అనువాదలహరి

గడియారాలన్నీ ఆపేయండి…WH ఆడెన్. ఇంగ్లీష్-అమెరికను కవి

గడియారాలన్నీ ఆపేయండి. టెలిఫోన్లు మోగనివ్వకండి

కుక్క అరవకుండా రసాలూరే బొమిక ఒకటి ఇవ్వండి

పియానోలు మూసి, అట్టే చప్పుడుచెయ్యకుండా డోలు వాయిస్తూ 

శవపేటిక బయటకు తీసుకురండి, దుఃఖితులంతా వెనక నడవండి.   

.

విమానాలు రోదిస్తూ నెత్తిమీద ఆకాశంలోచక్కర్లు కొట్టనీండి

అలా తిరుగుతూ, అతని మరణ వార్తని గాలిలో లిఖించనీండి 

స్వేచ్ఛాపావురాల తెల్లని మెడలకు నల్లని సిల్కురిబ్బన్లు ముడివెయ్యండి

రాకపోకలునియంత్రించే పోలీసుల్ని నల్ల చెయిజోళ్లు తొడుక్కోమనండి     

.

అతనే నాకు తూరుపు, పడమర, ఉత్తరం, దక్షిణం

అపరాహ్ణమైనా, అపరాత్రైనా, నా మాటకీ, పాటకీ 

నా పనికీ, విశ్రాంతికీ అన్నిటికీ అతనే లక్ష్యం.

నేను ప్రేమ శాశ్వతమనుకున్నాను: కాదు. నే పొరపడ్డాను.   

.

ఇప్పుడిక నక్షత్రాల అవసరంలేదు, ప్రతి ఒక్కటీ ఆర్పేయండి.

చంద్రుణ్ణి మూటగట్టి, సూర్యుణ్ణి ఏకీలుకాకీలు విడగొట్టండి

సముద్రాల్ని తోడి పారబోసి, అడవులని శుభ్రంగా తుడిచిపెట్టండి. 

ఇక ప్రపంచంలో అన్నీ విషాదంతో ముగియవలసిందే.

.  

WH ఆడెన్.

ఇంగ్లీష్- అమెరికను కవి.

(మనకి ప్రాణంలో ప్రాణం అయిన వారు పోయినపుడు  ప్రపంచంతో మనకి ఇక ఏమీ సంబంధం లేనట్టనిపించి చెప్పలేని నిరాశా నిస్పృహలకు లోనవుతాము. ఆ భావాలనీ, దుఃఖాన్నీ ఈ కవిత ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. ఆ వేదన అనుభవైక వేద్యం.  అంతే!)

(The translator acknowledges his indebtedness for the following source for the translation.):

http://homepages.wmich.edu/~cooneys/poems/auden.stop.html

.

Stop all the clocks…
.

Stop all the clocks, cut off the telephone,
Prevent the dog from barking with a juicy bone,
Silence the pianos and with muffled drum
Bring out the coffin, let the mourners come.

….

(This poem is copyrighted. For the complete poem please visit: http://homepages.wmich.edu/~cooneys/poems/auden.stop.html)

for “An Explication of the Poem”  one can also visit:

http://dc.cod.edu/cgi/viewcontent.cgi?article=1117&context=essai

English: W. H. Auden Category:W.H. Auden
English: W. H. Auden Category:W.H. Auden (Photo credit: Wikipedia)

.

WH Auden

Anglo-American Poet

21 February 1907 – 29 September 1973

2 thoughts on “గడియారాలన్నీ ఆపేయండి…WH ఆడెన్. ఇంగ్లీష్-అమెరికను కవి”

 1. .
  అతనే నాకు తూరుపు, పడమర, ఉత్తరం, దక్షిణం
  అపరాహ్ణమైనా, అపరాత్రైనా, నా మాటకీ, పాటకీ
  నా పనికీ, విశ్రాంతికీ అన్నిటికీ అతనే లక్ష్యం.
  నేను ప్రేమ శాశ్వతమనుకున్నాను: కాదు. నే పొరపడ్డాను.
  .
  ఇప్పుడిక నక్షత్రాల అవసరంలేదు, ప్రతి ఒక్కటీ ఆర్పేయండి.
  చంద్రుణ్ణి మూటగట్టి, సూర్యుణ్ణి ఏకీలుకాకీలు విడగొట్టండి
  సముద్రాల్ని తోడి పారబోసి, అడవులని శుభ్రంగా తుడిచిపెట్టండి.
  ఇక ప్రపంచంలో అన్నీ విషాదంతో ముగియవలసిందే.
  . -మీరు అందిస్తున్న విశ్వసాహిత్యంలోని వైవిధ్యం అత్యంత సౌందర్యవంతమైనది మూర్తి గారూ! సార్వజనీనమైన భావోద్వేగాలకు ఒక్కో జాతి ప్రతిస్పందించే తీరు ఒక్కో తీరుగా ఉన్నా అంతఃస్సూత్రం మాత్రం మానవత్వ పరిధిలోఒదిగిఉండాల్సిందే! దగ్గరయినా వారు దూరమయిపోతే..దగ్గరున్నవీ వద్దనుకునే ఒక శ్మశాన వైరాగ్యం జాతులాతీతంగా అందరూ ప్రదర్శిస్తారన్న గొప్ప సత్యాన్ని ఆవిష్కరించిన కవితను ఎంచుకోవడమే కాదు…అంతకు మించిన అనువాదంతో మెరిపించారు.ధన్యవాదాలు మంచి మంచి కవితలు చూపిస్తున్నందుకు మూర్తి గారూ!

  మెచ్చుకోండి

 2. రావు గారూ,

  మీ అభిమానానికి సదా కృతజ్ఞుణ్ణి. మంచి కవిత్వం రాయలేనపుడు మంచికవిత్వమైనా చదివాలి.అదృష్టవశాత్తూ ఈ కాలంలో పుట్టేను గనుక ప్రపంచ సాహిత్యం ఇంట్లోనే లభ్యమవుతోంది. అంతర్జాల సృష్టికర్తలకి ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే.పసిపిల్లల తర్వాత,సాహిత్యమూ,సంగీతమూ,మంచిమిత్రులే దివ్యౌషధాలు.వాటిని మించినవి ఎక్కడా దొరకవు.

  అభివాదములతో

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: