.
ఈ భౌతిక ప్రపంచం విలువిచ్చే వేవీ
ఆత్మ సత్యశోధన ముందు నిలబడవు.
.
నువ్వు నీ నీడని ఇష్టపడుతున్నావు,
బదులుగా, తిన్నగా సూర్యుడిని చూడు.
.
మనం ఒకరొకరు ఆక్రమించే
స్థల-కాలాకృతులు చూసుకొని ఏం తెలుసుకుంటాం?
.
రాత్రల్లా సగం మెలకువగా ఉన్నవాడు
రాబోయే ఉపద్రవాలు ఊహించుకుంటాడు.
వేగుచుక్క పొడుస్తుంది;
ఆకాసపుటంచులు కనిపించడం మొదలౌతుంది.
బిడారులో యాత్రికులు స్నేహాలు చేసుకుంటారు.
.
రాత్రి తిరిగే పక్షులకి
పగలు రాత్రిగా అనిపిస్తుంది,
కారణం, వాటికదే తెలుసు గనుక.
చీకటి భయ, కుతూహలములు
ఎంతమాత్రమూ రేకెత్తించని పక్షి అదృష్టవంతురాలు…
నిత్యం ఆనందంతో ఉండేవారిని “షాం తబ్రిజీ” అంటాము.
.
రూమీ
పెర్షియన్ కవి
( Note:
బిడారు: జంతువులపై ప్రయాణించే యాత్రికుల లేదా వర్తకుల సమూహం.
వేగుచుక్క: శుక్రగ్రహం. ఇది సాధారణంగా డిశంబరునెలలో తూర్పు దిక్కున కనిపిస్తుంటుంది. అది కనిపించిందంటే, ఇక సూర్యోదయం అవబోతున్నదని లెక్క.
షాం తబ్రిజీ: రూమీకి జ్ఞానోపదేశం చేసిన గురువు.
ఈ కవితలో సౌందర్యం …రాత్రి చరించే పక్షులకి పగలు చీకటిగా కనిపించడం. అందుకే గుడ్లగూబలకి “దివాంధములు” అంటారు. అది స్వభావోక్తి అయినా, ఇక్కడ చేసిన మానసికవిశ్లేషణ చాలా పదునైనది. మనకి ఉండే Mental Blocks ని చాలా చక్కగా చెబుతోంది. (Remember Rumi was a 13th century Poet, Philosopher and Sufi Mystic).

.
Not Intrigued With Evening
.
What the material world values
doesnot shine the same in the truth of the soul.
You have been interested in your shadow.
Look instead directly at the sun.
What can we know by just watching
the time-and-space shapes of each other?
Someone half awake in the night
sees imaginary dangers;
the morning star rises;
the horizon grows defined;
people become friends in a moving caravan.
Night birds may think
daybreak a kind of darkness,
because that’s all they know.
It’s a fortunate bird
who’s not intrigued with evening,
who flies in the sun we call Shams.
.
Rumi
.
(From Soul of Rumi
English Translation by Coleman Barks)
Related articles
- Renowned Poet & Rumi Expert Coleman Barks Offers Seminal Translation of Persian Literature Masterpiece – RUMI: THE BIG RED BOOK (prweb.com)
- Guest Post: The Shrine Of The Mevlana (spiritualworldtravelerblog.com)
- The global Sufi (thehindu.com)
- New Zealand: Graeme Revell: Rumi’s Don’t Go Back To Sleep (Sufi Poem) (jobblog2011.wordpress.com)
- Thought of the Day 9.30.12 Jalal ad-Din Rumi (ritalovestowrite.com)
స్పందించండి