అనువాదలహరి

ఆత్మ వంచన … ఏంటోనియో మచాతో, స్పానిష్ కవి

ఒక ప్రకాశవంతమైన రోజున

సన్నజాజుల సుగంధాన్ని మోసుకొచ్చి

నా ఆత్మని పిల్లగాలి అడిగింది:

“నా సన్నజాజుల సుగంధానికి బదులుగా

నీ గులాబుల పరిమళాలు ఇస్తావా?”  అని

.

అయ్యో! నా దగ్గర గులాబులు లేవే;

నా తోటలోని పూలన్నీ వాడివత్తలైపోయాయి”

“సరే! అలాగైతే, ఈ వాడిపోయిన రేకలూ,

రాలిన పండుటాకులూ

నీ చెలమలలోని నీళ్ళే తీసికెళ్తాను లే.”

.

చెప్పినట్టుగా గాలి  అవి మోసుకుపోయింది.

నేను వలవలా ఏడ్చాను.

నా ఆత్మతో అన్నా: ఎంతపనిచేశావు?

ఎంత నమ్మకంతో ఈ తోట నీకు అధీనం చేశాను?”

.

ఏంటోనియో మచాతో

26 July 1875 – 22 February 1939

స్పానిష్ కవి, ‘జెనరేషన్ ఆఫ్ 98’ (A group of poets, novelists, philosophers who were active during Spanish-American war

of 1898) గా పిలవబడే స్పానిష్ సాహిత్య ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖుల్లో ఒకరు.

Antonio MACHADO
Antonio MACHADO (Photo credit: Wikipedia)

.

The wind, one brilliant day

.

The wind, one brilliant day,

called to my soul with an odor of jasmine.

“In return for the odor of my jasmine,

I’d like all the odor of your roses.”

.

“I have no roses; all the flowers

in my garden are dead.”

“Well then, I’ll take the withered petals

and the yellow leaves and the waters of the fountain.”

.

The wind left. And I wept. And I said to myself:

“What have you done

with the garden that was entrusted to you?”

.

Spanish Original: Antonio Machado

English Translation :  Robert Bly

%d bloggers like this: