పొరపాట్లలో ఆనందం … రాబర్ట్ హెర్రిక్, ఇంగ్లీషుకవి.
.

ధరించిన ఉడుపులలో తమాషా తికమకలు,
మనలో రగిగించే కొంత కొంటెతనం
.
మన ఏకాగ్రతని భగ్నం చేసే
భుజాలు దిగిపోయిన వస్త్రాలు
.
అక్కడక్కడ తప్పిపోయిన లేసు
ఎర్రని జాకెట్టుకి కలిగించే ఆకర్షణ
.
మరిచిపోయిన ముంజేతి చొక్కామడతకి
అటూ ఇటూ ఊగే అక్కడకట్టిన రిబ్బన్లు
.
గాలికి రెపరెపలాడే పరికిణీలో,
చూసితీరాల్సిన జయకేతనపు విసురులు
.
నాగరికత ఉట్టిపడే నెక్ టై కట్టిన అతనే
అశ్రధ్ధగా వదిలేసిన షూ లేసు
.
ఏ లోపంలేకుండా కళాత్మకంగా ఉండేవాటికన్నా
ఇలాంటివే నా మనసు వశపరుచుకుంటాయి .
.
రాబర్ట్ హెర్రిక్,
1591–1674
ఇంగ్లీషుకవి.
ఈ కవితని చదివే ముందు, కవికాలాన్ని గుర్తించడం చాలా అవసరం. ఆ రోజుల్లో ఎక్కడా పొరపాటులేకుండా వేసుకునే వస్త్రధారణ వారి నాగరికతనీ, అంతస్థునీ సూచించేది. అందుకని వాళ్ళు బహుశ ఈ వేషధారణలో అతిగా ప్రవర్తించేవారేమో! అటువంటి “అసహజమైన లేదా కృతకమైన ” పధ్ధతులకి విసిగిపోయిన ఒక కవి స్పందనగా దీన్ని భావించవచ్చు. దీనికి ప్రతిస్పందనగా రాబర్ట్ బ్రౌనింగ్ బెన్ జాన్సన్(Ben Jonson) రాసిన కవిత ఒకటి ఉంది. అది రేపు ప్రచురిస్తాను. పైన చెప్పిన వాటిలో ఎక్కడా అశ్లీలత లేదు. అప్పటి వస్త్రధారణ గురించి స్మక్షిప్తంగా తెలియజేస్తాయి అంతే! కట్టుబాట్లపట్ట, వాటిలోని “అతి” పట్ల ఒక రకమైన నిరసన మాత్రమే దీని మనం తీసుకో వచ్చు.
.
Delight in Disorder
.
A sweet disorder in the dress
Kindles in clothes a wantonness;
A lawn about the shoulders thrown
Into a fine distraction;
An erring lace, which here and there
Enthrals the crimson stomacher;
A cuff neglectful, and thereby
Ribands to flow confusedly;
A winning wave, deserving note,
In the tempestuous petticoat;
A careless shoe-string, in whose tie
I see a wild civility:
Do more bewitch me, than when art
Is too precise in every part.
.
Robert Herrick
English Poet
1591–1674
(Note:
Lawn: A fine linen or cotton fabric, used for clothing.
Stomacher: A richly ornamented garment covering the stomach and chest, worn by both sexes in the 15th and 16th centuries, and later worn under a bodice by women.)
To Read about Robert Herrick pl. visit: http://en.wikipedia.org/wiki/Robert_Herrick_(poet)
Poem Courtesy: http://www.poetryfoundation.org/poem/176697