అనువాదలహరి

Only one Life… Kavi Yakoob, Telugu Poet

You have but only one life…

whether you are glad or gloomy;

win or vanquished;

rejoice or repent;

There is but just one life!

.

Within its scope,

desires pile up like tamarind sprigs

words course through the pathways to reach papers;

the slumbering letters

lie drowsing on the finger tips dreaming of wakening

and the enduring yearning of bodies

swims across the night with aching feet.

.

There is some consolation and some consternation;

.

Some instances and some intentions

beam and blow out like the hands of a clock

*

Would anybody ask about your wellbeing?

Would they bless you with something?

What more anyone would?

What else can anybody ask beyond this,

than asking, and cleansing themselves?

For that matter, what can anybody give?

*

There is but one life that won’t re-start,

and for sure, there is never a second stint.

.

Image Courtesy: Kavi Yakoob

Kavi Yakoob

.

ఒక జన్మే

.

ఉన్నదొకటే జన్మ

నవ్వినా ఏడ్చినా

ఓడినా పోరాడినా

సుఖించినా దుఃఖించినా

ఉన్నదొకటే జన్మ! …

.

ఆ లోపలే చింతచిగురు కుప్పల్లా పిలిచే కోర్కెలు

కాగితాలకు చేరుకునే దారుల్లో పయనిస్తూ పదాలు

వేళ్లకొనలపై కునుకుతూ, జోగుతూ

మెలుకువను కలకంటూ అక్షరాలు

నొప్పెట్టే పాదాల్తో

రాత్రుల్నిఈదే దేహాల తీరనితనం

.

కొంత ఊరట, ఇంకొంత వగపు

కొన్ని సందర్భాలు,కొన్ని సంకల్పాలు

కొడిగడుతూ, వెలుగుతూ గడియారపు ముళ్ళు

*

ఎవరైనా అడుగుతారా కుశలాన్నీ

ఏమైనా తెస్తారా

ఇంకేం ఇస్తారూ ఇంకేం అడుగుతారు

ఇంతకుమించి అడిగి,లోపలంతా కడిగి

ఎవరైనా ఏమివ్వగలరు?!

*

ఒక జన్మే మరలి రాదు తిరిగి,

మరల రానే రాదు

 *

యాకూబ్

%d bloggers like this: