అనువాదలహరి

గడియారాలన్నీ ఆపేయండి…WH ఆడెన్. ఇంగ్లీష్-అమెరికను కవి

గడియారాలన్నీ ఆపేయండి. టెలిఫోన్లు మోగనివ్వకండి

కుక్క అరవకుండా రసాలూరే బొమిక ఒకటి ఇవ్వండి

పియానోలు మూసి, అట్టే చప్పుడుచెయ్యకుండా డోలు వాయిస్తూ 

శవపేటిక బయటకు తీసుకురండి, దుఃఖితులంతా వెనక నడవండి.   

.

విమానాలు రోదిస్తూ నెత్తిమీద ఆకాశంలోచక్కర్లు కొట్టనీండి

అలా తిరుగుతూ, అతని మరణ వార్తని గాలిలో లిఖించనీండి 

స్వేచ్ఛాపావురాల తెల్లని మెడలకు నల్లని సిల్కురిబ్బన్లు ముడివెయ్యండి

రాకపోకలునియంత్రించే పోలీసుల్ని నల్ల చెయిజోళ్లు తొడుక్కోమనండి     

.

అతనే నాకు తూరుపు, పడమర, ఉత్తరం, దక్షిణం

అపరాహ్ణమైనా, అపరాత్రైనా, నా మాటకీ, పాటకీ 

నా పనికీ, విశ్రాంతికీ అన్నిటికీ అతనే లక్ష్యం.

నేను ప్రేమ శాశ్వతమనుకున్నాను: కాదు. నే పొరపడ్డాను.   

.

ఇప్పుడిక నక్షత్రాల అవసరంలేదు, ప్రతి ఒక్కటీ ఆర్పేయండి.

చంద్రుణ్ణి మూటగట్టి, సూర్యుణ్ణి ఏకీలుకాకీలు విడగొట్టండి

సముద్రాల్ని తోడి పారబోసి, అడవులని శుభ్రంగా తుడిచిపెట్టండి. 

ఇక ప్రపంచంలో అన్నీ విషాదంతో ముగియవలసిందే.

.  

WH ఆడెన్.

ఇంగ్లీష్- అమెరికను కవి.

(మనకి ప్రాణంలో ప్రాణం అయిన వారు పోయినపుడు  ప్రపంచంతో మనకి ఇక ఏమీ సంబంధం లేనట్టనిపించి చెప్పలేని నిరాశా నిస్పృహలకు లోనవుతాము. ఆ భావాలనీ, దుఃఖాన్నీ ఈ కవిత ఎంతో అందంగా ప్రతిబింబిస్తుంది. ఆ వేదన అనుభవైక వేద్యం.  అంతే!)

(The translator acknowledges his indebtedness for the following source for the translation.):

http://homepages.wmich.edu/~cooneys/poems/auden.stop.html

.

Stop all the clocks…
.

Stop all the clocks, cut off the telephone,
Prevent the dog from barking with a juicy bone,
Silence the pianos and with muffled drum
Bring out the coffin, let the mourners come.

….

(This poem is copyrighted. For the complete poem please visit: http://homepages.wmich.edu/~cooneys/poems/auden.stop.html)

for “An Explication of the Poem”  one can also visit:

http://dc.cod.edu/cgi/viewcontent.cgi?article=1117&context=essai

English: W. H. Auden Category:W.H. Auden
English: W. H. Auden Category:W.H. Auden (Photo credit: Wikipedia)

.

WH Auden

Anglo-American Poet

21 February 1907 – 29 September 1973

%d bloggers like this: