నెల: అక్టోబర్ 2012
-
When It Is Time to Leave …. Mukunda Rama Rao, Indian
Neither you want to leave Nor I want to send you off Not that we are aware that it is an ineluctable choice Helplessly stand you and I. Yet, with a hope like the dawns… and the endless tomorrows… eagerly awaiting that miracle which stops you from leaving. . Y. Mukunda Rama Rao Poet and Translator…
-
పచ్చని చెట్టు నీడలో… షేక్స్పియర్
. పచ్చని చెట్టు నీడలో, నాతోపాటు విశ్రమిద్దామనుకుంటున్నవాళ్ళు; కమ్మని పక్షిపాటకి అనుగుణంగా తమ ఆనందరాగా లాలపిద్దామనుకున్నవాళ్ళు, ఇక్కడకు రండి… రండి… రండి, మీకు విరోధులెవరూ ఉండరు, ఒక్క శీతకాలం, తుఫాను వాతావరణం తప్ప. . ఎవనికైతే అత్యాశ ఉండదో, ఎండలో పనిచెయ్యడం ఇష్టమో, తినేదే కోరుకుంటూ, దొరికినదానితో సంతృప్తి పడగలడో, ఇక్కడకి రండి … రండి … రండి, మీకు విరోధులెవ్వరూ ఉండరు, ఒక్క శీతకాలం, తుఫాను వాతావరణం తప్ప. . షేక్స్పియర్ . Under the…
-
మాట నేర్చిన కోళ్ళు… బెంజమిన్ జెఫానియా, ఇంగ్లీషు కవి
(గమనిక: సారూప్యత, సందర్భం (ఇవి దసరారోజులు కదా), దేశీయతల కోసం, ఇంగ్లీషు టర్కీ కోళ్లని నాటుకోళ్ళుగానూ (అవే ఎక్కువగా బలి అవుతాయని నే ననుకుంటున్నాను), క్రిస్మస్ పండుగను దసరా పండుగగానూ మార్చి వ్రాసేను. తదనుగుణంగా మరికొన్ని మార్పులుకూడా అక్కడక్కడ చెయ్యడం జరిగింది.) . ఈ దసరాకి కోళ్ళతో మంచిగా ప్రవర్తించండి ఎందుకంటే, వాటికి కూడా దసరాసరదాల్లో పాల్గోవాలనుంటుంది. కోళ్ళు చాలా సరసంగా ఉంటాయి, కొన్ని చెడ్డవుండొచ్చు, అయినా, ప్రతి కోడి నోరుమూసుకుని పడి ఉంటుంది కదా! మీ…
-
పల్లెటూరి బడిపంతులు… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఇంగ్లీషు-ఐరిష్ కవి.
(విజయనగరంలో గంటి వెంకటరమణయ్యపంతులనే లెక్కలమేష్టారు MRMP School లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఇంగ్లీషులోకూడ దిట్ట. ఆయన మా గురువుగారు. చాలకాలం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కి సెక్రటరీగా కూడ పనిచేశారు. గురాచారివారి వీధిలో వాళ్ళ ఇల్లు ఉదయాన్నే ఎప్పుడూ పిల్లలతో కళకళలాడుతుండేది. ఈ కవిత చదువుతుంటే నాకు ఆయనే గుర్తువస్తారు. ఈ కవితలో చెప్పిన స్కూలు టీచరుకి ఉన్న చాలా లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా మాటకరుకుగా ఉన్నా మనసు మెత్తదనం, Strict Discipline, లెక్కలలో…
-
కాలం… యదార్థమూ, మిధ్యా … S T కోలరిడ్జ్
చదునుగా విశాలంగా ఉన్న ఆ పర్వతాగ్రం మీద (అదెక్కడో సరిగ్గా తెలీదు గాని, గంధర్వలోకం అయిఉండొచ్చు) ఆస్ట్రిచ్ లా తమ రెండు రెక్కలూ తెరచాపల్లా జాపుకుంటూ ఇద్దరు ముచ్చటైన పిల్లలు ఒక అక్కా, తమ్ముడూ అనంతంగా పోటీపడుతూ పరిగెత్తుతున్నారు . అక్క అతన్ని మెడ్డాయించింది అయినా వెనక్కి తిరిగిచూస్తూ పరిగెడుతోంది ఎప్పుడూ తమ్ముడివంకే చూస్తూ, అతని మాటలు వింటూ ఎందుకంటే, పాపం! అతనికి చూపులేదు. గరుకుతోవైనా, మెత్తని నేల అయినా ఒక్కలాగే అడుగులు వేసుకుంటూ సాగుతున్నాడు. అతనికి…
-
ఆత్మ వంచన … ఏంటోనియో మచాతో, స్పానిష్ కవి
ఒక ప్రకాశవంతమైన రోజున సన్నజాజుల సుగంధాన్ని మోసుకొచ్చి నా ఆత్మని పిల్లగాలి అడిగింది: “నా సన్నజాజుల సుగంధానికి బదులుగా నీ గులాబుల పరిమళాలు ఇస్తావా?” అని . అయ్యో! నా దగ్గర గులాబులు లేవే; నా తోటలోని పూలన్నీ వాడివత్తలైపోయాయి” “సరే! అలాగైతే, ఈ వాడిపోయిన రేకలూ, రాలిన పండుటాకులూ నీ చెలమలలోని నీళ్ళే తీసికెళ్తాను లే.” . చెప్పినట్టుగా గాలి అవి మోసుకుపోయింది. నేను వలవలా ఏడ్చాను. నా ఆత్మతో అన్నా: ఎంతపనిచేశావు? ఎంత నమ్మకంతో…
-
నా శ్రీమతికి (నా కవితల ప్రతితో)… అస్కార్ వైల్డ్.
. ఈ కావ్యానికి తొలిపలుకుగా నేను గొప్ప పీఠిక ఏదీ రాయలేను; కానీ, ఖచ్చితంగా చెప్పగలను ఇది ఒక కవి, కవితకిచ్చే అంకితం అని. . ఈ రాలిన సుమదళాలు నీకు సుందరంగా కనిపించగలిగితే… నీ కురులలో ఒద్దికగా ఒదిగేదాకా నా ప్రేమ గాలిలో తేలియాడుతూనే ఉంటుంది. . ప్రేమరహితమైన ఈ ప్రపంచాన్ని చలిగాలులూ, హేమంతమూ గడ్డకట్టిస్తే అది నీ చెవులలో తోటఊసులు చెబుతుంది అవి, నీకొకతెకే అర్థమవుతాయి. . ఆస్కార్ వైల్డ్. 16 October 1854…
-
ఆల్బట్రాస్… ఛార్లెస్ బోద్ లేర్, ఫ్రెంచి కవి
. అగాధ పారావారాలపై అతినెమ్మదిగా పయనించే సహయాత్రీకులైన ఓడలని అనుసరించే విస్తారమైన ఈ నీటి పక్షులు, ఆల్బట్రాస్ లని, తరచు ఎరవేసి పట్టుకోవడం నావికులకొక క్రీడ . పట్టుకుని ఓడ బల్లమీద పడవెయ్యడమే ఆలస్యం ఇంతటి గగనాధీశులూ, కలవరపడి, లజ్జాకరంగా పాపం, దీనాతిదీనంగా,విశాలమైన తమతెల్లని రెక్కలని తెడ్లువేసినట్టు రెండువైపులా ఈడ్చుకుంటూ పోతాయి . ఈ రెక్కలరౌతు ఎంతలో నేర్పుతప్పి, బలహీనుడైనాడు! ఇంత అందగాడూ, క్షణంలో ఎంత సొగసుతప్పి, హాస్యాస్పదుడైనాడు. తన ముక్కులో పొగాకుగొట్టాన్ని దోపి హింసిస్తున్నాడు ఒకడు…
-
The Cow … విష్ణు ప్రసాద్, Malayalam, Indian Poet
. కనీసం ఒక్క రోజుకైనా బంధనాలు విదిల్చుకుని పారిపోకపోతే మనం స్వేఛ్ఛాకాముకులం కాదని పొరపడే అవకాశం ఉంది… అందుకనే నేమో మా మేనత్త పెంచుకునే కర్రావు కొబ్బరిపీచు పలుపు తెంచుకుని అప్పుడప్పుడు పారిపోతుంటుంది . ముందు కర్రావూ, వెనక మా అత్తా పరిగెడుతుంటే, చూడాలీ! ఎదురొచ్చినదేదైనా రెండుముక్కలయిపోతుందేమోనని అందరూ పక్కకి ఒక్కటే పరుగుతీస్తారు. “బాబాయ్ దాన్ని పట్టుకో! ఒరే అబ్బాయ్ దాన్ని ఒకసారి అందుకో” అంటూ మా అత్త కేకలేస్తుంటుంది. అసలు సంగతేమిటో అర్థమయేలోగా అత్తా ఆవూ…