నన్నెంతగా ప్రేమిస్తున్నావు? … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు ఇవాళ? ఒక మిలియను బుషెల్స్ ఉంటుందా?
అంతకంటే ఎక్కువా? నిజంగా, అంతకంటే చాలా ఎక్కువ?
.
బహుశా, రేపు బుషెల్ లో సగం అయిపోతుందేమో?
లేక, బుషెల్ లో సగం కంటే కూడ తక్కువో.
.
ఇదేనా ప్రేమంటే నీ హృదయగణితం?
అచ్చం ఇలాగే, గాలికూడ, వాతావరణాన్ని కొలుస్తుంటుంది.
.
కార్ల్ సాండ్ బర్గ్
(January 6, 1878 – July 22, 1967)
అమెరికను కవి
(గాలికి ఎంత నిలకడ ఉండదో, కొందరి ప్రేమ కూడ అంత నిలకడలేనిదే అన్న భావాన్ని చెబుతోంది ఈ కవిత. నిజానికి ఇందులో ప్రేమ అన్న పదం వాడినా, అవతలివ్యక్తి దేనిని ప్రేమగా పొరబడుతున్నారో దాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపిస్తోంది ఈ కవిత. )

.
How Much?
.
How much do you love me, a million bushels?
Oh, a lot more than that, Oh, a lot more.
And to-morrow maybe only half a bushel?
To-morrow maybe not even a half a bushel.
And is this your heart arithmetic?
This is the way the wind measures the weather.
Carl Sandburg
(January 6, 1878 – July 22, 1967)
American Poet
(Note: strictly speaking, Bushel is a unit of dry volume measure of about 8 Gallons … or, equivalent to the volume of a cylinder with 18.5 inches diameter and 8 inches height. Here it is used not in that sense, but only as a rhetoric.)
(Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/21436)