అనువాదలహరి

డోవర్ బీచ్ … మాథ్యూ ఆర్నాల్డ్, ఆంగ్ల కవి

English: The beach at Dover
English: The beach at Dover (Photo credit: Wikipedia)

ఈ నిశీధిని సాగరం ప్రశాంతంగా ఉంది.

కెరటాలు నిండుగా, చందమామ అందంగా

కనిపిస్తున్నైజలమార్గాల్లో; ఫ్రాన్సు సముద్రతీరంలో

దీపాలు చీకటి-వెలుగులు చిమ్ముతున్నై;

ప్రశాంతంగా ఉన్న అఖాతం నుండి చూస్తుంటే

ఇంగ్లండువైపు సుద్దకొండల కొనకొమ్ములు

కనుచూపుమేరా నిటారుగా, ప్రకాసిస్తూ కనిపిస్తున్నై.

.

ప్రేయసీ! కిటికీదగ్గరకి రా, వచ్చి చూడు

వెన్నెలమలాముచేసిన సైకతశ్రేణులమీద

భంగపడిన కెరటాల తెలినురుగులమీదుగా

రాత్రిపవనం ఎంత సువాసన మోసుకొస్తోందో!

ఒకసారి విను! కెరటాలు లోపలికిలాగి

ఒక్కసారి ఒడ్డుకి విసిరికొట్టినప్పుడు

గులకరాళ్ళు చేసే హోరుని;

వెనక్కి మరలుతున్నప్పుడు అదిగో, ఆ దూరపుటొడ్దునే

ముందుకీ వెనక్కీ ఆగుతూ కదుల్తూ,

అవి వణుకుతున్న స్వరంతో

దుఃఖం శాశ్వతమని తత్త్వాలు వినిపిస్తున్నాయి.

.

బహుశా, సోఫోకిల్స్ కూడా

ఈజియన్ సముద్రకెరటాల లయలో

పూర్వం ఇది వినే ఉంటాడు

అందుకే అతని మనసులో

ఆటుపోటులుగా నర్తించే

వ్యధార్తకలుషిత మానవ జీవితం హత్తుకుంది;

అందుకే ఇంతదూరాన ఉత్తరతీరంలో

మనం దానిప్రతిధ్వనులు వినగలుగుతున్నాం.

.

ఒకప్పుడు, సముద్రమంత విశ్వాసం

ప్రపంచమంతటా నిండుగా, మనుషుల్ని

గట్టిగాబిగించిన నడికట్టులా, కప్పి ఉండేది.

కాని ఇప్పుడు  సడలుతున్న దాని

సుదీర్ఘరోదనలు వినిపిస్తున్నై…

పొడిబారిన ఇసుకతిన్నెలమీద తేలివస్తూ

రాత్రిపూట గాలిచేసే నిట్టూర్పుల వ్యధలా .

.

ఓ, ప్రియతమా! మనం మాత్రం

ఒకరిపై ఒకరి విశ్వాసాన్ని సడలనీవద్దు.

ఎందుకంటే, మనకళ్ళముందు కలలతీరంలా,

కొత్తగా, అందంగా, చిత్రవిచిత్రంగా కనిపిస్తున్నఈ ప్రపంచంలో

నిజమైన ఆనందంగాని, ప్రేమగాని, వెలుగుగాని,

నమ్మకంగాని, శాంతిగాని, బాధలో చేయూతగాని లేవు;

పోరాడాలో, పరిగెత్తాలో తెలియని సందిగ్ధ సూచనల నడుమ

మనం ఇప్పుడు నమ్మకంలేని నేలమీద నిలుచున్నాం…

చీకటిలో పోరాడే తెలివితక్కువ సేనల్లా.

.

మాథ్యూ ఆర్నాల్డ్.

24 December 1822 – 15 April 1888

ఆంగ్ల కవి  

Mathew Arnold
Image Courtesy: Project Gutenberg

.

Dover Beach

.

The sea is calm tonight.

The tide is full, the moon lies fair

Upon the straits; on the French coast the light

Gleams and is gone; the cliffs of England stand,

Glimmering and vast, out in the tranquil bay.

Come to the window, sweet is the night-air!

Only, from the long line of spray

Where the sea meets the moon-blanched land,

Listen! you hear the grating roar

Of pebbles which the waves draw back, and fling,

At their return, up the high strand,

Begin, and cease, and then again begin,

With tremulous cadence slow, and bring

The eternal note of sadness in.

Sophocles long ago

Heard it on the Ægean, and it brought

Into his mind the turbid ebb and flow

Of human misery; we

Find also in the sound a thought,

Hearing it by this distant northern sea.

The Sea of Faith

Was once, too, at the full, and round earth’s shore

Lay like the folds of a bright girdle furled.

But now I only hear

Its melancholy, long, withdrawing roar,

Retreating, to the breath

Of the night-wind, down the vast edges drear

And naked shingles of the world.

Ah, love, let us be true

To one another! for the world, which seems

To lie before us like a land of dreams,

So various, so beautiful, so new,

Hath really neither joy, nor love, nor light,

Nor certitude, nor peace, nor help for pain;

And we are here as on a darkling plain

Swept with confused alarms of struggle and flight,

Where ignorant armies clash by night.

.

Mathew Arnold

(1822-1888)

English Poet.

The setting of the poem was in 1851 when the newly married Arnold visited Dover  on the Southeastern coast of England with his young bride Frances Lucy Wightman and from where the French coastal city Calais is visible and the distance between England France was shortest.

More important is the tone of the poem  which also represents the conflict of faith between science (triggered by the Evolutionary Theory of English physician Erasmus Darwin and the French Naturalist Jean Baptiste Lamarck) and religion.  Arnold had great faith in Christianity. The gradual decadence of faith in religion and people getting more materialistic by the day had grieved him.

%d bloggers like this: