అనువాదలహరి

సముద్రం … ఆశాలత, మలయాళీ కవయిత్రి

మా అమ్మమ్మ సముద్రం ఎన్నడూ చూసి ఎరగదు

కానీ, తను పోయిన తర్వాత

ఆమె చితాభస్మాన్ని మాత్రం

మూడు సముద్రాల సంగమమంలో కలిపేరు.

.

ఆ చితాభస్మపు పాత్రలోనుండి

తన కబోది కళ్ళతో

సముద్రం లోని వింతలు చూస్తున్న ఆమె

కూతుళ్ళ శోకాలు విని వెనక్కి తిరిగొచ్చింది

.

“నాకు సముద్రం చూడాలని లేదు, చూడను, అంతే!”

అని, ముమ్మారు వెనక్కి తిరిగొచ్చిన ఆ కలశం

ఎలాగైతేనేం, చివరకి,కెరటాలమీద తేలి పో… యిం… ది,… అయిష్టంగానే.

.

ఆశాలత,

మలయాళీ కవయిత్రి

.

      Ashalata

                              Image Courtesy: http://poetrans.wordpress.com/2012/10/11/the-sea/

Ashalata is  a Ph.D. in English and is working in the Mahatma Gandhi  University .

.

The Sea

Grandma had never seen the sea
But when she passed on,
Her ashes were scattered
At the confluence of seas.

While viewing the sights of the sea
Through her sightless eyes,
From inside the ash-bearing urn,
The wails of her girls draw grandma back

The urn, which thrice came back,
Saying ‘ I don’t wish to see the sea, no!’
Finally goes back to the waves, reluctantly

.

Malayalam Original: Ashalata

English Translation: Anitha Varma

%d bloggers like this: