అద్దం.. Spike Milligan, English-Irish Poet

ఆమని మొలక లాంటి లేతపిల్ల

ఆనందంతో తనకురులు దువ్వుకుంటోంది.

అద్దం  “నువ్వు చాలా అందవికారంగా ఉన్నావు,” అంది.

అయితేనేం,

ఆమె పెదవులమీద గువ్వలాంటి రహస్యపు

చిరుదరహాస సౌందర్యం నాట్యం చేస్తోంది…

ఎందుకంటే,

పొద్దున్నే ఆ అంధబాలుడు

“నువ్వు చాలా అందంగా ఉన్నావు” అని అనలేదూ?

.

స్పైక్ మిలిగన్,

ఇంగ్లీషు-ఐరిష్ కవీ, రచయితా, సంగీతకారుడూ, నటుడూ, నాటకకర్తా.

ఈ కవితలోని సౌందర్యం:

యవ్వనప్రాదుర్భావంలో అందరికీ తెలియకుండానే ప్రేమభావనలు అంకురిస్తాయి. అవి అందచందాలతో నిమిత్తం లేనివి. నిజానికి అందం చూసేవాళ్ల కళ్ళనుబట్టి ఉంటుందని కదా ఆర్యోక్తి. ఇక్కడ వయసులోకి అడుగుపెడుతున్న ముగ్ధ ఉంది. ఆమెని ఒక యువకుడు, అంధుడైనా సరే, అందంగా ఉన్నావని మెచ్చుకున్నాడు. ఆ తీపి భావన పిల్ల మనసులో మెదలాడుతోంది. అదికూడ తనకొక్కతెకే తప్ప ఎవరికీ తెలియని గువ్వలాటి రహస్యం. ఆ స్థితిలో ప్రపంచం మనగురించి ఏమనుకున్నా లక్ష్యం చెయ్యని ధైర్యం వస్తుంది. ఆటువంటి మనః స్థితిని చాలా చక్కగా ఆవిష్కరించేడు కవి. 

“Joyous Hair” is called transferred epithet…

.

For further reading on Milligan: http://en.wikipedia.org/wiki/Spike_Milligan

180

Spike Milligan

Photo Credit: Wikipedia

.

Mirror, Mirror

 A young spring-tender girl
 combed her joyous hair
 'You are very ugly' said the mirror.
 But,
 on her lips hung
 a smile of dove-secret loveliness,
 for only that morning had not
 the blind boy said,
 'You are beautiful'?

Spike Milligan

16 April 1918 – 27 February 2002

Comedian, Writer, Musician, Poet, Playwright, Soldier and actor of English and Irish parentage.

Kamalika Choudhury, a guest,  added the following remark while recommending the poem on the blog referred below:

“Milligan’s touch has a salt-of-the-earth quality to it that makes it  immediately credible. He does not disguise the young girl’s objective  ugliness in mirror-image, just as he manages to completely convey her  new-found beauty from within. And what a master wordsmith he was! I can’t  imagine a better way to say so much in a single line than: ‘on her lips  hung/ a smile of dove-secret loveliness’…. 

Kamalika Choudhury .”

One can’t disagree with her.

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2005/03/mirror-mirror-spike-milligan.html.

“అద్దం.. Spike Milligan, English-Irish Poet” కి 4 స్పందనలు

 1. సర్! చాలా చాలా బావుంది. ధన్యవాదములు.

  మెచ్చుకోండి

 2. వనజగారూ,

  ఈ కవిత, చదవగానే నన్ను ఎంత ముగ్ధుణ్ణి చేసిందో చెప్పలేను. నిజంగా “smile of Dove-secret loveliness ” అన్న మాటలు తలుచుకుంటుంటే ‘దొంగరాముడు సినిమా ‘లో సావిత్రి నటనలా, కళ్ళకుకట్టినట్టు ఒక అందమైన భావన మనసులో మెదిలింది. ఇంత సుకుమారమైన భావనలు మనవాళ్ళెందుకో రాయలేకపోతున్నారు.

  మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

  అభివాదములతో

  మెచ్చుకోండి

  1. Thank you Thanooj garu.

   There are many poems with mirror as subject. Each has its own beauty.

   with best regards

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: