అనువాదలహరి

ప్రేమ… విస్టెన్ హ్యూ ఆడెన్, అమెరికను కవి

తలెత్తి నింగిలోని చుక్కలని చూసినపుడు, 

పాపం, అవి అంతగా పట్టించుకుంటున్నా,

చివరకి  నేనెందుకూ పనికిరాకుండా పోవచ్చు.

అదే నేలమీదైతే, మనిషైనా, మృగమైనా

అవి మనఊసెత్తకపోతే,అసలు వెరవనక్కరలేదు.   

.

పాపం తారలు మనమీద ప్రేమతో రగిలిపోతుంటే

మనం తగినరీతిలో స్పందిచకపోతే ఎలా ఉంటుంది?

ఎవరూ సమానంగా ప్రేమించలేరనుకున్నప్పుడు,

ఇద్దరిలో ఎక్కువ ప్రేమించేది నేననవుతా.

.

మనం వాటిని గుర్తించేమో లేదో

ఖాతరుచెయ్యని నక్షత్రాలంటే ఇష్టమయిన నాకు,

అవి ఇప్పుడు కనిపిస్తున్నా,

పగలల్లా వాటిని చూడలేకపోయానన్న చింత లేదు.

.

అసలు నక్షత్రాలన్నీ అంతరించడమో, మాయమవడమో జరిగితే,

నేను శూన్య మైన ఆకాశాన్ని చూడడం నేర్చుకోవాలి.

దాని మహత్తరమైన నిశా సౌందర్యాన్ని,

కొంత సమయం పట్టినప్పటికీ, ఊహించుకోగలగాలి .

.

విస్టెన్ హ్యూ ఆడెన్

(21 February 1907 – 29 September 1973)

(ఇది ఒక రకంగా సంక్లిష్టమైన కవిత. దాని శిల్పం అలాంటిది. కవి చెబుతున్నది లేదా పరోక్షంగా నిరసిస్తున్నది మనకున్న కొన్ని మూఢనమ్మకాలనీ, వెలిబుచ్చుతున్నది మానవ జాతి మనుగడ శాశ్వతంగా ఉండాలన్న కోరికనీ.

ఇక్కడ “నేను” అన్నది విశ్వమానవుడికి పర్యాయపదం.

మనమీద నక్షత్రాలు ఎంతప్రభావం చూపించినా మనం ఎందుకూ కొరగాకుండా పోవచ్చు… అన్నది రెండింటికీ ఏమీ సంబంధం లేదని సూచించడానికి. కానీ, మనం నక్షత్రాలవల్ల ప్రేరణపొందుతాం. అవి మనల్నిప్రేమించకపోయినా, మనం వాటిని ప్రేమిస్తాం అన్న భావన అదే. ప్రేమలో తేడాని చెబుతున్న రెండు మూడు  చరణాలభావం  అదే. అసలు కవితలోని మలుపు 4 వ చరణం లో ఉంది. నక్షత్రాలు అంతరించడం జరగదు. కానీ, నక్షత్రాలు లేని (అంతరించిపోయినా, మాయమైనా) చీకటిరాత్రి మనిషి వినీఎలాకాశపు నిశాసౌందర్యం  వీక్షించాలంటే, నక్షత్రాలు సమసిపోయినా మనిషి మిగిలి ఉండాలి కదా. ఆ మనిషే సవ్యంగా లేకపోతే, నక్షత్రాలు ఎంత ప్రభావం చూపించినా, ఎందుకూ కొరగాకుండాపోతాడని మొదట చెప్పిన భావానికి లంకె.)

English: W. H. Auden Category:W.H. Auden
English: W. H. Auden Category:W.H. Auden (Photo credit: Wikipedia)

.

The More Loving One

Looking up at the stars, I know quite well
That, for all they care, I can go to hell,
But on earth indifference is the least
We have to dread from man or beast.

How should we like it were stars to burn
With a passion for us we could not return?
If equal affection cannot be,
Let the more loving one be me.

Admirer as I think I am
Of stars that do not give a damn,
I cannot, now I see them, say
I missed one terribly all day.

Were all stars to disappear or die,
I should learn to look at an empty sky
And feel its total dark sublime,
Though this might take me a little time.

— W H Auden

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: