I want No Life… Ravinder Verelly, Telugu Poet
.
Then:
There was no form.
There were no limits at all.
My term of life
was the same as that of Milky Ways.
I had a full-fledged freedom
to touch the bourns of skies
and the depths of abysses same time.
My existence was
at the threshold of nine planets.
.
Now:
I am a prisoner serving life
born in the cellar with nine doors.
The irony is
I am the guard, I am the judge
I have to serve the term, all alone.
.
Bound with shackles of affections,
injecting into the veins
selfishness boiling with desires
is the punishment.
.
How long these decorated walls
hoisting greed can stand?
.
In the battle of life
between breath and death
A day shall come
when the jail shall have to close
.
If all that I can achieve
is a lay on the roster of history
that the time machine rolls out,
I want no history
and I want no life.
God! grant me endless freedom!
.
Ravi Verelly.
Ravi Verelly is a Software Architect with TMEIC. Currently, he lives in Roanoke, Virginia. He went to US 15 years ago. He is very nostalgic about his village Amudalapalle and his childhood memories. He published his maiden collection of poems in Telugu … Doopa (Thirst) recently.
.
ఏ పుట్టుకా వద్దు
.
అప్పుడు:
ఆకారం లేదు.
అవధులు అసలే లేవు.
పాలపుంతల దారి
నా కొలమానం.
ఆకాశపుటంచులనూ
పాతాళపులోతులనూ
ఏకకాలంలోస్పృశించే
రెక్క తొడిగిన స్వేచ్ఛ—
తొమ్మిది గ్రహాల ముంగిలి
నా అస్తిత్వం.
ఇప్పుడు:
తొమ్మిది తలుపుల చెరసాలలో
ఊపిరిపోసుకున్న జీవిత ఖైదీ.
వింతేమిటంటే…
ఈ జైలుకు రక్షకుణ్ణి, శిక్షకుణ్ణి
శిక్ష అనుభవించే ఒంటరి పక్షినీ నేనే
అనుబంధాల గొలుసులతో బంధించి
కోరికలతో సలసల మరుగుతున్న స్వార్థాన్ని
నరనరాల్లోకెక్కించడం
ఇక్కడ విధించబడుతున్న శిక్ష.
నషాళానికెక్కిన ఆశల జెండాలతో
సింగారించుకున్న ఈ గోడలు
ఇంకెన్నాళ్ళు?
ఉచ్ఛ్వాస నిశ్వాసలకు
జరుగే యుధ్ధంలో
ఏదో ఒక రోజు
ఏదో ఒకటి గెలవటమూ
ఈ జైలు తలుపులు
బద్దలవటమూ తప్పదు.
సమయ యంత్రం ముద్రించే
చరిత్రపుటల్లోకెక్కాలనుకోవడమే
నా స్వార్థం అయితే
నాకే చరిత్రా వద్దు
ఏ పుట్టుకా వద్దు
అవధుల్లేని స్వేచ్ఛనివ్వు. .
.
రవి వీరెల్లి
దూప సంకలనం నుండి
.
.