రోజు: సెప్టెంబర్ 20, 2012
-
వయసూ – ముదిమీ … ST కోలరిడ్జ్
తలలూపుతున్న పూలగుత్తులమధ్య తూగాడే పిల్లగాలిలా కవిత్వమూ, వాటిలోని మకరందాన్ని గ్రోలుతున్న తేనెటీగలా ఆశా ఉండేవి. రెండూ నా స్వంతం! వయసులో ఉన్నప్పుడు ఆశా కవిత్వమూ ప్రకృతిలో విహరించేవి! ఓహ్!… (నిట్టూర్పు) వయసులో ఉన్నప్పుడు! అదెప్పటి మాట! ఎంతదురదృష్టం! అప్పటికీ ఇప్పటికీ ఎంత వ్యత్యాశం! ఈ గాలితిత్తి అప్పటికింకా రూపుదిద్దుకోలేదు ఈ శరీరం నాకు క్షమించరాని ద్రోహం చేసింది. ఆ రోజుల్లో పర్వతాగ్రాలమీదా, సైకతశ్రోణులమీదా ఎంత తేలికగ మెరుపులా పరుగులెత్తేది… సరస్సుల్లోనూ, విశాలమైన నదీ ప్రవాహాలమీదా, పూర్వం మనకు…