అనువాదలహరి

ఆశా చికెన్ స్టాల్… అభిరామి, బాలకవయిత్రి, మలయాళం.

‘ఆశా చికెన్ స్టాల్ ‘ అని

ఒక మాంసం కొట్టు

మా బడి వెనకాతలే ఉంది.

.

సాయంత్రం బడివదలగానే

ఆకలితో మండే కడుపు

తడారిపోయిన నాలుకతో

ఎదురుచూస్తుంటే

నోరూరిస్తూ

మా మనసులో గోడలకి వేలాడుతుండేవి

ఒక్కొక్కటీ

.

ఒకరోజు “నిమ్మ తొనలు” తింటూ

7వ క్లాసు, సి సెక్షను

చివరిబెంచిమీద కూర్చునే కుర్రాడు జీవన్ ని

సోషల్ టీచరు

ఆశా చికెన్ స్టాల్ వైపు తీసికెళ్లడం

మేం చూసేం.

.

ఆ మాంసం కొట్టుమీద

కొత్తగా తోలుతీసి వేలాడదీసిన మాంసం

అది అయిపొయేదాకా

మాకు రోజూ టాటా చెపుతుండేది.

.

[Note: “నిమ్మ తొనలు”: నిమ్మరుచీ, వాసనా వేసే పంచదారతో చేసే బిళ్ళలు.నా చిన్నతనం లో స్కూలుకి దగ్గరగా ఉన్న ప్రతి కిళ్ళీబడ్డీలోనూ దొరుకుతూ దిగువ మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో ఉండేవి. ]

.

 అభిరామి,

బాలకవయిత్రి, మలయాళం

అపురూపమైన ఈ కవిత గురించి, దాని సౌందర్యం గురించి, అంత పిన్న వయసులో ఆ పిల్ల కవిత్వంలో చూపిన పరిణతి గురించీ ఎంతచెప్పినా తక్కువే. ఇది మీరందరూ చదివి ఆనందిస్తారని మీతో పంచుకుంటున్నా. భీభత్సరసప్రధానమైన కవిత, ఎన్నుకున్న ప్రతీక గుండెలో గుబులుపుట్టిస్తుంటే, తలపండినవాళ్ళకు కూడా ఒకంతట సాధ్యంకాని మాటల పొదుపుతో రసావిష్కరణ ఈ చిన్నారి సాధించింది. 

 

 

       Abhirami

                                                      Image Courtesy: poetrans.wordpress.co.

 

The chicken stall called ‘hope’

.

The chicken stall called ‘hope’

is behind our school.

 

As the sun goes gray

the dry tongue awaits

with starving stomach.

Then, it slings on the minds wall

entwined onto delicious cords:

each ones. .

.

One day while munching lemon sweets

we watched

our social studies teacher

taking  Jeevan, the boy who sits

in the last bench in 7th – C, to ’Hope’.

.

The uncooked meat hanging there

kept bidding us adieu

till it disappeared from sight.

.

 

Malayalam Original:  Abhirami

 

English Translation: Fazal Rahman

%d bloggers like this: