ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ
చూడని వదనమూ, వినని స్వరమూ,
నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ
నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి
.
ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో
ఖండాలూ, సముద్రాలూ దాటి,
కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి,
తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల…
.
ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో,
కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా;
పచ్చగా పెరిగిన పచ్చికమీద
ఈ సంవత్సరాంతపు చివరి ఆకులు రాలుతూ…
.
క్రిస్టినా రోజెటి
(5 December 1830 – 29 December 1894)
ఆంగ్ల కవయిత్రి
Pre-Raphaelite Brotherhood (PRB)లో ఒకరిగా అధికారికంగా పరిగణించబడకపోయినా, క్రిస్టినా రొజెటి, అందులో ప్రముఖ సభ్యురాలే. ఒక రకంగా ఆమె విక్టోరియన్ యుగపు మధ్యతరగతి స్త్రీలకు ప్రతినిధి. 19వ శతాబ్దంలో విజ్ఞాన శస్త్రం అందుబాటులోకి తెచ్చిన రైలు ఇంజను, స్టీమరూ, ఎలక్ట్రిక్ బల్బు లవల్ల, సాంఘికంగా, ఆర్థికంగా ప్రజలజీవితాలలో పెనుమార్పులు వచ్చేయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో. అప్పట్లో ఉద్యోగాలు చేసి, డబ్బు సంపాదించే స్త్రీలకు, స్త్రీలుగా గుర్తింపు ఉండేది కాదు. ఇంటిపనులు చూసుకుని పిల్లల్నికనే వాళ్ళకి మాత్రమే ఆ గౌరవం దక్కేది. కాని, ఇతరమార్పులతో పాటు, మధ్యతరగతి యువతులకు ఆర్థిక స్వాతంత్ర్యం పై అభిలాష పెరిగింది. వాళ్ళిపుడు ఒంటరిగ ఉండడానికి వెనుకాడటం లేదు. స్కూలు టీచరుగానో, గవర్నెస్ గానో, పనిచెయ్యడానికి వెనుకాడ లేదు. ఆ రోజుల్లో వచ్చిన ఛార్లెట్ బ్రాంటే నవలలో హీరోయిన్ ఉన్నతవర్గ కుటుంబాలలో గవర్నెస్ గా పనిచేస్తున్నట్టు చిత్రించడం కేవలం కాకతాళీయం కాదు. క్రిస్టినా తన కవితలలో (ముఖ్యంగా Maude)ఆనాటి స్త్రీల అభిలాషలని ప్రతిబింబించింది.
PRB సభ్యులు, విజ్ఞాన శాస్త్ర ప్రగతి, ప్రజలు ప్రకృతిని చూడవలసిన రీతిలో చూడడం లేదన్న భావనతో ఏర్పడ్డ సంఘం. వాళ్ళ కవితలలో, చిత్రాలలో సంప్రదాయాన్ని ధిక్కరించి, ప్రకృతిని ఎంత దగ్గరగా ప్రతిఫలించగలిగితే అంతగా దగ్గరగా, ప్రతీకలతో నైనా, ప్రతిఫలించాలన్నది ఒక సూత్రం.
ఈ కవిత ఒక మధ్యతరగతి యువతి మనసులోని ఆలోచన ప్రతిబింబిస్తోంది. ఆఖరి చరణంలోని “సంవత్సరాంతపు చివరి ఆకులు” … జీవిత చరమాంకం లోనైనా అన్నదానికి ప్రతీకగా వాడింది ఆమె.

.
Somewhere or Other
.
Somewhere or other there must surely be
The face not seen, the voice not heard,
The heart that not yet—never yet—ah, me!
Made answer to my word.
.
Somewhere or other, maybe near or far;
Past land and sea, clean out of sight;
Beyond the wandering moon, beyond the star
That tracks her night by night.
.
Somewhere or other, maybe far or near;
With just a wall, a hedge, between;
With just the last leaves of the dying year
Fallen on a turf grown green.
.
Christina Rossetti
(5 December 1830 – 29 December 1894)
English Poet.
For further reading: http://en.wikipedia.org/wiki/Christina_Rossetti
http://www.victorianweb.org/authors/crossetti/rossettibio.html
http://wikis.lib.ncsu.edu/index.php/ENG_463_Christina_Rossetti
Related articles
-
Christina Rossetti’s ‘Goblin Market ‘ (cultureandanarchy.wordpress.com)
-
Featured Poem: Later Life: A Double Sonnet of Sonnets by Christina Rossetti (thereaderonline.co.uk)
- Selected Poems for Group Project (parlindunganpardede.wordpress.com)
స్పందించండి