అనువాదలహరి

ఎనిమిదో గంట … ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్, ఇంగ్లీషు కవి

.

అతను నిలబడి వింటున్నాడు

ఉదయపుహడావుడిలో ఉండే నగరానికి

చర్చి గోపుర గడియారం 

ప్రతి పావుగంటకీ కొట్టే గంటలు…

ఒకటి, రెండు, మూడు, నాలుగు

బజారుకీ, ఇతరచోట్లకీ అది వాళ్లందరినీ తరుముతోంది.

.

చేతులు వెనక్కి విరిచికట్టి,

ఉరితాడు బిగించి,

అతని చివరిక్షణం ఆసన్నమవుతుంటే

ఆ గంటలు అతను లెక్కపెడుతూ

తన దురదృష్టాన్ని నిందించుకుంటున్నాడు;

చర్చి గోపుర గడియారం 

తనశక్తినంతా కూడదీసుకుని…  గంటకొట్టింది.

.

ఆల్ఫ్రెడ్ ఎడ్వర్డ్ హౌజ్మన్,

26 March 1859 – 30 April 1936

ఇంగ్లీషు కవి.

(ఈ కవిత నేపధ్యంలో గుర్తుంచుకోవలసింది ఒకప్పుడు ఇంగ్లండులో మరణ శిక్షలు అందరూ చూసేట్టుగా అమలు జరిపేవారని. ఈ కవితకి ఆ సంఘటనతో సంబంధం లేకపోయినా, చిన్న సమాచారం ఏమిటంటే, 39 ఏళ్ల Henry Fauntleroy ( Managing Partner at Marsh, Sibbald & Co) అన్న వ్యక్తికి, లండనులో Newgate దగ్గర నవంబరు 30, 1824న ఉదయం 8 గంటలతర్వాత మరణశిక్ష అమలుజరప బడింది.  దాన్ని 1 లక్షమందికి పైగా ప్రజలు తిలకించేరట.

ఇక్కడ సూచించిన కాలం 19వ శతాబ్దం ఉత్తరార్థంగా గ్రహించ వచ్చు. 

ఈ కవితలోని సౌందర్యం దానిక్లుప్తత. చెప్పకుండా చెప్పిన భావం. గడియారం తన శక్తినంతా కూడదీసుకుని గంటకొట్టింది అనడంలోనే, అది ఎంత అన్యాయమైన మరణదండనో తెలుస్తోంది. గంటలు కొందరికి జీవితానికి తలుపు తెరుస్తే, కొందరికి జీవితానికి చరమగీతం పాడుతాయి. జీవులలోకలిగే భావపరంపరని, ఆవేశాలని, నిర్జీవులకి ఆపాదించడం ఒక కళాప్రక్రియ. దాన్ని Transferred Epithet అని కూడా వ్యవహరిస్తారు.)   

  

.English: English classical scholar and poet .

AE Housman Photographed by EO Hoppe

Image Courtesy: Wikipedia

.

Eight O’Clock

.

He stood, and heard the steeple
Sprinkle the quarters on the morning town.
One, two, three, four, to market-place and people
It tossed them down.

Strapped, noosed, nighing his hour,
He stood and counted them and cursed his luck;
And then the clock collected in the tower
Its strength, and struck.

.

A. E. Housman ( 26th March 1859 – 30th April 1936) English Classical Scholar and Poet

(Poem Courtesy: http://homepages.wmich.edu/~cooneys/poems/housman.clock.html

%d bloggers like this: