నెల: అక్టోబర్ 2012
-
సముద్రం … ఆశాలత, మలయాళీ కవయిత్రి
మా అమ్మమ్మ సముద్రం ఎన్నడూ చూసి ఎరగదు కానీ, తను పోయిన తర్వాత ఆమె చితాభస్మాన్ని మాత్రం మూడు సముద్రాల సంగమమంలో కలిపేరు. . ఆ చితాభస్మపు పాత్రలోనుండి తన కబోది కళ్ళతో సముద్రం లోని వింతలు చూస్తున్న ఆమె కూతుళ్ళ శోకాలు విని వెనక్కి తిరిగొచ్చింది . “నాకు సముద్రం చూడాలని లేదు, చూడను, అంతే!” అని, ముమ్మారు వెనక్కి తిరిగొచ్చిన ఆ కలశం ఎలాగైతేనేం, చివరకి,కెరటాలమీద తేలి పో… యిం… ది,… అయిష్టంగానే. .…
-
స్నేహగీతం … టాగోర్
గతించిన మధురక్షణాల జ్ఞాపకాలు ఎన్నడైనా మనస్మృతిపథం వీడగలవా? స్వయంగా అనుభవించినవి; మన జీవనాడి; అవి ఎన్నడు మరువగలం? . మిత్రమా! ఒక సారి మరలిరా! వచ్చి నా జీవితాన్ని పంచుకో. చిరునవ్వులూ, కన్నీళ్ళూకలబోసుకుందాం అదొక తీపిగురుతుగా మిగుల్చుకుందాం . వేకువనే మనిద్దరం కలిసి పూలు కోసేవాళ్ళం ఇద్దరం గంటలకొద్దీ ఉయ్యాలలూగేవాళ్ళం వంతులువారీగా ఇద్దరం వేణువూదుకున్నాం చెట్లనీడన పాటలు పాడుకున్నాం . మధ్యలో ఎప్పుడో విడిపోయాం ఒకరి చిరునామా ఒకరికి తెలియకుండా. మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా నాకెదురైతే వింతగా…
-
సహనశీలియైన సాలీడు… వాల్ట్ వ్హిట్మన్, అమెరికను కవి
. ఒక్కతే, ఏకాంతంగా, చడీ చప్పుడూ లేకుండా ఆ ఏత్తైన గుట్టమీద నుండీ వేలాడుతున్న ఒక సహనశీలియైన సాలీడుని చూశాను; ఆ విశాలమైన పరిసరాల శూన్యపుహద్దులని శోధించడానికి అలుపన్నది ఎరగకుండా తనలోంచి నిరంతరాయంగా ఒక్కొక్కపోగూ, ఒక్కొక్క పోగూ తియ్యడాన్ని గమనించేను. . ఓ మనసా! మేరలులేని శూన్యసాగరాలు చుట్టుముట్టిన నువ్వు అనంతంగా ఆలోచిస్తూ, ఏదోప్రయాసపడుతూ, చేతులెత్తేస్తూ చుక్కల్ని అందుకోవాలనీ, ముడివెయ్యాలనీ ఆరాటపడతావు; కానీ, తీగెసాగిన నీ ఊహలు సేతువు నిర్మించగలిగేదాకా వేసిన బలహీనమైన లంగరులు నిలదొక్కుకునేదాకా నువ్వు…
-
డోవర్ బీచ్ … మాథ్యూ ఆర్నాల్డ్, ఆంగ్ల కవి
ఈ నిశీధిని సాగరం ప్రశాంతంగా ఉంది. కెరటాలు నిండుగా, చందమామ అందంగా కనిపిస్తున్నైజలమార్గాల్లో; ఫ్రాన్సు సముద్రతీరంలో దీపాలు చీకటి-వెలుగులు చిమ్ముతున్నై; ప్రశాంతంగా ఉన్న అఖాతం నుండి చూస్తుంటే ఇంగ్లండువైపు సుద్దకొండల కొనకొమ్ములు కనుచూపుమేరా నిటారుగా, ప్రకాసిస్తూ కనిపిస్తున్నై. . ప్రేయసీ! కిటికీదగ్గరకి రా, వచ్చి చూడు వెన్నెలమలాముచేసిన సైకతశ్రేణులమీద భంగపడిన కెరటాల తెలినురుగులమీదుగా రాత్రిపవనం ఎంత సువాసన మోసుకొస్తోందో! ఒకసారి విను! కెరటాలు లోపలికిలాగి ఒక్కసారి ఒడ్డుకి విసిరికొట్టినప్పుడు గులకరాళ్ళు చేసే హోరుని; వెనక్కి మరలుతున్నప్పుడు అదిగో,…
-
పాపాయి … ఎజ్రా పౌండ్ , అమెరికను- ఇటాలియన్ కవి
ఒక మొలక నా చేతిలో మొలిచింది, దాని సారం నా శరీరంలో ప్రవహించసాగింది. మొక్కై గుండెల్లో పదిలంగా పెరిగింది. అంటుకట్టగానే, నా నుండి శాఖోపశాఖలై విస్తరించింది. . ప్రపంచానికి నువ్వు పసిపాపలా కనిపించవచ్చు గాని, ఓ ముద్దు పాపాయీ! నువ్వెంతో ఉదాత్తమైనదానివి ఒక మహావృక్షానివి నువ్వు తొలి జీవ వాహికవి పిల్లతెమ్మెరను తోడ్కొనివచ్చే నల్లకలువవి. . (Notes: ఎజ్రాపౌండ్ కవితల్లో చాలా సంక్లిష్టమైన కవితే గాక, చాలా విస్తృతంగా, ఎక్కువసార్లు తప్పుగా, వ్యాఖ్యానింపబడిన కవితగా నాకు తోస్తుంది.…
-
నేను నీ ప్రక్కన లేనప్పుడు … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నేను నీ ప్రక్కన లేనప్పుడు ఒంటరినైపోతాను. నువ్వు తప్ప నాకు సాంత్వననివ్వగలిగిన వేరొక వ్యక్తిగాని, వస్తువుగాని లేవు. . నువ్వు వీడగానే ఒక్కసారిగా నాకు నిస్సత్తువ ఆవహిస్తుంది; నా చుట్టూ చీకటి పేరుకుని నాకేమీ మిగలదు. . నేను చాలా వికల్పాలు ప్రయత్నించేను… సంగీతం, పర్యాటనా, ఖగోళ వీక్షణం, సాగరతీరాన కూర్చోడం…ఇలా… కానీ ఏ ఒక్కటీ నీలా నన్ను సేదదీర్చలేకపోయాయి. . తుఫానుకి తలవంచిన గడ్డిపరకలా నా కోరికలజడిలో తడిసిన నా అహం తలవాల్చింది. . ఈ…
-
ద యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ… నెరూడా
(గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రతిరోజూ బయటపడుతున్న స్కాముల పరంపర చూస్తుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, నిర్ణయాధికారంగల అధికారులూ, ఇతర చిల్లర మల్లర ప్రభుత్వోద్యోగులూ పోటీలుపడిమరీ దేశసంపదని కొందరు వ్యక్తులకో, కొన్ని విదేశీసంస్థలకో దఖలుపరచడానికి … ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని, అధికారాన్ని తమకు అందజేసిన రాజ్యాంగంమీద చేసిన ప్రమాణాన్ని బేఖాతరుచేసి, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రాజ్యాంగేతర శక్తులుగా ఎదిగి, న్యాయవ్యవస్థనుకూడా లక్ష్యపెట్టకుండా చేసిన ప్రయత్నాలు పరిశీలిస్తే, గత శతాబ్దపు పూర్వార్థంలో మధ్య అమెరికను దేశాలలోని నియంతృత్వప్రభుత్వాలు ప్రవర్తించిన తీరు నెరూడా…
-
పెద్దక్క ఇంటికి వచ్చినప్పుడు… విష్ణు ప్రసాద్, Malayalam, Indian Poet
(ఈ మధ్యకాలంలో ఇంత అందమైన కవిత నేను చదవలేదు. అందుకే మీతో పంచుకుందామనిపించింది. అమ్మ మీద, నాన్న మీద మంచి కవిత్వం వచ్చింది గాని, అక్కమీద చాలా తక్కువ కవితలు వచ్చాయి. మూలకవిత అవడానికి మళయాళీకవిత అయినా, విషయం మన తెలుగువాళ్ళకి అనుభవంలో లేనిది కాదు. ఒక వంక అక్కని గుర్తుచేసుకుంటూ, మరొక వంక అంతరించిపోయిన “అటు పల్లే… ఇటు పట్టణమూ”కాని నగరాలలోని దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవిత చిత్రణ ఇందులో కనిపిస్తుంది. నాకు విజయనగరంలో మా…
-
Quick Mail Service* … కొండేపూడి నిర్మల
The letter you posted six months back was delivered to me yesterday. Never mind the delay. Compared to the prisoner of Independence struggle Who did not reach home as yet though freed some thirty-nine years ago, it has reached far sooner. Enough if you own a voice to applaud and the courage to denounce. Than the bright…
-
Endless Saga… Praveena Kolli
Sometimes the day, and Sometimes the night I wonder where they carry this nerves from! . As if the land is yeaning, As if the sky were scrimpy these ideas well up to the brim! Even as you drain them out in oodles they ooze up in springs eternally these memories! . How lucky are the cumulonimbus !…