రోజు: సెప్టెంబర్ 22, 2012
-
ఎక్కడో ఒక చోట… క్రిస్టినా రోజెటి, ఆంగ్ల కవయిత్రి
ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ చూడని వదనమూ, వినని స్వరమూ, నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి . ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో ఖండాలూ, సముద్రాలూ దాటి, కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి, తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల… . ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో, కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా; పచ్చగా పెరిగిన పచ్చికమీద…