అనువాదలహరి

నా మాట … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి.

అశాంతీ, ఆతురతలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో,

నువ్వూ, నేనూ, మనవంతు ఆనందం మనసారా అనుభవించేం;

ఈ నావకెత్తిన తెల్లని తెరచాపలు మూసివేయబడ్డాయి

మనం ఇందులోకెత్తిన సరకంతా ఖర్చుచేసేశాం.    

.

రోదనవల్ల సంతోషం నానుండి నిష్క్రమించింది, 

అందుకు నా చెక్కిళ్ళు ప్రాయములోనే కళతప్పాయి,  

వయసుమీరని నా పెదాల అరుణిమని వేదన హరించింది,

వినాశము నా శయ్యమీద ఆఖరితెరలు దించుతోంది.  

.

కానీ, కిక్కిరిసిన ఈ జీవితం నీకు ఒక వీణ,

ఒక జంత్రం, లేక వయోలాల సమ్మోహనాదంలాగో 

లేదా, ఉదాత్త సాగర సంగీతానికి పేలవమైన అనుకరణ

శంకువులో నిద్రించే ప్రతిధ్వనిలాగో అనిపించవచ్చు.  

.

ఆస్కార్ వైల్డ్ 

(16 October 1854 – 30 November 1900)

ఐరిష్ కవి, నాటక కర్త

షేక్స్పియరు తర్వాత అంత ఎక్కువగానూ సాహిత్యంలో ఉటంకించబడే (quoted) వ్యక్తి ఆస్కార్ వైల్డ్ మాత్రమే.

ఈ కవిత నిజానికి Dialogues అన్న పేరుతో రాసిన కవితల్లో రెండవది. మొదటికవితలో ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నప్పుడు, స్త్రీ దృక్పధంలో ఆ విడిపోవడానికి కారణాలు చెబితే, దానికి సమాధానంగా చెప్పిన ఈ కవితలో, పురుషుడి దృక్కోణం నుండి సమాధానం ఉంటుంది.  

అనేక కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం చాలా సందర్భాలలో జరుగుతుంది. కానీ అన్నిటిలోనూ ఒకరు వాళ్ల విడిపోవడానికి కారణమైన విషయాన్ని మన్నించగలిగినా/ మరిచిపోవాలని చూసినా, రెండవవారు దాన్ని క్షమించలేరు. అప్పుడుకూడ, కొందరిలో  ఉదాత్తమైన వ్యక్తిత్వం, అవతలి వ్యక్తి పట్ల నిజమైన ప్రేమానురాగాలూ వ్యక్తమవుతూనే ఉంటాయి. ఈ కవిత, బహుశా అతని తొలిప్రేయసి Florence తో విడిపోయిన సందర్భంలో వ్రాసి ఉండవచ్చునని కొందరి ఊహ.

Oscar Wilde
Oscar Wilde (Photo credit: Wikipedia)

.

My Voice

.

Within this restless, hurried, modern world

We took our hearts’ full pleasure – You and I,

And now the white sails of our ship are furled,

And spent the lading of our argosy.

.

Wherefore my cheeks before their time are wan,

For very weeping is my gladness fled,

Sorrow has paled my young mouth’s vermilion,

And Ruin draws the curtains of my bed.

.

But all this crowded life has been to thee

No more than lyre, or lute, or subtle spell

Of viols, or the music of the sea

That sleeps, a mimic echo, in the shell.

.

Oscar Wilde

(16 October 1854 – 30 November 1900)

Irish Poet

For an analysis of the poem pl. visit:

1. http://www.helium.com/items/2252109-poetry-analysis-my-voice-by-oscar-wilde

2. http://kellyrfineman.blogspot.com/2009/05/her-voice-and-my-voice-by-oscar-wilde.html

%d bloggers like this: