కుఠారధారీ, ఈ చెట్టుని విడిచిపెట్టు!… జార్జ్ పోప్ మారిస్

English: Sheet music cover of Woodman! Spare t...
English: Sheet music cover of Woodman! Spare that Tree! by George Pope Morris (Photo credit: Wikipedia)

ఓ, వనజనుడా! ఆ చెట్టుని విడిచిపెట్టు!

దాని ఏ కొమ్మని కూడా తాకవద్దు!

నా చిన్నతనంలో దాని నీడనే ఆడుకున్నాను,

దాన్నిప్పుడు నేను సంరక్షిస్తాను.

మా గుడిశె ముందు మా తండ్రి స్వయంగా నాటిన చెట్టది.

కనుక ఓ వనవాసీ, దాని ఊసెత్తకు.

నీ గొడ్డలితో దాన్ని బాధించకు.

.

ఆ చెట్టు అందరికీ చిరపరిచితం

దాని పేరు ప్రఖ్యాతులు  దేశాలూ,

మహాసముద్రాలు దాటి వ్యాపించేయి.

అటువంటిదాన్ని ఇప్పుడు నరకబోతావా?

ఓ వనచారీ, ఈ నీ ప్రయత్నం మానుకో!

నేలతో దానికున్న అనుబంధాన్ని తెగగొట్టకు.

ఓయి నాయనా! ఆకాశానికి ఎదిగిన

ఆ దేవదారు వృక్షాన్ని విడిచిపెట్టు.

.

నాకు ఏ వ్యాపకమూ లేనప్పుడు

ఈ చెట్టునీదనే కూర్చునే వాడిని;

వాళ్ళ సంతోషాతిశయపు క్షణాల్లో

నా అప్పచెల్లెళ్ళు ఇక్కడే ఆడుకునే వారు;

మా అమ్మ నన్ను కన్నది ఈ చెట్టు క్రిందే;

మా నాన్న నాకు నడక నేర్పిందీ ఈ ఛాయనే…

నా కన్నీళ్ళు నీకు నవ్వుతెప్పిస్తే, క్షమించు

కానీ, ఈ చెట్టుని మాత్రం విడిచిపెట్టు.

.

ఓ నా వృక్షమిత్రమా! నీ బెరడులాగే

నా హృదయతంత్రులుకూడ నిన్ను పెనవేసుకున్నాయి!

నీ గుబురుల్లోనే అడవిపిట్టలు పాటలుపాడేది.

ఇప్పటికీ నీ కొమ్మలు ఆదరంగా స్వాగతిస్తుంటాయి.

ఇదిగో, కుఠారధారీ, ఈ చోటు విడిచిపో!

దాన్ని రక్షించడానికి నాకు చేతులున్నంతవరకూ

నీ గోడ్దలి వేటు దానిమీద పడనీయను…

.

జార్జ్  పోప్ మారిస్

(October 10, 1802 – July 6, 1864) అమెరికను కవీ, సంపాదకుడూ, గీత రచయిత.

George pope Morris,   Nathaniel Parker Willis తో కలిసి సంయుక్తంగా న్యూయార్క్ మిర్రర్ అన్న పత్రిక స్థాపించడమే గాక అది బహుకాలం నడవడానికి తగిన హంగులు సమకూర్చిన వాడు. ప్రఖ్యాత అమెరికను కవి ఎడ్గార్ ఏలన్ పో  కవిత “The Raven” తొలి కాపీని 29 జనవరి 1845 సంచికలో అతని పేరుతో ప్రచురించేడు కూడా. ఉత్తరోత్రా అదే సంవత్సరంలో వ్యవస్థాపకులిద్దరూ కలిసి The Prose and Poetry of America అన్న సంకలనం తీసుకువచ్చారు కూడ. 1846 అతను స్థాపించిన The National Press అన్న పత్రిక ఎన్ని పేరులు మారినా  (Presently, Town and Country)ఇప్పటికీ  నిరాఘాటంగా నడపబడుతోంది.
“Woodman, Spare The Tree” అన్న కవిత అతనికి విశేషకీర్తిని అర్జించిపెట్టింది. పర్యావరణ పరిరక్షణ వాదులు ఇప్పటికీ ఈ కవితని ఎక్కువగా ఉదహరిస్తుంటారు. “The Bride and Other Poems” (1838) అన్న కవితా సంకలనం చాలా ముద్రణలు చూసింది. అంతేగాక, 1839 లో The Little Frenchman and His Water Lots అన్న కథా సంకలనం కూడ వెలువరించేరు.

.

Woodman, spare that tree!
Touch not a single bough!
In youth it sheltered me,
And I’ll protect it now.
‘Twas my forefather’s hand
That placed it near his cot;
There, woodman, let it stand,
Thy axe shall harm it not!

That old familiar tree,
Whose glory and renown
Are spread o’er land and sea,
And wouldst thou hew it down?
Woodman, forbear thy stroke!
Cut not its earth-bound ties;
O, spare that aged oak,
Now towering to the skies!

When but an idle boy
I sought its grateful shade;
In all their gushing joy
Here too my sisters played.
My mother kissed me here;
My father pressed my hand —
Forgive this foolish tear,
But let that old oak stand!

My heart-strings round thee cling,
Close as thy bark, old friend!
Here shall the wild-bird sing,
And still thy branches bend.
Old tree! the storm still brave!
And, woodman, leave the spot;
While I’ve a hand to save,
Thy axe shall hurt it not.
.

George Pope Morris

(October 10, 1802 – July 6, 1864)

American Editor, poet and Song Writer

Further Reading: http://en.wikipedia.org/wiki/George_Pope_Morris

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: