అనువాదలహరి

లెస్బియా రాసిన ఉత్తరం నుండి … డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

… కాబట్టి, కేటలస్ పోయినందుకు దేముడికి వెయ్యిదండాలు పెట్టు,

ప్రియమైన నెచ్చెలీ, ఒక విషయం మాత్రం నీకు నే చెప్పదలుచుకున్నా

ఇప్పుడైనా ఎప్పుడైనా, నీకు నచ్చినవాణ్ణి ఎవడినైనా ప్రేమించు,

ఒక్క కవిగాడిని తప్ప. వాడెవడైనా ఒక్కటే, చిత్రంగా ప్రవర్తిస్తారు.

.

వాళ్ళకి కలహమైనా, ముద్దుపెట్టుకోవడమైనా ఒక్కటే,

అవి వాళ్లకి పిల్లనగ్రోవిమీద పాడుకునే పాటల్లా ఉంటాయి.

అయితే దాన్ని స్తుతిస్తూనో, లేకుంటే దీనికోసం విలపిస్తూనో ఉంటాడు;

నా మట్టుకి నాకు, వ్యవహారజ్ఞానం ఉన్నవాడు కావాలి.

.

ఒకసారి ఆయన పిచ్చుకమీద ఒక స్మృతిగీతం రాసేడు,

నమ్మవు, ఎంతఘోరంగా ఉందో… అన్నీ దుర్భరమూ, ఏడుపొచ్చే పదాలే,

అయినా బాగుందన్నాను, నేను ఏడిచినట్టు నటించాను,

వెర్రి వెధవకి తెలీదు, నాకు పిట్టలంటే అసహ్యమని…

,

డొరతీ పార్కర్.

August 22, 1893 – June 7, 1967

అమెరికను కవయిత్రి

.

American writer Dorothy Parker (1893-1967)
American writer Dorothy Parker (1893-1967) (Photo credit: Wikipedia)

.

From A Letter From Lesbia

.

.. So, praise the gods, Catullus is away!

And let me tend you this advice, my dear:

Take any lover that you will, or may,

Except a poet. All of them are queer.

It’s just the same — a quarrel or a kiss

Is but a tune to play upon his pipe.

He’s always hymning that or wailing this;

Myself, I much prefer the business type.

That thing he wrote, the time the sparrow died —

(Oh, most unpleasant — gloomy, tedious words!)

I called it sweet, and made believe I cried;

The stupid fool! I’ve always hated birds …

.

 Dorothy Parker

August 22, 1893 – June 7, 1967

American Poet

పురాతన వ్రాతప్రతి … ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్, అమెరికను కవి

.

ఆకాశం … 

సూర్యుడూ, చంద్రుడూ

తమ దినచర్య రాసుకునే

అందమైన పాత తోలుపొరకాగితం.

దాన్ని అంతటినీ చదవాలంటే,

మీరు బృహస్పతి కంటే భాషాకోవిదులూ,

కలలతల్లి కంటే భావుకులూ,

యోగదృష్టిగలవారూ అయి ఉండాలి. 

కానీ,

దాన్నిఅందుకున్న అనుభూతి పొందాలంటే

మీరు దాని ప్రియ శిష్యులై ఉండాలి:

ఆత్మీయ శిష్యుణ్ణి మించి,

ఈ భూమిలాగో,

సముద్రం లాగో

నమ్మకమైన ఏకైక ఆంతరంగికులై నిలవాలి.

.

ఆల్ఫ్రెడ్ క్రేంబోర్గ్.

December 10, 1883 – August 14, 1966

అమెరికను కవి, నవలాకారుడూ, నాటక రచయితా, సాహితీ సంపాదకుడూ, సంకలన కర్తా

.

Alfred Kreymborg
Alfred Kreymborg (Photo credit: Wikipedia)

.

Old Manuscript

.

The sky

is that beautiful old parchment

in which the sun

and the moon

keep their diary.

To read it all,

one must be a linguist

more learned than Father Wisdom;

and a visionary

more clairvoyant than Mother Dream.

But to feel it,

one must be an apostle:

one who is more than intimate

In having been, always,

the only confidant—

like the earth

or the sea.

.

Alfred Kreymborg.

December 10, 1883 – August 14, 1966

American Poet, Novelist, Dramatist, Literary Editor and Anthologist.

నిష్క్రమిస్తున్న అతిథి … జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి

జీవితమూ, ప్రేమా

ఎంత మనోరంజకులైన గృహస్థులు!

నేను ఎంతో అయిష్టంగా,

అయినా సంతోషంగానే మరలుతున్నాను.

ఈ చరమ ఘడియలలో కూడా

వాళ్ళ ఉదాత్తమైన అతిథిమర్యాదలలో

నాకు ఏమాత్రం లోటు రానీయలేదు.

కనుక ఆనందం నిండిన ముఖంతో

నిండు కృతజ్ఞతతో

వాళ్ళ చేతులు నా చేతిలోకి తీసుకుని ఒత్తుతూ,

“మనం చాలా చక్కని సమయం గడపగలిగాం.

ఎంతో కృతజ్ఞుడిని, శుభరాత్రి,”

అని చెప్పడానికి ఇంకా వేచి ఉన్నాను.

.

జేమ్స్  వ్హిట్ కూంబ్ రైలీ

October 7, 1849 – July 22, 1916

అమెరికను కవి

.

James Whitcomb Riley, 1849-1916, half-length p...
James Whitcomb Riley, 1849-1916, half-length portrait, facing left (Photo credit: Wikipedia)

.

A Parting Guest

.

What delightful hosts are they—

Life and Love!

Lingeringly I turn away,

This late hour, yet glad enough

They have not withheld from me

Their high hospitality.

So, with face lit with delight

And all gratitude, I stay

Yet to press their hands and say,

“Thanks.—So fine a time! Good night.”

.

James Whitcomb Riley

October 7, 1849 – July 22, 1916

American Poet

..

మంచు మనిషి … వేలెస్ స్టీవెన్స్, అమెరికను కవి

గడ్డకట్టించే చలిగురించీ,

పైన్ చెట్టుకొమ్మలమీద

పేరుకున్న మంచు గురించీ

అవగాహనకావాలంటే,

శీతాకాలం గురించి తెలియాలి;

అంతే కాదు,

జూనిపర్ లు మంచులో

మత్తుగాతూలడం చూడాలన్నా

జనవరి సూర్యుడి వెలుగులో

దూరంగా స్ప్రూస్ చెట్ల నిగనిగలు చూడాలన్నా

చాలాకాలం చలిలో మగ్గి ఉండి ఉండాలి;

శీతగాలికోతపెట్టేహోరు అయితే చెప్పనలవికాదు.

ఆ ప్రదేశాన్నంతా ఆవరించి,

ఉన్న ఆ నాలుగు ఆకుల చప్పుడుతప్ప

వేరుచప్పుడు అక్కడవినబడదు;

ఆ దిగంబర ప్రకృతిలో

గిరికీలుకొట్టే గాలి అదే;

ఆ మంచులో, తనమాట వినేవాళ్ళు

ఎవరూ లేని శ్రోతకి,

అక్కడ లేనిదే కాదు,

అక్కడ ఉన్నది కూడా ఏదీ కనిపించదు.

.

(“హార్మోనియం (1923)” కవితాసంకలనం నుండి)

వేలెస్ స్టీవెన్స్

October 2, 1879 – August 2, 1955

అమెరికను కవి.

ఈ కవిత అర్థం చేసుకుందికి ఈ చిన్న విషయం తెలియాలి. “Snow Man”  అని శీతల దేశాల్లో మంచుకురిసిన తర్వాత ఒక బొమ్మ తయారు చేస్తారు. కురిసిన మంచుని చాపలా చుట్టి దాన్ని మళ్ళీ వేర్వేరు పరిమాణాలలో గోళాల్లా తయారు చేసి, అన్నిటికంటే పెద్దది క్రిందనా, దానికంటె చిన్నది పైనా అలా పేర్చుకుంటూ పోయి, అన్నిటికంటే మీదనున్న దానికి కళ్ళూ, చెవులూ ముక్కూ కాగితాలతోనో, అట్టలతోనో తయారు చేసి, మెడలో ఒక మఫ్లరూ, తలకి టోపీ పెట్టి, వయొ బేధం లెకుండా పిల్లలూ పెద్దలూ అందరూ ఆడడం అక్కడ అలవాటు.

ఈ కవితలో మంచుమనిషి ఎవరో చివరిదాకా తెలియదు. అక్కడ ఇచ్చిన పదబంధాల కూర్పుతో, కవివెనకే  మనమూ నడిస్తే, మనకు అర్థం అవుతుంది, మనమే ఆ మంచుమనుషులమని. కాకపోతే, చలిని ప్రత్యక్షంగా  అనుభవించనక్కరలేకుండా, అద్భుతమైన ఆ మంచుకురిసిన చిత్రాన్ని కళ్ళముందు ఆవిష్కరించుకో వచ్చు.

ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. మనకి వస్తువుల్ని వస్తువులుగా (యధా గ్రాహ్యంగా) చూడడానికీ, చూస్తున్న వస్తువునీ/ చిత్రాన్నీ  మనసులో అందంగా, రమణీయంగా, తాత్త్వికంగా, లేదా, నైతికంగా  అనువదించుకునే లక్షణానికీ మధ్య ఉన్న సంఘర్షణని సూచిస్తుంది.  మనకున్న కొన్ని సహజ లక్షణాలవల్ల, లేదా కొన్ని మోడల్స్ వల్ల, అన్నిటినీ ఆ దృష్టితో చూడడమో, ఆ విలువలతో తైపారవెయ్యడమో (మూల్యాంకనం చెయ్యడమో), చేస్తుంటాం. కేవలం నిర్లిప్తంగా, ఉన్నది ఉన్నట్టు, ఏ ఇతర రంగులూ, రుచులూ, వాసనలూ, లేకుండా చూడమనడం / చూడగలగాలి అని చెప్పడం ఇక్కడ కవి భావన. మనకు తెలిసీ, తెలియకుండా కూడా మనం కొన్ని పరిమితులను సృష్టించుకుంటాం అన్నది ఒక సత్యం.

.

English: Pine trees, Kirkton Glen Pines amongs...
English: Pine trees, Kirkton Glen Pines amongst the spruce in the Kirkton Glen forestry. (Photo credit: Wikipedia)

.

Pine in winter clothes
Pine in winter clothes (Photo credit: Jonas Tana)

Snow man
Snow man (Photo credit: Martin Pettitt)

.

Wallace Stevens
Wallace Stevens (Photo credit: Wikipedia)

.

The Snow Man

.

One must have a mind of winter

To regard the frost and the boughs

Of the pine-trees crusted with snow;

And have been cold a long time

To behold the junipers shagged with ice,

The spruces rough in the distant glitter

Of the January sun; and not to think

Of any misery in the sound of the wind,

In the sound of a few leaves,

Which is the sound of the land

Full of the same wind

That is blowing in the same bare place

For the listener, who listens in the snow,

And, nothing himself, beholds

Nothing that is not there and the nothing that is.

( from Harmonium , 1923)

Wallace Stevens

(October 2, 1879 – August 2, 1955)

American Poet

Poem Courtesy: http://homepages.wmich.edu/~cooneys/poems/Stevens.Snowman.html

నివురుగప్పిన జీవితం…ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికన్ కవయిత్రి

.

నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… ఇపుడిక అన్ని రోజులూ ఒకటే,

తినకా తప్పదు, నిద్రపోకా తప్పదు… జీవితమంతా రాత్రైపోతే  బాగుణ్ణు…

అబ్బా! రాత్రల్లా మేలుకుని గంటలు ఒకొక్కటీ సాగుతూ గడుస్తుంటే…

తెలతెలవారుతుంటే, మళ్ళీ ఉదయం అయితే బాగుణ్ణు అనిపిస్తుంది.

.

నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు… నాకేం చెయ్యాలో తోచడం లేదు,

ఇదనీ, అదనీ, మీరేది చెయ్యమని చెప్పినా అన్నీ నాకు ఒకటే,

నేను ప్రారంభించిన ఏ పనీ పూర్తిచెయ్యలేకపోతున్నాను

నాకు కనిపిస్తున్నంతవరకు, దేనివల్లా ఏమీ ప్రయోజనం లేదు.

.

నా ప్రియుడు నన్ను విడిచివెళ్ళిపోయాడు…పక్కవాళ్ళు తలుపుతట్టి ఏదో అడుగుతారు,

జీవితం అలా … ఎలుక కన్నం తవ్వుతున్నట్టు గడిచిపోతూనే ఉంటుంది,

రేపూ, రేపూ, రేపూ, రేపూ…  ఇక ఎన్నాళ్లైనా

ఈ వీధీ అలాగే ఉంటుంది… ఈ ఇల్లూ అలాగే ఉంటుంది శూన్యంగా.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

22 February 1892 – 19 October 1950

అమెరికన్ కవయిత్రి

ఇక్కడ ఎడబాటు, (అది పూర్తిగా వేరైపోవడమూ కావచ్చు, లేదా దేశాంతరాలు వెళ్ళి ఎప్పుడు తిరిగివస్తాడో తెలియని స్థితి కూడా కావచ్చు), ఆ ఎడబాటులో కలిగే మానసిక స్థితిని అత్యంత రమణీయంగా, వర్ణించింది కవయిత్రి. “ఎలుక కన్నం తవ్వుతున్నట్టు” అన్న ఉపమానం గమనించండి… కాలం కూడా అలా జీవితాన్ని తవ్వుకుంటూ పోతుంది మనకు తెలియకుండానే అన్న భావనని ఎంత అందమైన ఉపమానం వేసి చెప్పిందో. మనసులోని శూన్యతనీ, చేసే పనులలో అనాశక్తతనీ, ఇక జీవితానికి అర్థం లేదన్న నిరాశనీ, బహుశా ఇంత అందంగా ఎవ్వరూ చెప్పలేరేమో! ఆంగ్ల సాహిత్యంలో, ముఖ్యంగా అమెరికను సాహిత్యంలో అత్యంత రమణీయమైన కవిత్వాన్ని చెప్పిన బహు కొద్దిమంది కవయిత్రులలో ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే ఒకరు.

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)
Portrait of Edna St. Vincent Millay (1933-01-14) (Photo credit: Wikipedia)

.

Ashes of Life

 Love has gone and left me and the days are all alike;
   Eat I must, and sleep I will, -- and would that night were here!
 But ah! -- to lie awake and hear the slow hours strike!
   Would that it were day again! -- with twilight near!

 Love has gone and left me and I don't know what to do;
   This or that or what you will is all the same to me;
 But all the things that I begin I leave before I'm through, --
   There's little use in anything as far as I can see.

 Love has gone and left me, -- and the neighbors knock and borrow,
   And life goes on forever like the gnawing of a mouse, --
 And to-morrow and to-morrow and to-morrow and to-morrow
   There's this little street and this little house.

Edna St Vincent Millay

22 February 1892 – 19 October 1950 

American Poet

(Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2001/12/ashes-of-life-edna-st-vincent-millay.html)

నేను మృత్యువుకోసం ఆగలేను కాబట్టి… ఎమిలీ డికిన్సన్

నేను మృత్యువుకోసం ఆగలేను కాబట్టి,

పాపం, తనే నా కోసం ఆగేడు.

ఆ బగ్గీలో కేవలం మేమిద్దరమూ,

అనంతత్వమూ… అంతే!

.

మేము నెమ్మదిగా వెళ్తున్నాం,

అతనికి తొందరంటే ఏమిటో తెలీదు.

అతని మర్యాద చూసి, నా శ్రమనీ

ఖాళీసమయాన్నీ ప్రక్కనబెట్టవలసి వచ్చింది.

.

మేము స్కూలు పక్కనుండి వెళ్ళేము, అక్కడ పిల్లలు

విరామసమయంలో ఆటస్థలంలో ఆడుకుంటున్నారు.

పంటతో కళ్లుచెదిరిపోయే పొలాలపక్కనుండివెళ్ళేము

మేము అస్తమిస్తున్న సూర్యుడినికూడా దాటేము.

.

నిజానికి, అతనే మమ్మల్ని దాటివెళ్ళేడు

సాలెపట్టుమీద పేరుకున్న మంచు

చలికి ముడుచుకుని వణుకుతోంది

అక్కడ నా గౌనూ, మెడపట్టీయే నైలానువి.

.

మేం ఒక ఒక ఇంటిముందు ఆగేము,

అక్కడ నేల ఈనిందా అన్నట్టు ఉంది

ఇంటికి పైకప్పు కనిపించడం లేదు

చూరు మాత్రం నేలమీదే ఉంది.

.

నాటి నుండి శతాబ్దాలు గడిచిపోయాయి.

అయినా, రోజుకూడా గడిచినట్టులేదు.

మొదట నేను గుర్రాలముఖాలు

అనంతంవైపు ఉన్నాయేమోనని అనుకున్నాను.

.

ఎమిలీ డికిన్సన్

(December 10, 1830 – May 15, 1886)

అమెరికను కవయిత్రి.

ఈ కవితలో నాకు రెండు విషయాలు గొప్పగా అనిపించేయి … ఒకటి మనం ఎన్నో సమాధులమీద ఉన్నామని చెప్పడానికి “నేల ఈనినట్టు ఉన్న” మృతులగురించి చెప్పిన మాట; రెండవది, గుర్రాల ముఖాలు అనంతం వైపు ఉన్నాయని అనుకున్నానని అనడం, అంటే, మనకి వేరే అనంతత్వం లేదు, ఇక్కడ ఉండవలసిందే, (There is nothing eternal for us except recycling into the nature any number of times) అన్న భావన.

.

/

English: Daguerreotype of the poet Emily Dicki...
English: Daguerreotype of the poet Emily Dickinson, taken circa 1848. (Original is scratched.) From the Todd-Bingham Picture Collection and Family Papers, Yale University Manuscripts & Archives Digital Images Database, Yale University, New Haven, Connecticut. (Photo credit: Wikipedia)

.

Because I Could Not Stop for Death

.

Because I could not stop for Death

He kindly stopped for me

The Carriage held but just Ourselves

And Immortality.

We slowly drove – He knew no haste

And I had put away

My labor and my leisure too,

For His Civility

We passed the School, where Children strove

At Recess – in the Ring

We passed the Fields of Gazing Grain

We passed the Setting Sun

 

Or rather – He passed us

The Dews drew quivering and chill

For only Gossamer, my Gown

My Tippet – only Tulle

We paused before a House that seemed

A Swelling of the Ground

The Roof was scarcely visible

The Cornice – in the Ground

Since then – ’tis Centuries – and yet

Feels shorter than the Day

I first surmised the Horses’ Heads

Were toward Eternity

.

Emily Dickinson.

 • poem montage (prattpoeticsofcinemamorningfall12.wordpress.com)

ప్రకృతీ – వికృతీ … జేమ్స్ సిమ్మన్స్, ఐరిష్ కవి.

.

ఇరవై అడుగులదూరం నుండి,

ఒకప్పటి నా ప్రియురాలు కారు తాళం వెయ్యడం చూశాను.

చెయ్యి ఊపి, తను నవ్వింది,ఇప్పటికీ

అంత అందంగా,ఇరవై ఏళ్ళ పిల్లలా.

.

గోధుమరంగు జుత్తు తన తలమీద ఇప్పటికీ

సూర్యోదయంలా వెల్లివిరుస్తోంది

ఆమె నవ్వు, తను ఎంతమామూలువిషయం చెప్పినా

నాకు చిరునవ్వు తెప్పిస్తూ ఉండేది.

.

కానీ ఇరవై ఏళ్ళు గడిచిపోయేయి.

చర్మము వేగం చెడిపోయే వస్తువాయె;

వ్యాయామాలూ, ఆహార నియమాలూ,

సౌందర్య పోషకాలూ సరిపోతాయా

.

ఆ సూక్ష్మముఖకండరాలని కాపాడటానికి?

శరీరాన్ని బిగుతుగా ఉంచి

నడిమివయసులో కూడా నడుము

లోపలికి వంపుతిరిగేలా చెయ్యగలవా?

.

అందం ముందుకు తోస్తుంది పలకరిద్దామని

కాని కృత్రిమత, నిజాన్ని భరించనీదు

ఎందుకంటే, పైబడిన ప్రతి ఏడాది వయసుకీ

ఆమె ఒక గజం చొప్పున పెరిగింది.

.

జేమ్స్ సిమ్మన్స్

(1933–2001)

ఐరిష్ కవి

.

Art and Reality

.

From twenty yards I saw my old love

Locking up her car.

She smiled and waved, as lovely still

As girls of twenty are.

That cloud of auburn hair that bursts

Like sunrise round her head,

The smile that made me smile

At ordinary things she said.

But twenty years have gone and flesh

Is perishable stuff;

Can art and exercise and diet

Ever be enough

To save the tiny facial muscles.

And keep taut the skin,

And have the waist, in middle-age,

Still curving firmly in?

Beauty invites me to approach,

And lies make truth seem hard

As my old love assumes her age,

A year for every yard.

.

James Simmons

1933–2001

Poet, Literary Critic and Songwriter from Derry, Northern Ireland.

Poem Courtesy:  http://homepages.wmich.edu/~cooneys/poems/simmons.art&reality.html

Begum Akhtar (Part 2) … Samala Sadasiva, Indian

.

The experience of cognoscente Kishan Sing Chavda is worth mentioning.

He was then working as Diwan with Maharaja of Nilam Nagar. It was a common practice those days for the native rulers having some work with the Viceroy to keep him in good humor, and stay close to Viceroy. Calcutta in December is delectable. So, Viceroy usually held his court in December in Calcutta. That was December 1938.  Accompanying the Maharaja, Kishan Sing Chavda put up in a star hotel in Calcutta. The Maharaja was a connoisseur of music. So whenever he could find time, he either invited the singers to his place or visited them. Aktaribai was living in Calcutta those days. True artistes never care for money as much as they care for a true aficionado of their art. While performing before the Maharaja she noticed Chavda askant, many times, nodding his head appropriately and expressing his appreciation at the right time. She understood he was a connoisseur of music.  One day, after her performance, she requested him to follow her up to the car. Seating in the car, she said, “Chavdaji! Grace my house with your presence! I shall render some cheeses especially for you.” What a divine blessing, thought Chavda.

So he went to her house one day. She invited him with due courtesies and signalled her “Saajindas” (accompanying musicians). Before she could commence the Alapana, she received a message about the arrival of the Maharaja of Nilam Nagar. It was embarrassing for Chavda to appear before his Maharaja that way. She understood his predicament. So she sent him to her bed room and invited the Maharaja in. She signalled her Saajindas again and she commenced her Alapana. Again there was a message that, this time, the Maharaja of Pratapgarh was waiting below. Another complication now. Sending the Maharaja of Nilam Nagar into the same bed room as Chavda was in, she invited the Maharaja of Pratapgarh up, gave him the traditional welcome befitting him, rendered him the cheeses he requested, accepted his generous honorarium, and bade him farewell. The Maharaja of Nilam Nagar and his Diwan were sitting silent in her bed room all the while. She invited them back into the Darbar Hall, seated them comfortably and rendered them cheeses to their heart’s content. That’s the presence of Goddess Saraswati. There was no discrimination of class and status there. King and his subject were treated alike. Learned men were always welcome.

The two listeners were thrilled. At the behest of the Maharaja, Chavda tried to offer her five hundred rupees while getting down. The Maharaja was very shrewd. He smiled and kept quiet. But Baiji did not stop at that. “Chavdaji! The reason for my inviting you here is not to take from you, but to offer you. I offered my rudimentary knowledge before you. Treat it as a small and humble present of an ordinary  practitioner of music to its connoisseur.” And she bowed her head with all humility and saluted.

“The head that never bowed before Kings and Sovereigns, had bowed before an ordinary servant of a court. Baiji who was not easily pleased with offerings of thousands in compensation for her performance, was immensely pleased for merely listening to her,” said Chavda.

Born into a traditional muslim family, Akhtari Begum had developed interest in music and learnt classical music with Ustad Ata Mohammed Khan of Patiala Gharana for sometime, and with Ustad Abdul Waheed Khan of Kirana Gharana for some more time. Yet, her heart was with Thumri, Dadra, Ghazal and Bhajan. Those days education in such genres was received only by Court-prostitutes. So, she was separated from her family. She earned immortal fame and riches as Akhtari Bai. She attained respectable status as Begum Akhtar after marrying Barrister Abbasi. As a corollary to it, she was compelled to undergo certain societal restrictions as well. Her music fell silent under the veil. Harmonium, Tabla and Tambourine were condemned to some corner. Not only for her fans, it became insufferable even to her, who thought that singing was synonymous with living. Whenever her fellow musicians visited their house, Abbasi played a good host. But she helplessly and silently shed tears for her condition. Whenever she heard the music of her contemporaries she cried. Malika Pukhraj her close pal but not her equal when it comes to singing Ghazals, once came to tears seeing Begum Akhtar in such a state. Malika Pukhraj mentioned this in an interview. 

Barrister Abbasi had great taste for Urdu Ghazals. He was also a music lover. But he could not permit his wife, belonging to a reputable family, to sing in public.  Sunil Bose was a good singer and a scholar of music. He was appointed as Programme Producer at Lucknow Station of All India Radio. Luckily for him, he could find accommodation near “Akhtar Manjil”, the palace of Begum Akhtar. He was an old acquaintance of her. So he used to frequent her house along with his wife and engaged in discussions on music and literature with the couple. He noticed the shades of grief and despair in the face of Begum Akhtar whenever the discussion turned to music. He decided to record her on AIR at any cost. Though Justice Walford was a foreigner, he was a fan of Urdu Ghazals and Hindustani music. With his support Sunil Bose was somehow able to convince Abbasi and record her at AIR. When the Lucknow AIR aired her Ghazals after a long lapse of time, her fans found no bounds for their joy. Abbasi realized that it was a sin to hide that divine blessing under the veil and, from then on himself encouraged Begum Akhtar sing. He was present wherever she gave a programme. She gave many charity programmes. One such programme was arranged in Ahmedabad on 30th October 1974. She reached the place along with Abbasi. Noticing she was not well, Ustad Amjad Ali Khan entreated her, “Ammijaan! you are not at all in good health. Better you refrain from singing for today.”

“My son! I promised them. How can I break the promise now?” she replied and went ahead. She often said, “I will sing to my last breath.” Living to her word, she breathed her last after the concert was over on the stage.

Begum Akhtar had a remarkable style of singing Ghazals. She gave precedence to the meaning of the Ghazal. She treated the Raga secondary. She would begin the concert with a famous Raga, but without making a detailed Alapana, she would sing each “Sher” (couplet)of the Ghazal  with a touch of that Raga pronouncing each word clearly and perfectly. She never attempted to display her proficiency in music while singing Ghazals. “Delineation of Raga with the notes or with voice modulation shall spoil the mood and meaning of the Ghazal,” she used to advise her disciples. And she followed what she prescribed. For that reason she could bring many poets into limelight. Listening to her Ghazals, people shall feel they were listening some melodious music and some great poetry.  There are many people singing Ghazals these days. Some of them earned name and fame. But it is beyond this generation to reach Begum Akhtar’s level. To learn how to render a Ghazal, these people who release cassettes and cut discs each day, should first listen to her carefully time and again. 

“Like the devotees celebrating weekly programmes, we used to celebrate Begum Akhtar’s week with her records in our times,” once said, Padma Bhushan Purushottam Lakshman Des Pande.

She liberally gave education to many students. Affectionately called “Ammijaan” by her disciples, she imparted her singing style to everybody without any expectations. Students like Shanti Hiranand, Rita Ganguly, and Anjali Banerjee still keep her style alive. We cannot but remember Begum Akhtar, when we listen to Shobha Gurtu, who sings Ghazals very much in her style, even though she was not her student.

The Government of India released a commemorative postal stamp recently, on the 25th death anniversary of Begum Akhtar. And the first stamp was presented to Malika Pukhraj, her childhood pal. She was specially invited from Pakistan for this. All music lovers appreciated the gesture of the Government and praised it as most appropriate.

(Note: This was an old article written by  late Samala Sadasiva. Some of the personalities referred to by him in present tense, like Malika Pukhraj, Purushottam Lakshman Des Pande, etc., are no more. ) 

Image Courtesy: http://1.bp.blogspot.com/

Samala Sadasiva

1928 – 8 August 2012

.

.

బేగంఅఖ్తర్ … సామల సదాశివ

(మలయ మారుతాలు” నుండి)

(Part 2)

సంగీత రసికుడైన కిషన్ సింగ్ చావ్ డా అనుభవం చెప్పుకోదగ్గది.

అతనప్పుడు నీలం నగర్ మహరాజా దగ్గర దీవాన్ గా పనిచేస్తున్నాడు. వైస్రాయ్ ఎక్కడ ఉంటే అతనితో అవసరం ఉన్న స్వదేశీసంస్థానాధీసులు అక్కడ ఉండడం పరిపాటి. కలకత్తాడిసెంబర్ కమనీయమైంది. కాబట్టి వైస్రాయ్ దర్బారు డిసెంబరు నెలలో కలకత్తా నగరాన జరిగేది. డిసెంబరు 1938. కిషన్ సింగ్ చావ్ డా తన రాజావారి వెంట ఒక భవ్యమైన హోటల్లో బసచేసి వున్నాడు. మహరాజావారు సంగీతప్రియులు. కనుక అవకాశం దొరికినపుడల్లా గాయనీగాయకులను స్మరించుకునేవారు. అక్తరీబాయి అప్పట్లో కలకత్తాలో ఉండేది. నిజమైన కళాకారులు నిజమైన సంగీత రసికులకు ఇచ్చేవిలువ డబ్బుకీయరు. రాజావారి ముందు పాడుతున్నప్పుడు సందర్భశుధ్ధిగాతలూపుతూ శహబాష్ ఇచ్చే చావ్ డాను చాలసార్లు కడగంట గమనించింది. అతడు నిజమైన రసికుడని అర్థం చేసుకుంది. ఒకనాడు పాటవినిపించి కిందికిపోతూ తనకారుదాకా రావలసిందిగా అతన్ని అభ్యర్థించింది. కారులోకూర్చుంటూ, “చావ్ డాజీ! ఒకసారి నా యింటిని పావనం చెయ్యండి. మీకు ప్రత్యేకంగా చీజులు వినిపించాలని ఉన్నది” అని మనవి చేసింది. అహో భాగ్యం అనుకున్నాడు చావ్ డా.

ఒకనాడు ఆమె నివాసభవనానికి వెళ్ళినాడు. సాదరంగా అతన్ని ఆహ్వానించి సాజిందాల (వాద్యకాండ్రు)కు సంజ్ఞ చేసింది. ఆలాపన ఆరంభించబోతుండగా నీలంనగర్ మహారాజావారు వేంచేసినారని క్రిందనుండి వార్త వచ్చింది. తను రాజావారి కంటపడడం చావ్ డా కు సంకట పరిస్థితి. అతని అవస్థ గమనించిన బాయీజీ అతన్ని తన శయనాగారంలోకి పంపి మహారాజావారిని ఆహ్వానించింది. మళ్ళీ సాజిందాలకు సంజ్ఞ. మళ్ళీ ఆలాపన. అంతలోనే ప్రతాప్ గఢ్ మహారాజావారు వచ్చినారని వార్త. మళ్ళీ చిక్కువచ్చి పడింది. మహారాజావారిని అదే శయనాగారంలోకి పంపి ప్రతాప్ గఢ్ మహారాజాను పైకి ఆహ్వానించింది. జరుపవలసిన అతిధిమర్యాదలు జరిపి, అతడుకోరిన చీజులు వినిపించి, ఇచ్చిన పారితోషికం స్వీకరించి కిందికి పంపివేసింది. శయనగృహంలో తేలుకుట్టినదొంగల్లా మౌనంగాకూర్చున్నారు మహారాజా, అతని సెక్రటరీ. వాళ్ళిద్దర్నీ దర్బారు హాల్లోకి తెచ్చి, కూర్చుండబెట్టి తనివిదీరా విలువైన చీజులు వినిపించింది. అది సరస్వతి సన్నిద్గానం. అక్కడరాజూ పేదా సమానులే. అభిజ్ఞుడు  ఆదరణీయుడు. శ్రోతలిద్దరూ బ్రహ్మానంద భరితులైనారు. దిగి వచ్చేటప్పుడు రాజావారి ఆజ్ఞమేరకు ఐదువందల రూపాయలు అర్పించబోయినాడు చావ్ డా. ఆమె మర్యాదగా తిరస్కరించింది. మహారాజు మర్మజ్ఞుడు. మందహాసం చేసి ఊరుకున్నాడు. అంతటితో ఆగలేదు బాయీజీ. “చావ్ డాజీ. మిమ్మల్ని ఇక్కడకి ఆహ్వానించింది స్వీకరించడానికి కాదు. నివేదించడానికి. మీ ముందు నాస్వల్ప విద్యను ప్రదర్శించి ధన్యురాలనైనాను. సంగీత విద్యలో సామాన్య సాధకురాలు సంగీత రసికునికి  సమర్పించిన చిరు కానుక ఇది” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా శిరసు వంచి సలాం చేసింది.

“రాజాధిరాజులముందు వంగని శిరస్సు ఒక సామాన్యుడైన రాజోద్యోగి ముందు సవినయంగా వంగింది. వేలకువేలు సమర్పించినా తృప్తిచెందని బాయీజీ విన్నందుకే ధన్యురాలన్నది” అంటాడు చావ్ డా.

సాంప్రదాయికమైన ముస్లిం కుటుంబంలో జన్మించిన అఖ్తరీ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు పట్యాలా ఘరనాకు చెందిన ఉస్తాద్ అతా అహ్మద్ ఖాన్ వద్ద, మరికొన్ని నాళ్ళు కిరాణా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. అయినా అమెకు ఠుమ్రీ, దాద్రా, గజల్, భజన్ ల గాయనమే సమ్మతమయింది. ఆ కాలంలో అది బాయీజీల విద్య. కాబట్టి ఆమె తన కుటుంబానికి దూరమయింది. అఖ్తరీబాయిగా అశేషమైన కీర్తినీ, అపారధనసంపత్తినీ ఆర్జించింది. బారిస్టర్ అబ్బాసీ భార్య అయిన తర్వాత బేగం అఖ్తర్ సమాజంలో గౌరవ స్థానం సంపాదించింది. ఈ సామాజిక గౌరవం వల్ల ఆమె కొన్ని కట్టుబాట్లకు లోనుకావలసి వచ్చింది. బురఖా చాటున ఆమె స్వరాలు మూగవోయినవి. తబ్లా, హార్మోనియం, తంబూరాలు మూల పడ్డవి. పాడటమే జీవితమని భవించిన ఆమె పర్దాచాటుకు వెళ్ళిపోవటం ఆమె అభిమానులకేగాక ఆమెకు కూడా దుస్సహమయింది. ఆమె తోటి గాయనీగాయకులు ఆమె ఇంటికి వస్తే అబ్బాసీగారు ఆప్యయంగా ఆదరించేవారు. కాని ఆమె అసహాయురాలయి మౌనంగా రోదించేది. ఎవరిపాటలు విన్నా ఏడుపువచ్చేదామెకు. గజల్ గాయనం లో ఆమెకు సమానురాలు కాకున్నా సన్నిహితురాలైన మలికా పఖ్రాజ్ (Malika Pukhraj)అమెను ఆ స్థితిలో చూసి తానూ ఏడ్చిందట. మలికా పక్రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందీ మాట.

బారిస్టర్ అబ్బాసీ ఉర్దూ గజళ్ళపట్ల ఉత్తమాభిరుచిగలవాడే. సంగీత ప్రియుడే. కానీ, పరువుగల కుటుంబంలో ప్రవేసించిన తన భార్య పబ్లిగ్గా పాడటాన్ని అనుమతించలేకపోయాడు. సునీల్ బోస్ స్వతహాగా గాయకుడు, సంగీతవేత్త. అతడు లఖ్నో రేడియో స్టేషన్ కు ప్రోగ్రం ప్రొడ్యూసర్ గా నియుక్తుడయ్యాడు. అదృష్టవశాన అతనికి లఖ్నోలో బేగం అఖ్తర్ హవేలీ “అఖ్తర్ మంజిల్” దగ్గర్లోనే ఇల్లు దొరికింది. అతడామెకు పూర్వ పరిచితుడు. కనుక తరచుగా తన భార్యవెంట అఖ్తర్ మంజిల్ కు వెళ్ళేవాడు. ఆ దంపతులతో సంగీతసాహిత్యాల చర్చచేసేవాడు. సంగీత ప్రసక్తి వచ్చినపుడు బేగం అఖ్తర్ ముఖం మీద కనిపించే నిరాశా నిస్పృహలను గమనిస్తూ, బోసుబాబు ఎలాగైనా ఆమెను లఖ్నో రేడియో నుంచి పాడించాలని నిర్ణయించుకున్నాడు. జస్టిస్ వాల్ఫోర్డ్ విదేశీయుడైనా ఉర్దూ గజళ్ళను, ఉత్తరాది సంగీతాన్ని ప్రేమించేవాడు. అతనితో కలిసి బోసుబాబు ఎలా అయితేనేమి బారిస్టర్ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాను రేడియో స్టేషనుకు రప్పించగలిగినాడు. బహుకాలం తర్వాత లఖ్నో రేడియో స్టేషన్ ప్రసారం చేసిన ఆమె గజళ్ళను విని అసంఖ్యాకులైన ఆమె అభిమానులు ఆనందభరితులైనారు. అబ్బాసీ కూడ దైవదత్తమైన అలాంటి దివ్యస్వరాలను దాచిపెట్టడం అపచారమని గ్రహించినాడు. ఆనాటినుంచి తానే ఆమెను ప్రోత్సహించినాడు. ఎక్కడ బేగం అఖ్తర్ ప్రోగ్రాం జరిగినా అక్కడ అబ్బాసీ వుండేవాడు. ఆమె ఛారిటీ ప్రోగ్రాములు చాలా ఇచ్చింది. అహమదాబాదులో 30 అక్టోబరు 1974న అలాంటి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటయింది. అబ్బాసీ వెంట అక్కడికి వెళ్ళిందామె. ఆమె ఆరోగ్య పరిస్థితి గమనించి ఉస్తాద్ అంజాద్ ఆలీఖాన్ “అమ్మీజాన్, మీ ఆరోగ్యం బాగాలేదు. ఈనాడు పాడకుంటేనే మంచిది” అని వేడుకున్నాడు. “బేటా! మాట ఇచ్చినాను. ఇప్పుడెలా తప్పను?” అని పాటకచేరీ ప్రారంభించి పాట ముగిసిన తర్వాత “చివరి శ్వాస వరకూ పాడుతూనే జీవిస్తాను” అని తరచూ అంటూవుండే బేగం సాహెబా తనమాటను సార్థకం చేసుకున్నది. చివరి శ్వాస అక్కడే విడిచింది.

ఆమె గజల్ గాయన శైలి అతి విశిష్టమైనది. ఆమె గజల్ పాడేటప్పుడు భావానికి ప్రాధాన్యం ఇచ్చేది. రాగాన్ని గౌణంగా పాటించేది. ఏదో ఒక ప్రసిధ్ధ రాగంలో గజల్ ప్రారంభించి అంతగా రాగాలాపన చెయ్యకుండా, స్పష్టమైన, శుధ్ధమైన ఉచ్ఛారణతో ఒక్కొక్క షేర్ నూ ఆ రాగస్పర్శతో పాడేది. గజల్ పాడేటప్పుడు తన సంగీత పాటవాన్ని ప్రదర్శించేది కాదు. సరిగమలు వెయ్యడం గాని, తాన్ బాజీ చేయటం గాని గజల్ భావ సౌందర్యాన్ని మరుగుపరుస్తాయని తన శిష్యులకు చెప్పేది. తానూ అలాగే పాడేది. కాబట్టే ఎందరో కవులకు ఆమె ప్రతిష్ఠ కలిగించింది. ఆమె గజళ్ళు వింటుంటే శ్రోతలు మధురమైన సంగీతం వింటున్నామన్న అనుభూతిని పొందుతారు. అందమైన గజల్ వింటున్నామన్న ఆనందం పొందుతారు. ఈనాడు ఎందరో గజళ్ళు పాడుతునారు. కొందరికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు కూడా లభించినాయి. కానీ, బేగం అఖ్తర్ స్థాయిని అందుకోవటం ఈ తరంలో ఎవరి తరం కాదు. తాము పాడిన గజళ్ళ క్యాసెట్లు అసంఖ్యాకంగా విడుదల చేస్తున్న గజల్ గాయకులు గజల్ ని ఎలా పాడవలెనో గ్రహించటానికి బేగం అఖ్తర్ ను పదేపదే వినాలె.

“భక్తజనులు రామాయణ సప్తాహం జరుపుకున్నట్లు మాకాలంలో మేము బేగం అఖ్తర్ రికార్డుల సప్తాహం జరుపుకునేవాళ్ళం “ అంటాడు పద్మభూషణ్ పు. ల. దేశ్ పాండే.

బేగం అఖ్తర్ ఉదారం గా విద్యాదానం చేసింది. తన శిష్యుల నోట, శిష్యురాండ్ర నోట “అమ్మీజాన్” అని ప్రేమగా పిలిపించుకునే ఆమె అందరికీ ఎలాంటిప్రతిఫలాపేక్షలేకుండా తన గాయన శైలిని నేర్పింది. శాంతీ హీరానంద్, రీటా గంగూలీ, అంజలీ బెనర్జీ లాంటివాళ్ళు ఆమె శైలిని కొంతవరకు కాపాడుతున్నారు. ఆమె శిష్యురాలి కాకున్నా అచ్చం ఆమెలా పాడే శోభా గుర్టు గజళ్ళు వింటుంటే బేగం అఖ్తర్ ను స్మరించుకోకుండా ఉండలేము.

ఇటీవల ఆమె 25వ వర్థంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం బేగం అఖ్తర్ తపాలాబిళ్ళను విడుదల చేసింది. మొదటి తపాలాబిళ్ళను అమె బాల్య సఖి, ఆమెస్థాయికి ఇంచుమించు చేరిన గాయకురాలు మలికా పఖ్రాజ్ కు సమర్పించింది. పాకిస్తాన్ లో నివసిస్తున్న మలికా పఖ్రాజ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇది చాలా సముచిత చర్య అని భారత ప్రభుత్వాన్ని సంగీత రసికులు ప్రశంసించినారు.

Begum Akhtar (Part 1) … Samala Sadasiva

మతాన్నీ, విశ్వాసాల్నీ జీవనమార్గంగా అనువదించుకుని, హిందూ-ముస్లిం సఖ్యతకూ, పాలూ నీళ్లలా కలగలిసిన సంస్కృతీ వారసత్వాలకు నిలువెత్తు నిదర్శనాలుగా, మనకు మార్గదర్శకులుగా  మనకళ్ళెదుటే ఉదాత్తమైన వ్యక్తిత్వాల్ని కనబరుస్తూ,సహజీవనాన్ని సాగించిన అద్భుతమైన వ్యక్తులు కొద్దికాలంక్రిందట ఈ నేలమీద నడిచేరు.  సంగీతమూ, సాహిత్యమూ భాషా ఒక మతానికో ప్రాంతానికో చెందినవని కాకుండా, అవి ఈ దేశ సంపదగా భావించి వాటిలోని స్వారస్యాన్ని గ్రహించి ఆనందించిన ఒక  జీవన ప్రక్రియ ఈ గడ్దమీద నిలిచింది. అటువంటి సంఘీభావం మధ్య కొయ్యలు దిగ్గొట్టి వేరుచేసిన / చేస్తున్న నేటి రాజకీయ పరిస్థితి చూస్తుంటే, శ్రీశ్రీ చెప్పిన “ఏవి తల్లీ నిరుడుకురిసిన హిమ సమూహములు” అన్న బాధ మనసులో కలుక్కు మనక మానదు. సామల సదాశివగారు అత్యద్భుతంగా ఆవిష్కరించిన అటువంటి జీవిత చిత్రాలలో, కొన్ని తరాల యువకుల్ని తన వ్యక్తిత్వ,గాన,రూపలావణ్యాలతో అలరించి వెర్రివాళ్లను చేసి సంగీతానికి మతం లేదని చాటిచెప్పిన అపూర్వ ఘజల్ గాయని బేగం అఖ్తర్.

ఆమె జీవితంలో మనం నేర్చుకోగలిగిన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. అవధరించండి:

.

In her youthful days Begum Akhtar really drove many people mad with her Ghazal  

Deewaanaa banaanaa haitO deevaanaa banaanaa dE  

(Drive me crazy if you so wish…).

Written by Bejaad Lakhnavi, this Ghazal belongs to Sufi tradition. So there was no hyperbole when it was said that the Ghazal drove the worshippers of love crazy. Love in the Sufi tradition is of two kinds… one is “Ishk e Majaaji”, the temporal love and the other is Ishk e Hakiiki, the eternal love. Temporal love is a means to achieve the eternal. So, these kinds of Ghazals always attracted the attention of the youth and the old alike. The listeners experience a kind of bliss. That state of experiencing bliss is the craziness the Ghazal speaks of.

That Ghazal is still capable of driving youth crazy even today. But the times when she rendered this Ghazal she was not Begum Akhtar; she was Akhtaribai Faizabadi. As Akhtaribai she sang many immortal Thumries, Dadras, Kajries, and Chaities.

She became Begum Akhtar after her Nikah with the rich bar-at-law from Lucknow having roaring practice, Ishtiaq Ahmed Abbasi.

As Begum Akhtar she rendered more Ghazals than Thumries and Dadras. She has a unique style in singing of Ghazals. In her sunset days Begum Akhtar made scores of discerning listeners cry with her Ghazal:

Aye Mohabbat  tere Anjaam pe Rona Aaya” (Oh, You Love! Your consequences make me cry!).

When I said she made people cry, it may sound strange to some people. But people with fine sensibilities weep when they listen  touching words or a touching song. In music parlance those people are called “Dardees” Dardees are the people who can feel the pain. All of us are “Dardees” if we can discern the fine pain in either literature or music. Here is a small anecdote:

Maharaja of Mehamoodabad had invited all the reputed artistes of his time on the occasion of the marriage of his son Mohammad Ahmad Hasan Khan. Those days, the famous singers were not within the reach of gramophone companies or the Programme Executives of AIR stations, but thought it prestigious to sing in the courts of the kings. That night great stalwarts like Jaddanbai (Mother of Nargis), Rasoolanbai had performed. Bigganbai’s turn came as the day was about to break. She sang a Ghazal in Rag Bhairavi. Every stanza of the Ghazal touched the heart of the listeners straight. And her style of sweet rendering added to its beauty. The handkerchiefs of the invitees were dripping with tears. And the discerning music lovers began referring that night as “tar rumaalomki raat” (Night of wet handkerchiefs.)

I narrated this event to substantiate that music has the ability to make you cry.

Akhtaribai was the highest paid artiste those days. The beauty of her person, the refined and tasteful Lucknow civility, and her witty conversation reflecting her culture; and above all, her straining voice in the high octaves which in any other person might have been a blemish but in her it was an asset, added to enhance her value.

Her fans would say the harmony of her notes was only in the realm of experience and not in expression. Purushottam Lakshman Des Pande was not only a music lover with refined taste, but was also a very good writer. He once said: “as her notes meet the ear, the legs cease to walk, the active hands become still, and the blubbering mouth becomes mute.” And another writer of equal stature, Kishansing Chavda said: “even the musically deaf shall stand still the moment her notes enter their ears.”

Her manner commanded for respect from everybody. However great they were, and how much ever they had paid for her, nobody dared to cross the limits of decency with her. And if anybody tried to do, she was so adept in smoothly wriggling out of such situations with a friendly censure keeping her respect unblemished.

The second son of Hyderabad Nizam, Prince Moazzamjahi, was a patron of arts and literature. His court was always teeming with artistes. He once invited Akhtaribai for one week programme in his court. Akhataribai noticed the state of affairs at that place were not to her taste on the first day itself. So without even taking leave from the Prince, she packed up her luggage and left the place the following day. The Prince sent Jewelry for seven days of the week, seven valuable saris and the contract amount for the seven days programme with his secretary to the Nampally Station. Noted court poet Sidq Jaisi mentioned this in his “Darbar- e-durbar”, a chronicle of the Prince’s Darbar. But he never mentioned whether she accepted them or rejected them; after all, the court poet’s intention in recording this incident was more to highlight the generosity of his Prince rather than the self-respect of Akhtaribai!

It was a custom those days with all wealthy families to invite reputed Baijees and arrange mujras whenever there was a function in their households. Thus once a Zamindar in Punjab arranged a mujra by Aktaribai on the occasion of some auspicious function at his home. All the invitees were enraptured by her performance. As per the custom she was handed over a bag containing thousand Victoria Coins. She handed it over to someone in her retinue. “Baijee! There are thousand Victoria coins in that, you forgot to count,” said the Zamindar. The tone of the Zamindar had a smack of arrogance. She hated that. Politely saying “Hujur!” she raised her both hands and said, “The amulets of these hands value above sixty thousand and you are witnessing the jewelry on my person. I don’t know the value of the jewelry at my home. By your grace, there is no dearth of money. Where is the time for me to count these coins?” and left the place.

Not that she behaved with everybody like this. Whenever the ‘King of Aesthetics’ Ramu Bhayya Date visited her house, she was so delighted as if God himself had visited her house, and attended to every detail, customary to Lucknowites while playing host, sang him his favorite cheeses before seeing him off. He was an officer in the then government and  a resident of Indore . His knowledge of music was unsurpassed. All the artistes yearned for his attention when they sang. It was they who conferred him the title ‘King of Aesthetics’. He had great love for Akhtaribai’s music. He used to call the jarda pills he took in his pan as ‘Akhtar pills’. And whenever he followed the musicians of his liking on a musical tour, he used his car named “Akhtari”.

(continued)

.

బేగంఅఖ్తర్ … సామల సదాశివ 

(మలయ మారుతాలు” నుండి)

. Part 1

బేగంఅఖ్తర్ పడుచునాళ్ళలో “దీవానా బనానా హై తో దీవానా బనాదే” అనే గజల్ ద్వారా ఎందరినో దీవానాలను చేసింది. బెహ్జాద్ లఖ్నవీ రచించిన ఆ గజల్ సూఫీ సంప్రదాయానికి చెందింది. కాబట్టి అది ప్రేమోపాసకులందరిని దీవానాలుగా చేసిందనటం అతిశయోక్తి కాదు. సూఫీ సంప్రదాయంలో ప్రేమ ద్వివిధము. ఒకటి “ఈష్కే మజాజి” అంటే ఐహిక ప్రేమ; రెండవది “ఇష్కే హఖీఖి” అంటే ఈశ్వర ప్రేమ. ఈశ్వరప్రేమకు ఐహికప్రేమ ఆధారం. ఇలాంటి గజళ్ళను యువకులెంత ఉత్సాహంగా వింటారో భక్తిభావంగల పెద్దలూ అంతే ఉత్సాహంగా వింటారు. పరవశులౌతారు. పరవశమే దీవాన్గీ.

“దీవానా బనానా హై తో దీవానా బనాదే” అనే గజల్ ఇప్పటికీ శ్రోతలను ప్రణయపరవశులనుచేసే సామర్థ్యం గలది. ఈ గజల్ పాడిన కాలంలో అమె బేగంఅఖ్తర్ కాదు. అక్తరీబాయి ఫైజాబాది. అఖ్తరీబాయిగా ఆమె చిరస్మరణీయమైన ఠుమ్రీలు, దాద్రాలు, హూరీలు, కజ్రీలు, చైతీలు అనేకం పాడింది.

లఖ్నోలో మాంచి ప్రాక్టీసుగల సంపన్నుడు బారిస్టర్ ఇస్తేయాఖ్ అబ్బాసితో నికాహ్ జరిగిన తర్వాత ఆమె బేగం అఖ్తర్ అయింది.

బేగం అఖ్తర్ గా అమె ఠుమ్రీ, దాద్రాలు స్వల్పం గానూ, గజళ్ళు అధికం గానూ పాడింది. గజల్ గాయనంలో ఆమె శైలి విశిష్టమైనది.  బేగంఅఖ్తర్ వార్థక్యంలో “ఆయ్ మొహబ్బత్ తెరె అంజాంపె రోనా ఆయా” అనే గజల్ పాడి అశేష రసిక జనానీకాన్ని ఏడిపించింది. ఏడిపించడం అన్నమాట కొందరికి వింతగా తోచవచ్చు.  కానీ మనసున్నవాళ్ళు మనసును కదిలించే మాటవిన్నా, పాటవిన్నా ఏడుస్తారు. అలాంటివాళ్ళను సంగీత పరిభాషలో “దర్దీలు” అంటారు. దర్ద్ కలవాళ్ళు దర్దీలు. అంటే బాధ తెలిసినవాళ్ళు. మనందరం దర్దీలమే… సంగీతసాహిత్య రసికులమైతే.

ఇకడొక ముచ్చట. మహరాజా అఫ్ మెహమూదాబాద్ కుమారుడు మహమ్మద్  అహమ్మద్ హసన్ ఖాన్ వివాహ సందర్భాన రాజాసాహెబ్ దేశంలోని ప్రఖ్యాత గాయనీగాయకులని ఆహ్వానించాడు. అనాటి గాయనీగాయకులు గ్రామఫోన్ కంపెనీ వాళ్ళకూ, రేడియో స్టేషన్ల వాళ్ళకూ ఒక పట్టాన దొరికేవాళ్ళు కారు. కానీ రాజప్రాసాదాల్లో పాడటం ప్రతిష్ఠాకరం అని భావించేవాళ్ళు. ఆనాటి సభలో బాయీ జద్దన్ బాయి (నర్గీస్ తల్లి)  రసూలన్ బాయి లాంటి హేమాహేమీలంతా పాడినారు. తెల్లవారు ఝామున లఖ్నోకుచెందిన బిగ్గన్ బాయి భైరవీ రాగంలో గజల్ పాడింది. ఒక్కొక్క చరణం గుండెకు సూటిగా గుచ్చుకునేది. అందుకు తగిన ఆమె మధుర గాయన శైలి. ఆహూతులైన పెద్దలందరి జేబురుమాళ్ళూ అశ్రువులతో తడిసిపోయినవి.   “తర్ రుమాలోం కీ రాత్” (తడిసిన జేబురుమాళ్ళరాత్రి)”గా ఆరాత్రిని సంగీతరసికులు చాలాకాలం స్మరించుకున్నారు.

సంగీతంలో ఏడిపించే శక్తి ఉందని చెప్పడానికి ఈ ముచ్చట  చెప్పినాను.

ఆ రోజుల్లో అందరికంటే విలువైన కళాకారిణి అఖ్తరీబాయి. ఆమె రూప లావణ్యం, మధురమైన లఖ్నవీ మర్యాద, సంస్కారం వుట్టిపడే చతుర సంభాషణ, అన్నిటికి మించి, ఆమె కంఠం పై సప్తకాలలో ఎక్కడో పగులువారి జీర వోయేది. ఇతరుల విషయాన అది దోషమేకాని, ఆమె విషయంలో అది గొప్పగుణం. ఇవన్నీ అమె విలువను పెంచిన అంశాలు.

“ఆమె స్వర సౌందర్యం అనుభవించి ఆనందించదగిందేగాని వర్ణించడం సాధ్యం కాదు” అంటారు ఆమె అభిమానులు.

పు.ల. దేశపాండే (పురుషోత్తం లక్ష్మన్ దేష్పాండే (8 నవంబర్ 1919 – 12 జూన్ 2000)) సంగీత రసికుడేగాక, చక్కని వచన రచన చేయగలవాడు కనుక “ఆమె స్వరాలు చెవిని సోకినంతనే నడిచేకాళ్ళు నిలిచిపోతాయి. కదిలేచేతులు కట్టుబడుతాయి. మాట్లాడే నోరు మౌనముద్రవహిస్తుంది” అంటాడు. అతనిలాంటి రచయిత కిషన్ సింగ్ చావ్ డా. “అరసికులు సైతం ఆమె స్వరాలు చెవినిపడగానే అడుగు ముందుకు వేయలేరు” అంటాడు.

ఆమె వ్యక్తిత్వం ఎవరికైనా ఆదరణీయమైనది. ఎంతటివాళ్ళు ఎన్నివేలుపోసి పిలిపించినా మర్యాదమీరే సాహసం చెయ్యలేకపోయేవాళ్ళు. అలాంటిప్రయత్నం చేసేవాళ్ళను మృదువుగా మందలించి మర్యాద కాపాడుకునేకళలో ఆరితేరిన కళావతి ఆమె.

హైదరాబాదు నిజాం రెండవకుమారుడు ప్రిన్స్ మొజ్జంజా కళాసాహిత్య పోషకుడు. అతనిదర్బారు కవులతో కళాకారులతో కళకళలాడుతుండేది.  వారం రోజులకోసం అఖ్తరీబాయిని ఆహ్వానించాడు ప్రిన్స్. మొదటిరోజే అక్కడివ్యవహారం ఆమెకు అరుచికరమైంది. మర్నాడు ప్రిన్స్ అనుమతి తీసుకోకుండానే పెట్టేబేడా సర్దుకుని బయటపడింది. ఏడువారాలనగలు, ఏడు విలువైన చీరలూ, వారం రోజులకోసం మాట్లాడుకున్న ప్రతిఫలం తన సెక్రటరీద్వారా నాంపల్లి స్టేషనుకు పంపించినాడట ప్రిన్స్. ప్రిన్స్ దర్బారు విశేషాలను “దర్బారె దుర్బార్” అనే పుస్తకంలో భద్రపరిచిన ప్రముఖకవి సిద్కి జాయెసీ చెప్పిన ముచ్చట ఇది. అవన్నీ ఆమె స్వీకరించిందో తిరస్కరించిందో చెప్పలేదతడు. ఆస్థానాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆ కవి చెప్పదలుచుకున్నది ప్రిన్స్ ఔదార్యాన్ని గురించి కాని అఖ్తరీబాయి ఆత్మాభిమానాన్నిగురించి కాదాయె.

ఆ కాలంలో ఏ శుభకార్యం జరిగినా పేరుగల బాయిజీలను పిలిపించి ముజ్రా చేయించటం సంపన్నుల సంప్రదాయం. అలాగే పంజాబులో  ఒక జమీందారు అఖ్తరీబాయి ముజ్రా ఏర్పాటుచేసినాడు.  అతనింట్లో ఏదో శుభకార్యం. ఆకూతులైన ప్రముఖులు ఆమెపాటకు ముగ్ధులైనారు.  ముజ్రాముగించి సలాం చెయ్యగానే సంప్రదాయం ప్రకారం వేయి విక్టోరియా నాణేలుగల సంచీ బాయీకి సమర్పించబడింది. ఈ సంచిని ఆమె అందుకుని తన సాజిందాల్లో ఎవరికో ఇచ్చివేసింది.

“బాయీజీ! అందులో వేయి విక్టోరియాసిక్కాలున్నవి. మీరు లెక్కించుకోలేదు” అన్నాడు జమీందారు. ఆ దర్పం అసహ్యమైంది ఆమెకు. “హుజూర్” అని రెండుచేతులూ పైకెత్తి “ఈ హస్తభూషణాలే అరవైవేలు పలుకుతాయి. ఇంకా ఒంటిమీద ఎన్ని నగలున్నాయో చిత్తగిస్తున్నారుకదా. నా ఇంటగల నగలవెల ఎన్నివేలో చెప్పలేను. తమ దయవలన డబ్బూదస్కానికి కొరత లేదు. ఇక్కడ ఈ వెయ్యిరూపాయలను లెక్కిస్తూ కూర్చుండే ఓపిక ఎక్కడిది నాకు?” అని వెళ్ళిపోయింది.

అందరితోనూ ఆమెప్రవర్తన అలాగే ఉండేదని కాదు. ‘రసికరాజు’ రామూభయ్యాదాతే తన ఇంటికి వస్తే దేవుడుదిగివచ్చినట్లు సంబరపడిపోయి లఖ్నవీ సంస్కార సహజమైన ఆతిధేయమర్యాదలు నడిపి అతనికిష్టమైన చీజులు వినిపించి పంపేది. రామూభయ్యాదాతే ఇండోర్ నివాసి. అప్పటిప్రభుత్వంలో ఉన్నతోద్యోగి. అతని సంగీత శాస్త్రవైదుష్యం అపారమైంది. ఆనాటి గాయనీగాయకులందరూ అతడు తమపాట వినాలని అభిలషించేవాళ్ళు. ‘రసికరాజు’ అనేబిరుదు ఆనాటి గాయనీగాయకులిచ్చిందే. అతనికి అఖ్తరీబాయి పట్ల ఇంతింతనిచెప్పరాని అభిమానం. తన పాన్ లో వేసుకునే జర్దా గుళికలను “అఖ్తరీ పిల్స్” అనేవాడు. తరచుగా తానభిమానించే గాయకులవెంట సంగీతయాత్రకు బయలుదేరేటప్పుడు ఉపయోగించే అతని కారు పేరు అఖ్తరి.

(Part 2)

సంగీత రసికుడైన కిషన్ సింగ్ చావ్ డా అనుభవం చెప్పుకోదగ్గది.

అతనప్పుడు నీలం నగర్ మహరాజా దగ్గర దీవాన్ గా పనిచేస్తున్నాడు. వైస్రాయ్ ఎక్కడ ఉంటే అతనితో అవసరం ఉన్న స్వదేశీసంస్థానాధీసులు అక్కడ ఉండడం పరిపాటి. కలకత్తాడిసెంబర్ కమనీయమైంది.  కాబట్టి వైస్రాయ్ దర్బారు డిసెంబరు నెలలో కలకత్తా నగరాన జరిగేది. డిసెంబరు 1938. కిషన్ సింగ్ చావ్ డా తన రాజావారి వెంట ఒక భవ్యమైన హోటల్లో బసచేసి వున్నాడు. మహరాజావారు సంగీతప్రియులు. కనుక అవకాశం దొరికినపుడల్లా గాయనీగాయకులను స్మరించుకునేవారు. అక్తరీబాయి అప్పట్లో కలకత్తాలో ఉండేది. నిజమైన కళాకారులు నిజమైన సంగీత రసికులకు ఇచ్చేవిలువ డబ్బుకీయరు. రాజావారి ముందు పాడుతున్నప్పుడు సందర్భశుధ్ధిగాతలూపుతూ శహబాష్ ఇచ్చే చావ్ డాను చాలసార్లు కడగంట గమనించింది. అతడు నిజమైన రసికుడని అర్థం చేసుకుంది.  ఒకనాడు పాటవినిపించి కిందికిపోతూ తనకారుదాకా రావలసిందిగా అతన్ని అభ్యర్థించింది.  కారులోకూర్చుంటూ, “చావ్ డాజీ! ఒకసారి నా యింటిని పావనం చెయ్యండి. మీకు ప్రత్యేకంగా చీజులు వినిపించాలని ఉన్నది” అని మనవి చేసింది. అహో భాగ్యం అనుకున్నాడు   చావ్ డా.

ఒకనాడు ఆమె నివాసభవనానికి వెళ్ళినాడు. సాదరంగా అతన్ని ఆహ్వానించి సాజిందాల (వాద్యకాండ్రు)కు సంజ్ఞ చేసింది. ఆలాపన ఆరంభించబోతుండగా నీలం నగర్ మహారాజావరు వేంచేసినారని క్రిందనుండి వార్త వచ్చింది. తను రాజావారి కంటపడడం చావ్ డా కు సంకట పరిస్థితి. అతని అవస్థ గమనించిన బాయీజీ అతన్ని తన శయనాగారంలోకి పంపి మహారాజావారిని ఆహ్వానించింది.  మళ్ళీ సాజిందాలకు సంజ్ఞ. మళ్ళీ ఆలాపన. అంతలోనే ప్రతాప్ గఢ్ మహారాజావారు వచ్చినారని వార్త. మళ్ళీ చిక్కువచ్చి పడింది.  మహారాజావారుని అదే శయనాగారంలోకి పంపి  ప్రతాప్ గఢ్ మహారాజాను పైకి ఆహ్వానించింది. జరుపవలసిన అతిధిమర్యాదలు జరిపి, అతడుకోరిన చీజులు వినిపించి, ఇచ్చిన పారితోషికం స్వీకరించి కిందికి పంపివేసింది. శయనగృహంలో తేలుకుట్టినదొంగల్లా మౌనంగాకూర్చున్నారు మహారాజా, అతని సెక్రటరీ. వాళ్ళిద్దర్నీ దర్బారు హాల్లోకి తెచ్చి, కూర్చుండబెట్టి తనివిదీరా విలువైన చీజులు వినిపించింది. అది సరస్వతి సన్నిద్గానం. అక్కడరజూ పేదా సమానులే. అభిజ్ఞుడు ఆదరనీయుడు. శ్రోతలిద్దరూ బ్రహ్మానందభరితులైనారు.  దిగి వచ్చేటప్పుడు రాజావారి ఆజ్ఞమేరకు ఐదువందల రూపాయలు అర్పించబోయినాడు  చావ్ డా. ఆమె మర్యాదగా తిరస్కరించింది.  మకారాజు మర్మజ్ఞుడు. మందహాసం చేసి ఊరుకున్నాడు. అంతటితో ఆగలేదు బాయీజీ. “చావ్ డాజీ. మిమ్మల్ని ఇక్కడకి ఆహ్వానించింది స్వీకరించడానికి కాదు.  నివేదించడానికి. మీ ముందు నాస్వల్ప విద్యను ప్రదర్శించి ధన్యురాలనైనాను. సంగీత విద్యలో సామాన్య సాధకుయ్రాలు సంగీత రసికునికి సమర్పించిన చిరు కానుక ఇది” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా శిరసు వంచి సలాం చేసింది.

“రాజాధిరాజులముందు వంగని శిరస్సు  ఒక సామాన్యుడైన రాజోద్యోగి ముందు సవినయంగా వంగింది. వేలకువేలు సమర్పించినా తృప్తిచెందని బాయీజీ విన్నందుకే ధన్యురాలన్నది” అంటాడు చావ్ డా.

సాంప్రదాయికమైన ముస్లిం కుటుంబంలో జన్మించిన అఖ్తరీ బేగం సంగీతం పట్ల ఆసక్తి పెంచుకుని కొన్నాళ్ళు  పట్యాలా ఘరనాకు చెందిన ఉస్తాద్  అతా అహ్మద్ ఖాన్ వద్ద, మరికొన్ని నాళ్ళు కిరాణా ఘరానాకు చెందిన  ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ వద్ద శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించింది. అయినా అమెకు ఠుమ్రీ, దాద్రా, గజల్, భజన్ ల గాయనమే సమ్మతమయింది. ఆ కాలంలో అది బాయీజీల విద్య.  కాబట్టి ఆమె తన కుటుంబానికి దూరమయింది. అఖ్తరీబాయిగా అశేషమైన కీర్తినీ, అపారధనసంపత్తినీ ఆర్జించింది. బారిస్టర్ అబ్బాసీ భార్య అయిన తర్వాత బేగం అఖ్తర్ సమాజంలో గౌరవ స్థానం సంపాదించింది. ఈ సామాజిక గౌరవం వల్ల ఆమె కొన్ని కట్టుబాట్లకు లోనుకావలసి వచ్చింది. బురఖా చాటున ఆమె స్వరాలు మూగవోయినవి. తబ్లా, హార్మోనియం, తంబూరాలు మూల పడ్డవి. పాడటమే జీవితమని భవించిన ఆమె పర్దాచాటుకు వెళ్ళిపోవటం ఆమె అభిమానులకేగాక  ఆమెకు కూడా దుస్సహమయింది. ఆమె తోటి గాయనీగాయకులు ఆమె ఇంటికి వస్తే అబ్బాసీగారు ఆప్యయంగా ఆదరించేవారు. కాని ఆమె అసహాయురాలయి మౌనంగా రోదించేది.  ఎవరిపాటలు విన్నా ఏడుపువచ్చేదామెకు. గజల్ గాయనం లో ఆమెకు సమానురాలు కాకున్నా సన్నిహితురాలైన మలికా పఖ్రాజ్ (Malika Pukhraj)అమెను ఆ స్థితిలో చూసి తానూ ఏడ్చిందట. మలికా పక్రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిందీ మాట.

బారిస్టర్ అబ్బాసీ ఉర్దూ గజళ్ళపట్ల ఉత్తమాభిరుచిగలవాడే. సంగీత ప్రియుడే. కానీ, పరువుగల కుటుంబంలో ప్రవేసించిన తన భార్య పబ్లిగ్గా పాడటాన్ని అనుమతించలేకపోయాడు. సునీల్ బోస్ స్వతహాగా గాయకుడు, సంగీతవేత్త. అతడు లఖ్నో రేడియో స్టేషన్ కు ప్రోగ్రం ప్రొడ్యూసర్ గా నియుక్తుడయ్యాడు. అదృష్టవశాన అతనికి లఖ్నోలో బేగం అఖ్తర్ హవేలీ “అఖ్తర్ మంజిల్” దగ్గర్లోనే ఇల్లు దొరికింది.  అతడామెకు పూర్వ పరిచితుడు. కనుక తరచుగా తన భార్యవెంట అఖ్తర్ మంజిల్ కు వెళ్ళేవాడు. ఆ దంపతులతో సంగీతసాహిత్యాల చర్చచేసేవాడు. సంగీత ప్రసక్తి వచ్చినపుడు బేగం అఖ్తర్ ముఖం మీద కనిపించే నిరాశా నిస్పృహలను గమనిస్తూ, బోసుబాబు ఎలాగైనా ఆమెను లఖ్నో రేడియో నుంచి పాడించాలని నిర్ణయించుకున్నాడు. జస్టిస్ వాల్ఫోర్డ్ విదేశీయుడైనా ఉర్దూ గజళ్ళను, ఉత్తరాది సంగీతాన్ని ప్రేమించేవాడు.  అతనితో కలిసి బోసుబాబు ఎలా అయితేనేమి బారిస్టర్ అబ్బాసీని ఒప్పించి బేగం సాహెబాను రేడియో స్టేషనుకు రప్పించగలిగినాడు. బహుకాలం తర్వాత లఖ్నో రేడియో స్టేషన్ ప్రసారం చేసిన ఆమె గజళ్ళను విని అసంఖ్యాకులైన ఆమె అభిమానులు ఆనందభరితులైనారు.  అబ్బాసీ కూడ దైవదత్తమైన అలాంటి దివ్యస్వరాలను దాచిపెట్టడం అపచారమని గ్రహించినాడు.  ఆనాటినుంచి తానే ఆమెను ప్రోత్సహించినాడు.  ఎక్కడ బేగం అఖ్తర్ ప్రోగ్రాం జరిగినా అక్కడ అబ్బాసీ వుండేవాడు. ఆమె ఛారిటీ ప్రోగ్రాములు చాలా ఇచ్చింది. అహమదాబాదులో 30 అక్టోబరు 1974న అలాంటి  ప్రోగ్రాం ఒకటి ఏర్పాటయింది. అబ్బాసీ వెంట అక్కడికి వెళ్ళిందామె. ఆమె ఆరోగ్య పరిస్థితి గమనించి ఉస్తాద్ అంజాద్ ఆలీఖాన్ “అమ్మీజాన్, మీ ఆరోగ్యం బాగాలేదు. ఈనాడు పాడకుంటేనే మంచిది” అని వేడుకున్నాడు. “బేటా! మాట ఇచ్చినాను. ఇప్పుడెలా తప్పను?” అని పాటకచేరీ ప్రారంభించి  పాట ముగిసిన తర్వాత “చివరి శ్వాస వరకూ పాడుతూనే జీవిస్తాను” అని తరచూ అంటూవుండే బేగం సాహెబా తనమాటను సార్థకం చేసుకున్నది. చివరి శ్వాస అక్కడే విడిచింది.

ఆమె గజల్ గాయన శైలి అతి విశిష్టమైనది.  ఆమె గజల్ పాడేటప్పుడు భావానికి ప్రాధాన్యం ఇచ్చేది. రాగాన్ని గౌణంగా పాటించేది. ఏదో ఒక ప్రసిధ్ధ రాగంలో గజల్ ప్రారంభించి అంతగా రాగాలాపన చెయ్యకుండా, స్పష్టమైన, శుధ్ధమైన ఉచ్ఛారణతో ఒక్కొక్క షేర్ నూ ఆ రాగస్పర్శతో పాడేది. గజల్ పాడేటప్పుడు తన సంగీత పాటవాన్ని ప్రదర్శించేది కాదు. సరిగమలు వెయ్యడం గాని, తాన్ బాజీ చేయటం గాని గజల్ భావ సౌందర్యాన్ని మరుగుపరుస్తాయని తన శిష్యులకు చెప్పేది. తానూ అలాగే పాడేది. కాబట్టే ఎందరో కవులకు ఆమె ప్రతిష్ఠ కలిగించింది. ఆమె గజళ్ళు వింటుంటే శ్రోతలు మధురమైన సంగీతం వింటున్నామన్న అనుభూతిని పొందుతారు. అందమైన గజల్ వింటున్నామన్న ఆనందం పొందుతారు. ఈనాడు ఎందరో గజళ్ళు పాడుతునారు. కొందరికి గొప్ప కీర్తి ప్రతిష్ఠలు కూడా లభించినాయి. కానీ, బేగం అఖ్తర్ స్థాయిని అందుకోవటం ఈ తరంలో ఎవరి తరం కాదు. తాము పాడిన గజళ్ళ క్యాసెట్లు అసంఖ్యాకంగా విడుదల చేస్తున్న  గజల్ గాయకులు  గజల్ ని ఎలా పాడవలెనో గ్రహించటానికి బేగం అఖ్తర్ ను పదేపదే వినాలె.

“భక్తజనులు రామాయణ సప్తాహం జరుపుకున్నట్లు మాకాలంలో మేము బేగం అఖ్తర్ రికార్డుల సప్తాహం జరుపుకునేవాళ్ళం ”  అంటాడు పద్మభూషణ్ పు. ల. దేశ్ పాండే.

బేగం అఖ్తర్ ఉదారం గా విద్యాదానం చేసింది. తన శిష్యుల నోట, శిష్యురాండ్ర నోట “అమ్మీజాన్” అని ప్రేమగా పిలిపించుకునే ఆమె అందరికీ ఎలాంటిప్రతిఫలాపేక్షలేకుండా తన గాయన శైలిని నేర్పింది. శాంతీ హీరానంద్, రీటా గంగూలీ, అంజలీ బెనర్జీ లాంటివాళ్ళు ఆమె శైలిని కొంతవరకు కాపాడుతున్నారు. ఆమె శిష్యురాలి కాకున్నా అచ్చం ఆమెలా పాడే శోభా గుర్టు గజళ్ళు వింటుంటే బేగం అఖ్తర్ ను స్మరించుకోకుండా ఉండలేము.

ఇటీవల ఆమె 25వ వర్థంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం బేగం అఖ్తర్  తపాలాబిళ్ళను విడుదల చేసింది. మొదటి తపాలాబిళ్ళను అమె బాల్య సఖి, ఆమెస్థాయికి  ఇంచుమించు  చేరిన గాయకురాలు మలికా పఖ్రజ్ కు సమర్పించింది. పాకిస్తాన్ లో నివసిస్తున్న మలికా పఖ్రాజ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇది చాలా సముచిత చర్య అని భారత ప్రభుత్వాన్ని సంగీత రసికులు ప్రశంసించినారు.

పెంపుడుపిల్లి స్మృతికి… హోర్షే లూయీ బోర్షెస్ , అర్జెంటీనా కవి

.

నీకున్న నిశ్శబ్దపు ముసుగు అద్దాలకి కూడా ఉండదు

తొలిసంధ్యవేకువకి కూడ నీపాటి రహస్యోదయం లేదు,

వెన్నెల వెలుగులో, మేము దూరం నుండి మాత్రమే

రహస్యంగా కనిపెట్టగలిగిన చిరుతవి నువ్వు.

.

 ఏ దైవేచ్ఛా పరికల్పనో తెలీదుగాని,

మేమెంత వెంటాడినా నిన్ను అందుకోలేము;

భాగీరథి కన్నా, సూర్యాస్తమయంకన్నా సుదూరంగా

నీ ఏకాంతం నీది, నీ రహస్యం నీది.

.

 చెయిజాచి అందించిన నా క్షణమాత్ర లాలనని

నీ వెన్ను అంగీకరించింది; నువ్వు కనికరించావు,

నాటినుండి అనునిత్యం ఈ స్నేహ హస్తం నుండి

ప్రేమ అందుకొందికి. ఇపుడది విస్మృతిలోకి జారుకుంది.

.

ఇపుడు నీ కాలగణనమే వేరు; నీ రాజ్యానికి నువ్వే అధినేతవి –

ఆ లోకం … కలలా భిన్నమైనదీ, చొరరానిదీ.

.

హోర్షే లూయీ బోర్షెస్,

August 24, 1899 – June 14, 1986

అర్జెంటీనా కవి, కథకుడూ, అనువాదకుడూ, వ్యాసకర్తా.

ఇతని రచనలలో ప్రత్యేకత సాహిత్యంలో శూన్యత(మిధ్య).అతని కథలూ, కవితలూ సాహిత్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన  మేజికల్ రియలిజం అన్న ప్రక్రియకి దారితీసేయి. మేజికల్ రియలిజంలో ప్రథానంగా, కాలంతో  నిమిత్తం లేకుండా పాత్రలు వచ్చి పోతుంటాయి. (ప్రముఖ కథకులు మునిపల్లె రాజుగారు ఈ మేజికల్ రియలిజం మనకి కొత్త కాదనీ, ముఖ్యంగా భారతం లోనూ, రామాయణ, భాగవతాదుల్లో కూడ చాలా పాత్రలు ఇలాగే వస్తూ పోతుంటాయని చెబుతూ,ఆయనకూడా కొన్ని మంచికథలు వ్రాసేరు). నిజానికి ఈ మేజికల్ రియలిజం, 19వ శతాబ్దం లో సాహిత్యంలో వచ్చిన నేచురలిజం అన్న ప్రక్రియపై తిరుగుబాటు. ఈతని కథల్లో ఎక్కువగా, కలలూ, అద్దాలూ, జంతువులూ, మతమూ, భగవంతుడూ, తాత్త్విక చింతనా మొదలైనవన్నీ ఉంటాయి.

.

Español: Jorge Luis Borges
Español: Jorge Luis Borges (Photo credit: Wikipedia)

.

To a Cat

.

Mirrors are not more wrapt in silences
 nor the arriving dawn more secretive ;
 you, in the moonlight, are that panther figure
 which we can only spy at from a distance.
 By the mysterious functioning of some
 divine decree, we seek you out in vain ;
 remoter than the Ganges or the sunset,
 yours is the solitude, yours is the secret.
 Your back allows the tentative caress
 my hand extends. And you have condescended,
 since that forever, now oblivion,
 to take love from a flattering human hand.
 you live in other time, lord of your realm –
 a world as closed and separate as dream.

Jorge Luis Borges
(Aug. 24, 1899 – June 14, 1986)
 Argentinian Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2000/04/to-cat-jorge-luis-borges.html

%d bloggers like this: