“He’s harmless. He’s my little pet,

my lovely crocodile.”

.

Roald Dahl

(13 September 1916 – 23 November 1990)

British Novelist, Short Story Writer, Poet, Fighter Pilot and Screenwriter.

Born in Wales to Norwegian parents, Dahl was a British novelist Short Story Writer, Poet, Fighter Pilot(W II) and a Screenwriter of repute. His best works are: James and the Giant Peach, Charlie and the Chocolate Factory, George’s Marvellous Medicine, Fantastic Mr Fox, Matilda, The Witches and The BFG.

Poem Courtesy: http://www.mayfiles.com/2010/03/dentist-and-crocodile.html

%d bloggers like this: