అనువాదలహరి

కృతజ్ఞతలతో … థామస్ లక్స్, అమెరికను కవి

ఓ భగవంతుడా! నువ్వెవ్వరో గాని

నీకు నా కృతజ్ఞతలు…

ఊపిరి పీల్చి విడవడానికి ఇచ్చిన ఈ గాలికీ,

చిట్టడవిలో తలదాచుకుందికి ఈ చిన్న గుడిశకీ,

నిప్పురాజేసుకుందికి పుల్లలకీ,

దీపపు వెలుతురుకీ,

చిగురాకు మెరుగువంటి సహజకాంతికీ,

పచ్చని ప్రకృతికీ, విహంగాలకీ,

సంగీతానికీ,

ప్రకృతి ఒడిలోకి తిరిగిచేర్చే సాధనాలకీ

చిమ్మటలు కొట్టేసిన కంబళ్లకీ

మంచుముక్కలాంటి నీటికీ,

నిజం, చల్లని ఈ నీటికీ

అనేక కృతజ్ఞతలు.

.

ప్రభూ, నీకు కృతజ్ఞతలు!

నన్నిక్కడకితీసుకొచ్చి పడేసినందుకు…

ఇక నా సంగతి నేను చూసుకుంటాను

దేవా!నేనిక్కడ ప్రశాంతంగా  పనిచేసుకుంటాను

స్వామీ! నీకు ఎన్నో కృతజ్ఞతలు

ముఖ్యంగా,ఇంత మధురమైన పిక రవాలకి.

.

థామస్ లక్స్

(December 10, 1946 – )

అమెరికను కవి

ఈ కవితలో పంచభూతాలనీ ఎంత సరళంగా ప్రస్తావిస్తూ, కవి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం గమనించండి. ఈ భూమిమీద పుట్టినందుకు  వచ్చినందుకు నా జీవితానికి నేనే కర్తని అని ఆశ్వాశన ఇవ్వడం…  “ఖడ్గసృష్టి”లో శ్రీశ్రీ అన్నట్టు మన లోపాలకీ, పరాజయాలకీ నక్షత్రాలనో గ్రహాలనో, ఎవరినో బాధ్యులని  చెయ్యకుండా… దాని కొసమెరుపు.

.

Thomas Lux

.

Poem in Thanks

.

Lord Whoever, thank you for this air
I’m about to in- and exhale, this hutch
in the woods, the wood for fire,
the light-both lamp and the natural stuff
of leaf-back, fern, and wing.
For the piano, the shovel
for ashes, the moth-gnawed
blankets, the stone-cold water
stone-cold: thank you.
Thank you, Lord, coming for
to carry me here — where I’ll gnash
it out, Lord, where I’ll calm
and work, Lord, thank you
for the goddamn birds singing!

— Thomas Lux

Poem and the following Bio, Courtesy: http://wonderingminstrels.blogspot.com/2003/07/poem-in-thanks-thomas-lux.html

Bio:

THOMAS LUX, born in Northampton, Massachusetts in 1946, is a member of  the writing faculty and director of the MFA Program in Poetry at Sarah  Lawrence College. In recent years he has been on the graduate faculties  of Boston University, the University of California (Irvine), Columbia  University, Warren Wilson College, and the Universities of Houston,  Iowa, and Michigan. A former Guggenheim Fellow, the recipient of three  NEA grants, Lux won the Kingsley Tufts Award for his book of poems,  Split Horizon, and has been a finalist for both the Los Angeles Times  Book Award in poetry and the 1998 Lenore Marshall Poetry Prize.

%d bloggers like this: