అనువాదలహరి

నీకేగనక ఒక స్నేహితుడుంటే… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటిషు కవి

నీకే గనక ఒక ఆప్త మిత్రుడు, శక్తిమంతుడూ, అహం లేనివాడూ,
నీ తప్పులు తెలిసి, నిన్ను బాగా అర్థం చేసుకున్నవాడూ;
నీ శక్తి యుక్తుల మీద అపారమైన నమ్మకం ఉన్నవాడూ
నిన్ను తండ్రిలా సంరక్షించేవాడూ;
చివరిదాకా నిన్ను విడిచిపెట్టక వెన్నంటి ఉండేవాడూ
ప్రపంచం నిన్నెంత పరిహసించినా,
నిన్నుచూసి ఎప్పుడూ ఆనందించేవాడూ,
అలాంటి స్నేహితుడుంటే, నువ్వు తప్పకుండా
అతన్ని సంతోషపెట్టడానికి ఎప్పుడూప్రయత్నం చేస్తూ,
స్నేహాన్ని వదులుకోవాలన్న ఆలోచనే రానీయవు.

.

అదే నీ స్నేహితుడు చాలా గొప్పవాడూ ఉన్నతుడూ అయి,
అతనొక పెద్ద అంతఃపురంలోనో, భవనంలోనో ఉంటూ
ఒక మహరాజులాగ వెలుగొందుతూ ఉంటే,
అందరి నాలుకలమీదా అతని
గుణగణాలే కీర్తింపబడుతుంటే;
అలాంటివాడు, ఒకసారి అశేషజనానీకం మధ్య,
నిన్ను గుర్తించి, నీ ఒక్కడి వంకే చూసి,
తనసింహాసనం దగ్గరకి రమ్మని పిలుస్తే
ఓహ్! నీకు అప్పుడు ఎంత గర్వంగా, ఆనందంగా ఉంటుంది?

.

నీకు ఇలాంటి మిత్రుడు, ప్రాణంలో ప్రాణం, మనస్వి,
శక్తిమంతుడు, నిన్ను విడవనివాడూ గనక ఉంటే
నువ్వతన్ని అన్నిరకాలుగా సంతోషపెట్టడానికి
తప్పకుండా ప్రయత్నిస్తావని ఖచ్చితంగా చెప్పగలను.
నువ్వు ఏ చింతాలేకుండా ధైర్యంగా జీవించగలవు, ఔనా?
నీ రచనల్లో అతని గొప్పదనం భాసిస్తుంది.
అతన్ని గొంతెత్తి కీర్తిస్తావు… కాని అదే విచిత్రం!
అడిగితే మాత్రం, అలాంటిమిత్రుడు “నాకెవరూ లేడ”ని అంటావు;
నిజంగా లేడూ? నాకు నవ్వొస్తుంది. మరి దేముడెవరంటావ్?

.

Courtesy: http://en.wikipedia.org/wiki/File:Robert_W._Service.jpg

రాబర్ట్ విలియం సెర్విస్

(January 16, 1874 – September 11, 1958)

బ్రిటిషు కవి

.

If You Had a Friend

.

If you had a friend strong, simple, true,
Who knew your faults and who understood;
Who believed in the very best of you,
And who cared for you as a father would;
Who would stick by you to the very end,
Who would smile however the world might frown:
I’m sure you would try to please your friend,
You never would think to throw him down.

And supposing your friend was high and great,
And he lived in a palace rich and tall,
And sat like a King in shining state,
And his praise was loud on the lips of all;
Well then, when he turned to you alone,
And he singled you out from all the crowd,
And he called you up to his golden throne,
Oh, wouldn’t you just be jolly proud?

If you had a friend like this, I say,
So sweet and tender, so strong and true,
You’d try to please him in every way,
You’d live at your bravest — now, wouldn’t you?
His worth would shine in the words you penned;
You’d shout his praises . . . yet now it’s odd!
You tell me you haven’t got such a friend;
You haven’t? I wonder . . . What of God?

.

RW Service

(January 16, 1874 – September 11, 1958)

British Poet

Further Reading: http://en.wikipedia.org/wiki/Robert_W._Service

Related articles

%d bloggers like this: