అనువాదలహరి

మనం ఏం చేసుకుంటాం? … చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

మహా బాగుందనుకున్నప్పుడు,

ఈ మానవజాతిలో సాధుత్వం, కొంత అవగాహన,

అప్పుడప్పుడు కొన్ని సాహసకృత్యాలూ ఉంటాయి గాని

మొత్తం మీద ఇది ఒక మంద…

చెప్పుకోదగ్గదేమీ లేని ఒక శూన్య గోళం.


అది మంచి గాఢనిద్రలో ఉన్న ఒక పెద్ద జంతువులా ఉంటుంది;

దాన్నెవ్వడూ మేల్కొలపలేడు.

అది బాగా చురుకుగా ఉన్నప్పుడు మహాక్రూరంగా ఉంటుంది;

స్వార్థపూరితంగా, హత్యలుచేస్తూ,

అన్యాయంగా ప్రవర్తిస్తుంది.

ఇలాంటిమానవజాతిని మనం ఏం చేసుకుంటాం?

ఏమీ చేసుకోలేం.


సాధ్యమైనంతవరకు దానికి దూరంగా ఉండడం మంచిది.

ఏదైనా విషపదార్థాన్నీ,

దుర్మార్గమైనదీ, బుధ్ధితక్కువదాన్నీ ఎలా చూస్తామో అలా చూడాలి.


కానీ, బహుపరాక్!

అది నీ నుండి రక్షించుకుందికి చట్టాలు చేసుకుంది.

నిన్ను ఏ కారణమూ లేకుండానే చంపగలదు!

దాన్నుండి తప్పించుకుందికి

నీకు చాలా నేర్పు కావాలి.

దాన్నుండి  చాలా తక్కువమంది తప్పించుకోగలరు


ఎలా తప్పించుకోవాలో నువ్వే ప్రణాళిక  వేసుకోవాలి

నాకింతవరకూ తప్పించుకున్నవాడు తారసపడలేదు

నేనూ చాలా గొప్పవాళ్ళనీ, పేరున్నవాళ్ళనీ కలిసేను 

కాని, వాళ్లు ఎవరూ తప్పించుకోలేకపోయారు;

ఎందుకంటే వాళ్ల గొప్పదనమూ, పేరుప్రఖ్యాతులూ  

అన్నీ మానవజాతిపరిథిలోనే ఉన్నాయి.


నేనూ తప్పించుకోలేదు.

కాని, పదేపదిసార్లు తప్పించుకునే ప్రయత్నంలో మాత్రం

విఫలం కాలేదు.


చనిపోయేలోగా,

నా జీవితాన్ని అందుకోగలనన్న ఆశ

నాకు ఉంది.

.

Charles Bukowski - Poet on The Edge
Charles Bukowski – Poet on The Edge (Photo credit: waltarrrrr)

చార్ల్స్ బ్యుకోవ్స్కీ  

(August 16, 1920 – March 9, 1994)

అమెరికను కవి

బ్యుకోవ్స్కీ వేలకొద్దీ కవితలూ, వందలకొద్దీ కథలూ, 6 నవలలూ వ్రాసేడు. ఆయన 60కి పైగా పుస్తకాలు  ప్రచురించేడు.

ఈ కవితలో మానవజాతి నైజం మీద ఆయన సంధించిన వ్యంగ్యం విశదంగా వేరే చెప్పనక్కరలేదు. 


.

What can we do?

.

at their best, there is gentleness in Humanity.

some understanding and, at times, acts of

courage

but all in all it is a mass, a glob that doesn’t

have too much.

it is like a large animal deep in sleep and

almost nothing can awaken it.

when activated it’s best at brutality,

selfishness, unjust judgments, murder.

what can we do with it, this Humanity?

nothing.

avoid the thing as much as possible.

treat it as you would anything poisonous, vicious

and mindless.

but be careful. it has enacted laws to protect

itself from you.

it can kill you without cause.

and to escape it you must be subtle.

few escape.

  it’s up to you to figure a plan.

  I have met nobody who has escaped.

  I have met some of the great and

famous but they have not escaped

for they are only great and

famous within Humanity.

I have not escaped

but I have not failed in trying again and

again.

before my death I hope to obtain my

life.

.

Charles Bukowski

(August 16, 1920 – March 9, 1994)

German-born American poet, novelist and short story writer

(from blank gun silencer – 1994)

(Poem Courtesy: http://bukowski.net/poems/what.php)

%d bloggers like this: