మోడువారిన నారింజ … గార్సియా లోర్కా, స్పానిష్ కవి

ఓ కట్టెలుకొట్టేవాడా!

నా నీడని నా నుండి వేరు చెయ్యి.

ఒక్కపండూ లేకుండా ఉన్న నన్ను,

నేను చూడవలసిన దౌర్భాగ్యం నుండి తప్పించు.

.

నేనెందుకీ ఈ అందమైన చెట్లమధ్య పుట్టాలి?

పొద్దు నాచుట్టూ వృత్తంలా తిరుగుతుంటుంది,

నక్షత్ర మండలాలను అలంకరించుకుని రాత్రి

నన్ననుకరిస్తుంటుంది.

.

నా నీడచూసుకుని నేను బ్రతకలేను.

ఇకనుండి చీమలనీ, ఆకు ఎరువునీ కలగంటూ,

ఆ నిద్రలోనే

చివుర్లు తొడిగి పక్షినై పోతాను.

.

ఓ కట్టెలుకొట్టేవాడా!

నా నీడని నానుండి వేరు చెయ్యి.

ఒకపండూలేకుండా ఉన్న నన్ను

నేను చూడవలసిన దౌర్భాగ్యం నుండి తప్పించు.

.

గార్సియా లోర్కా

స్పానిష్ కవి

(ఈ కవిత చదువుతుంటే, పింగళి-కాటూరి గారల ఈ క్రింది పద్యం గుర్తొస్తుంది:

ఉ.|| కాలవశమ్మునన్ విసరుగాడ్పులకున్ ముదురాకుపుట్టముల్

       రాలగ, బాటసారుల పరామరిశింపగలేక సంపదల్

       దూలిన దాతవోలె జిగిదూలిన ఆ యెలమావిగున్న, యా

       కాలవశమ్ముచేతనె సఖా! వికసించెడి సౌరుగంటివే!

కాకపోతే ఈ  పద్యంలో మామిడి చెట్టు వసంతాగమనంతో మళ్ళీ వికసించడం గురించి చెబితే,  లోర్కా మోడువారిన నారింజచెట్టు కలలోనే  వికసించడం గురించి చెబుతున్నాడు.  ఒకటి ఆశావాదాన్ని సూచిస్తే, రెండవది  నిరాశావాదాన్ని సూచిస్తోంది.)

Español: Federico García Lorca en 1914. Foto a...
Español: Federico García Lorca en 1914. (Photo credit: Wikipedia)

.

Song of the Barren Orange Tree
.

Woodcutter.

Cut out my shadow.

Free me from the torture

of seeing myself fruitless.

Why was I born among mirrors?

The daylight revolves around me.

And the night herself repeats me

in all her constellations.

I want to live not seeing self.

I shall dream the husks and insects

change inside my dreaming

into my birds and foliage.

Woodcutter.

Cut out my shadow.

Free me from the torture

of seeing myself fruitless

 .

By Federico García Lorca

1898–1936

Translated By A S Kline

(Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Spanish/Lorca.htm#_Toc485030379)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: