అనువాదలహరి

కథలుగా చెప్పుకునే అడ్డంకులు… జాన్ మాంటగే, ఐరిష్ కవి.

.

మనిద్దరి మధ్యా కథలుగా చెప్పుకునే అడ్డంకులన్నీ ఉన్నాయి

ఊహకందని సుదీర్ఘమైన మైదానమూ…

భయభ్రాంతుల్ని చేసే కొండల వరుసలూ…

రాత్రల్లా విడువకుండా విసరికొడుతూ

శాక్రమెంటోనీ, శాన్ జోక్విన్ నీ ముంచెత్తి  

రివ్వున ఈదురుగాలులతో తేలియాడిన హేమంతపు వానా… 

.

పగలల్లా నిరీక్షిస్తూనే ఉన్నాను,

స్టేషనుకీ, బారుకీ మధ్య భయం భయంగా తిరుగాడుతూ.

మధ్యలో ఇంకో రైలు వెళ్ళడం చూసాను

శాన్ ఫ్రాన్సిస్కో చీఫో, గోల్డెన్ గేటో  తెలీదు గాని

ముందుకి పొడుచుకొచ్చిన చక్రాలంట

నీళ్ళుధారాపాతంగా కారుతూ…

.

అర్థరాత్రివేళకి నువ్వు పాలిపోయి వచ్చేవు

ఆ నీగ్రోకూలీ గుడ్డిదీపం వెలుతురు వెనక.    

వర్షానికి తడిసిన నాకళ్ళు పోల్చుకోలేదు

పలకరించడానికి సంశయించాను.

కాని, ప్లాట్ ఫారం మీదనుండే నిన్నందుకున్నా

చలిబట్టిపోయిన మనరెండుచేతులూ కలుసుకున్నాయి. 

.

రోజులతరబడి నీతో ప్రయాణించిన 

ఆ ముసలావిడ, తన చెయిజోడుతో

అద్దం మీద స్పష్టంగాకనిపించేలా

ఒక వృత్తం చుట్టింది, మనిద్దరం

ఒకరితో ఒకరు మాటాడలేకపోయినా

చెమ్మకున్న చీకటిలోకి జరిగి

ఒకరినొకరు చుంబించుకోడం చూడ్డానికి.

.

జాన్ మాంటగే

ఐరిష్ కవి.  

ఇంగ్లీషు సాహిత్యానికి ఐరిష్  మరియు స్కాటిష్ కవులూ రచయితలూ చేసిన సేవ అపారమైనది. వాళ్ల అనుభవాలని ఎంత అందంగా కవిత్వీకరించగలరో ఆశ్చర్యం వేస్తుంది. ఈ చిన్న కవితలో ఇద్దరు ప్రేమికుల విరహంతో పాటు, ఒక ముసలామె మనస్తత్వాన్ని కూడా ఎంత చక్కగా జోడించేడో గమనించండి.

.

All Legendary Obstacles

.

All legendary obstacles lay between

Us, the long imaginary plain,

The monstrous ruck of mountains

And, swinging across the night,

Flooding the Sacramento, San Joaquin,

The hissing drift of winter rain.

.

All day I waited, shifting

Nervously from station to bar

As I saw another train sail

By, the San Francisco Chief or

Golden Gate, water dripping

From great flanged wheels.

.

At midnight you came, pale

Above the negro porter’s lamp.

I was too blind with rain

And doubt to speak, but

Reached from the platform

Until our chilled hands met.

.

You had been travelling for days

With an old lady, who marked

A neat circle on the glass

With her glove, to watch us

Move into the wet darkness

Kissing, still unable to speak.

.

John Montague,

(28th February, 1929 – )

Irish Poet.

For further info on John Montague pl. visit:

http://en.wikipedia.org/wiki/John_Montague_(poet)

%d bloggers like this: